iDreamPost
android-app
ios-app

అదిరిపోయే శుభవార్త..తెలంగాణ మహిళలకు కోసం మరో కొత్త పథకం!

  • Published Jul 08, 2024 | 9:12 AM Updated Updated Jul 08, 2024 | 9:12 AM

New Scheme for Telangana Women: తెలంగాణ మహిళల కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం పలు సక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలు మరింత ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరో గొప్ప పథకం తీసుకురాబోతుంది.

New Scheme for Telangana Women: తెలంగాణ మహిళల కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం పలు సక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలు మరింత ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరో గొప్ప పథకం తీసుకురాబోతుంది.

అదిరిపోయే శుభవార్త..తెలంగాణ మహిళలకు కోసం మరో కొత్త పథకం!

తెలంగాణలో గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు.తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు బీమా సౌకర్యం, రూ.500 వలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ లాంటి పథకాలు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన ఒక్కో మహిళలకు రూ.2500 వారి ఖాతాల్లో జమ చేసేందుకు సిద్దమవుతుంది.త్వరలో మరో గొప్ప పథకం అమలు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. ఇదే పథకం కింద త్వరలో అర్హులైన ప్రతి మహిళకు వారి అకౌంట్ లో రూ.2500 జమ చేయనుంది. తాజాగా తెలంగాణ సర్కార్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను మహిళా శక్తి పథకాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఈ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టగా.. పథకం కింద తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలకు దేశవాళి కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలు అలాగే పౌల్ట్రీ ఫారాలు, పాడి పశువులు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పథకం ద్వారా మహిళలు ఆయా యూనిట్లు నిర్వహించేందుకు గాను బ్యాంకులు, స్త్రీ నిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం పొందే సదుపాయం కల్పించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఈ యూనిట్ల కోసం ఎంపిక చేయాల్సిదిగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రతి యూనిట్ కి రూ.2.91 లక్షల చొప్పున రుణం మంజూరు చేస్తారు. సొంత స్థలం ఉండి షెడ్డు వేసుకొని కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే వారికి ఈ పథకం కింద ఎంపిక చేస్తారు.