iDreamPost
android-app
ios-app

ఎన్నికల్లో ఓడినా.. బర్రెలక్క పవన్ కన్నా నయమా? ఎలాగంటే?

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ శిరీషా ప్రత్యేకంగా నిలిచిన సంగతి తెలిసింది. ఆమె నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆమె ఓడిన గెలిచినట్లేనని, పవన్ కంటే ఆమె నయమని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ వివరాలు..

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ శిరీషా ప్రత్యేకంగా నిలిచిన సంగతి తెలిసింది. ఆమె నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆమె ఓడిన గెలిచినట్లేనని, పవన్ కంటే ఆమె నయమని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ వివరాలు..

ఎన్నికల్లో ఓడినా.. బర్రెలక్క  పవన్ కన్నా నయమా? ఎలాగంటే?

నెల రోజుల పాటు సాటు సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెరపడింది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందగా.. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దాదాపు పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. ఇక ఈ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ శిరీషా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లిన బర్రెలక్కకు గెలుపు మాత్రం సాధించలేదు. అయితే మాత్రం జనాల హృదయంలో ఆమె మంచి గుర్తింపు సంపాదించారు.  ఇదే సమయంలో బర్రెలక్కును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పొల్చుతూ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.  ఎన్నికల్లో ఓడినా బర్రెలక్క.. పవన్ కన్నా  నయం అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజవర్గం నుంచి బర్రెలక్క అలియాస్ శిరీషా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. తాను డిగ్రీ చదువుకుని, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా..ప్రభుత్వం కారణంగా బర్రెలను కాస్తున్నానని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. కేవలం ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా.. తనకు, తనలాగా ఎందరో యువతకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు ఈ ఎన్నికలను వేదికగా మార్చుకుంది. నిరుద్యోగుల గళం విప్పుతానంటూ స్వతంత్ర అభ్యర్థిగా పరిలో దిగారు. ప్రజా సమస్యలపై పోరాడు, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ బర్రెలక్క ప్రచారంలో దూసుకెళ్లారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికి బర్రెలక్క ఎక్కడా వెనక్కి తగ్గలేదు.  తాజాగా వచ్చిన ఫలితాల్లో ఆమె ఓడిపోయినప్పటికీ ఆశించిన ఓట్లు పొందారు.  ఇక  ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి.. డిపాజిట్లు కూడా రాలేదు. ఇంకా దారుణం ఏమిటంటే.. నోటాతో పోటీ పడినట్లు కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులకు ఓట్లు పోలయ్యాయి. ఇక 2019 ఏపీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పవన్, 2023 తెలంగాణ ఎన్నికల్లో కూడా ఓటమి చవి చూశాడు. తాజాగా ఫలితాలతో పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్కే నయం అంటూ పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

శిరీషా అతి తక్కువ సమయంలోనే తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతూ.. తన గళాన్ని వినిపించింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం పార్టీని పెట్టి 10 ఏళ్లు దాటిన పూటకో మాట మారుస్తూ, కనీసం పోరాటం చేయకుండా సాగుతున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అతి తక్కువ కాలంలో బర్రెలక్క చూపించిన ప్రభావం పవన్ చూపించలేకపోయారనే వాదనలు కూడా వినిపిస్తోన్నాయి. స్టార్ డమ్ ఉన్న పవన్ కల్యాణ్ ఎక్కడ తన ప్రభావం చూపించడం లేదు. అంతేకాక కార్యకర్తలను, అభిమానులను పట్టించుకోవడం, వారి ఆలోచనలకు అనుగుణం ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయడం వంటివి పవన్ చేయలేదు. పూటకో పార్టీతో పొత్తు పెట్టుకుంటూ జనసైనికులను కన్ఫూజన్ లో పడేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

బర్రెలక్కకు ఉన్నట్లు ఒక్క స్పష్టమైన విధివిధానం పవన్ కల్యాణ్ కి లేవనేది పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోన్న టాక్. అందుకే 2019 ఏపీ ఎన్నికల్లో, 2023 తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు పవన్ కల్యాణ్ ను నమ్మలేదు. ఇలా ఇంత స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కల్యాణ్ పార్టీనే గెలుపు సాధించలేదు. అలాంటిది ఓ సామాన్యురాలు బర్రెలక్క మంచి ఓట్లు సాధించింది. అంటే ఆమె ఈ ఎన్నికల్లో ఓడిన గెలిచినట్లే… పవన్ పరిస్థితి ఏమిటి?. పవన్ కంటే బర్రెలక్క నయం అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.