iDreamPost

మనుషుల్లో మాయమైన మానవత్వం.. ఆర్మీ జవాన్ మృతదేహం రోడ్డు మీద ఉన్నా పట్టించుకోని జనం

మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. సాటి మనిషి ఆపదలో ఉంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓ ఆర్మీ జవాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మృత దేహాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారు జనాలు.

సమాజంలో సైనికులకు ఎనలేని గౌరవం ఉంటుంది. ఇల్లు, పిల్లలను వదిలి కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తారు. నేడు ప్రశాంత వాతావరణంలో జనాలు జీవిస్తున్నారంటే దానికి కారణం సైనికులే అన్నది జగమెరిగిన సత్యం. తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా శత్రు దేశాల నుంచి, ఉగ్రవాదుల నుంచి దేశ సంపదను, ప్రజల ప్రాణాలను కాపాడుతుంటారు ఆర్మీ అధికారులు. అలాంటి సైనికుడు మరణిస్తే జనాలు కనీసం పట్టించుకోకుండా వెళ్లిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. రాను రాను మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోందనడానికి ఇదే నిదర్శనం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ జవాన్ రోడ్డు మీద పడి ఉన్నా పట్టించుకోకుండా వెళ్లిపోయిన తీరు బాధాకరం.

హైదరాబాద్ – గోల్కొండ ఆర్టిలరీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు ఆర్మీ జవాన్ కునాల్. కాగా అతడు ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద నిలబడి ఉండగా రెడీ మిక్సర్ వాహనం ఢీ కొట్టింది. ప్రమాదం అనంతరం ఆ వాహనం ఆగకుండా పరారైంది. ఈ ప్రమాదంలో ఆర్మీ జవాన్ కునాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. విగత జీవిగా పడి ఉన్న జవాన్ మృతదేహాన్ని రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. మాకు ఎందుకులే అన్నట్లుగా చూసి చూడకుండా వెళ్లిపోయారు. దేశాన్ని రక్షించే ఆర్మీ జవాన్ రోడ్డుపై అనాథ శవంలా కనిపించడం మనుషుల్లో మానవత్వం మంటగలిచిపోతుందనడానికి నిదర్శనంగా నిలిచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి