మియాపూర్‌లో ఇల్లు కొనాలా? ధరలు తగ్గాయి! వెంటనే కొనేయండి.. ఆ తర్వాత?

House Prices Reduced In Miyapur: ఇల్లు కొనాలనేది ఎంతోమంది కల. అందులోనూ హైదరాబాద్ లాంటి నగరంలో ఏదో ఒక చోట ఫ్లాట్ గానీ ఇల్లు గానీ కొనాలని అనుకుంటారు. కానీ రేట్లు చూస్తుంటే ఏటా పెరిగిపోతున్నాయి. కానీ తగ్గడం లేదన్న బాధ. మరి ఆ బాధను తీరుస్తూ రియల్ ఎస్టేట్ సడన్ గా దూకుడు తగ్గించుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు చోట్ల ఇళ్ల ధరలు తగ్గాయి. మియాపూర్ లో కూడా తగ్గాయి. ఎంత తగ్గాయంటే?

House Prices Reduced In Miyapur: ఇల్లు కొనాలనేది ఎంతోమంది కల. అందులోనూ హైదరాబాద్ లాంటి నగరంలో ఏదో ఒక చోట ఫ్లాట్ గానీ ఇల్లు గానీ కొనాలని అనుకుంటారు. కానీ రేట్లు చూస్తుంటే ఏటా పెరిగిపోతున్నాయి. కానీ తగ్గడం లేదన్న బాధ. మరి ఆ బాధను తీరుస్తూ రియల్ ఎస్టేట్ సడన్ గా దూకుడు తగ్గించుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు చోట్ల ఇళ్ల ధరలు తగ్గాయి. మియాపూర్ లో కూడా తగ్గాయి. ఎంత తగ్గాయంటే?

ఇల్లు కొనడం ఒక ఆర్టు. బంధువుల ముందు, స్నేహితుల ముందు నాకుందిరా రేయ్ అని అనిపించుకోవడం కోసం కొనుక్కునేవాళ్ళు కొందరైతే.. ఎహే ఉండడానికి కావాలని కొనుక్కునేవారు కొందరు. ఇంకో రకం ఉంటారు. వీళ్ళు ఇల్లు కొనడాన్ని వ్యాపార కోణంలో చూస్తారు. మీరు ఏ రకం అయినా గానీ హైదరాబాద్ లో ఇల్లు కొనాలి అని అనుకుంటున్నట్లైతే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రధాన ఏరియాల్లో పలు చోట్ల ఇళ్ల ధరలు తగ్గాయి. కొన్ని చోట్ల భారీగా తగ్గగా.. కొన్ని చోట్ల సోసోగా తగ్గాయి. అయితే మియాపూర్ లో ఇల్లు కొనడం మీ ఛాయిస్ అయితే కనుక ఇప్పుడు తగ్గిన ధరలతో కొనుగోలు చేస్తే గనుక ఫ్యూచర్ లో ధరలు పెరిగితే భారీ లాభాలు పొందవచ్చు.

పలు నివేదికల ప్రకారం.. కనీసం 10 లక్షలైనా లాభం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ గా మియాపూర్ లోని ఇళ్ల మీద 10 లక్షలు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. గతంలో ఒక 2 బీహెచ్కే ఫ్లాట్స్ ఒక్కొక్కటీ 82 లక్షలు ఉంటే ఇప్పుడు 72 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. నార్త్ హైదరాబాద్ లో ఉన్న మియాపూర్ లో గడిచిన ఐదేళ్ళలో 5 సార్లు ఇళ్ల ధరలు తగ్గాయి. 2019 ఏప్రిల్-జూన్ నెలల్లో చదరపు అడుగు రూ. 3800 ఉండగా.. 2020 ఏప్రిల్-జూన్ నెలలకు వచ్చేసరికి రూ. 3,100కి తగ్గింది. 2021 ఏప్రిల్-జూన్ నెలల్లో రూ. 4,300కి పెరిగింది. 2022 ఏడాది ఏప్రిల్-జూన్ నెలల్లో రూ. 5,150కి పెరిగింది. 2023 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు ఫ్లాట్ రూ. 5,450 ఉండగా.. డిసెంబర్ నెల వచ్చే నాటికి రూ. 7,200కి పెరిగిపోయింది.

2024 వచ్చేనాటికి మాత్రం రియల్ ఎస్టేట్ కాస్త డౌన్ అయ్యింది. జనవరి-మార్చి నెలల్లో రూ. 6,900కి పడిపోగా.. ప్రస్తుతం రూ. 6 వేలకు పడిపోయింది. అంతకు ముందు గజం ఫ్లాట్ ధర యావరేజ్ గా రూ. 62,100 ఉండగా ఇప్పుడు 54 వేల రూపాయలు అయ్యింది. అంటే గజం మీద 8 వేలు తగ్గినట్టు. ఈ లెక్కన మీరు 2 బీహెచ్కే ఫ్లాట్ లేదా ఇల్లు కొన్నట్లైతే రూ.72 లక్షలు అవుతుంది. అంతకు ముందు ఈ ఏరియాలో 82 లక్షలకు వచ్చే ఫ్లాట్ ఇప్పుడు 72 లక్షలకే వస్తుంది. అంటే మీకు ఏకంగా 10 లక్షల వరకూ ఆదా అయినట్లే. అంటే రియల్ ఎస్టేట్ మళ్ళీ గాడిన పడితే ఈ రేట్లు మళ్ళీ యధావిధిగా కొనసాగుతాయి. లేదా పెరిగినా పెరుగుతాయి. ఎలా చూసినా కానీ ఇప్పుడు ఆదా అయిన డబ్బంతా అప్పుడు లాభమే. కాబట్టి మియాపూర్ లో ఇల్లు కొనాలి అనుకుంటే కనుక ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత ఇళ్ల రేట్లు పెరిగిపోతే కొనలేకపోయామే అని బాధపడాల్సి వస్తుంది. 10 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తుంది.    

  

గమనిక:

ఈ కథనం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఆ ఏరియాల్లో యావరేజ్ ధరల ఆధారంగా ఇవ్వబడిన సమాచారం మాత్రమే. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

Show comments