Arjun Suravaram
Barrelakka Sirisha After Telangana Election Results 2023:: కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. బర్రెలక్క అలియాస్ శిరీషా వార్తల్లో నిలిచారు. ఈ రోజు వెలువడిన ఫలితాల్లో నాలుగో స్థానంలో నిలిచారు. అయితే ఈ ఫలితాలపై బర్రెలక్క స్పందించారు.
Barrelakka Sirisha After Telangana Election Results 2023:: కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. బర్రెలక్క అలియాస్ శిరీషా వార్తల్లో నిలిచారు. ఈ రోజు వెలువడిన ఫలితాల్లో నాలుగో స్థానంలో నిలిచారు. అయితే ఈ ఫలితాలపై బర్రెలక్క స్పందించారు.
Arjun Suravaram
తెలంగాణ ఎన్నికల సమరం ముగిసింది. నెల రోజుల పాటు సాగిన ఈ ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 65 స్థానాల్లో ఘన విజయం సాధించింది ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు హస్తం పార్టీ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీషా ప్రత్యేకంగా నిలిచారు. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేకున్న నిరుద్యోగుల తరపున వాయిస్ వినిపించేందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూశారు. అయితే ఆమె 5వేల పై చిలుకు ఓట్లను సాధించింది. ఎన్నికలపై ఆమె స్పందిస్తూ.. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేసింది.
నిరుద్యోగ అభ్యర్ధుల ప్రతినిధిగా తెలంగాణ ఎన్నికల బరిలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచిన బర్రెలక్క సోషల్ మీడియాలో సంచలనం అయ్యారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో బ్యాలెట్ ఓటింగ్‌లో సత్తా చూపించిన బర్రెలక్క తర్వాతి ఓట్ల లెక్కింపులో క్రమంగా వెనుకబడ్డారు. కాంగ్రెస్ హవా ముందు తేలిపోయింది బర్రెలక్క. ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావు తిరుగులేని విజయం సాధించారు. కృష్ణారావు సమీప అభ్యర్థి బీఆర్ఎస్ నేత బి.హర్షవర్ధన్ రెడ్డిపై 28,981 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఇదే సమయంలో బర్రెలక్క 5, 598 ఓట్లు మాత్రమే సాధించి నాలుగో స్థానానికి పరిమైంది. ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా.. ప్రజల మనస్సులో మాత్రం ఘన విజయం సాధించారు. ఎంతో మంది యువతకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు. ఓటమి అనంతరం బర్రెలక్క భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాక ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందించారు. ధనబలం ముందు తాను ఓడిపోయానని ఆమె తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాని, పుట్టగానే ఎవరూ నడవరు. మెల్లగా నడక నేర్చుకుంటారు. తాను ఈసారి ఓడిపోయినా.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తానుని పేర్కొన్నారు. తనకు ప్రజల మద్దతు ఉందని, కానీ పేదదాన్ని కాబట్టి.. ఆమెకే దిక్కులేదని, మనకేం పెడుతుందిలే అని అనుకున్నారు. అలాంటి ఆలోచన విధానం ఉంటే ఏం చేయలేమని శిరీషా పేర్కొన్నారు.
కొల్లాపూర్ నియోజక వర్గంలో నిరుద్యోగులంతా తన వైపు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. తాను ఓడిపోయినంత మాత్రాన.. వెనుతిరగనని, పోరాడుతూనే ఉంటానని శిరీషా స్పష్టం చేశారు. తాను స్వతంత్ర అభ్యర్ధిగానే ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఓడిపోయాను కాబట్టి.. ఎంపీగా ఖచ్చితంగా విజయం సాధిస్తాని శపథం చేశారు. తనది తొలి అడుగే కావచ్చు కానీ.. తన అడుగు గట్టిగానే పడిందని, భయపడేదాన్నే అయితే.. వాళ్ల బెదిరింపులకు వెనకడుగు వేసేదాన్ని అని బర్రెలక్క చెప్పుకొచ్చారు. మరి.. బర్రెలక్క వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.