హోస్ షిఫ్టింగ్ కోసం మీరు ఇలా చేస్తే.. సైబర్ నేరగాళ్లకు చిక్కినట్టే

నగరంలో తరుచు రకరకాల సైబర్ మోసాలు వెలుగులోకి వస్తుంటాయి. చాలామంది కేటుగాళ్లు ఈజీగా డబ్బులను సంపాదించాలనే నేపంతో టెక్నాలజీని ఉపాయోగించుకొని అడ్డదారులను తొక్కుతూ అమాయకపు ప్రజలను టార్గెట్ చేసి బురిడి కొడుతున్నారు. తాజాగా ఈ క్రమంలోనే ప్యాకర్స్ అడ్ మూవర్స్ సర్వీస్ తో భారీ మోసంకు పాల్పడ్డారు. కానీ, చివరిలో కేటుగాళ్లకు ఊహించని ట్వీస్టు ఎదురైంది.

నగరంలో తరుచు రకరకాల సైబర్ మోసాలు వెలుగులోకి వస్తుంటాయి. చాలామంది కేటుగాళ్లు ఈజీగా డబ్బులను సంపాదించాలనే నేపంతో టెక్నాలజీని ఉపాయోగించుకొని అడ్డదారులను తొక్కుతూ అమాయకపు ప్రజలను టార్గెట్ చేసి బురిడి కొడుతున్నారు. తాజాగా ఈ క్రమంలోనే ప్యాకర్స్ అడ్ మూవర్స్ సర్వీస్ తో భారీ మోసంకు పాల్పడ్డారు. కానీ, చివరిలో కేటుగాళ్లకు ఊహించని ట్వీస్టు ఎదురైంది.

ఇటీవల కాలంలో నగరంలో రకరకాల సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సైబర్ కేటుగాళ్లు అడగడుగునా కొత్త దారులను వెతుకుంటూ ప్రజలను మోసం చేసే పనిలో ఆరి తేరిపోయున్నారు. ఇక ఇప్పుడు వీరి ఐడియాలకు టెక్నాలజీ కూడా తోడవ్వడంతో వీరి అగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈజీగా డబ్బు సంపాదించాలనే నేపంతో అడ్డదారులను తొక్కుతూ అమాయకపు ప్రజలను టార్గెట్ చేసి బురిడి కొడుతున్నారు.  కాగా, ఇప్పటికే ఈ కేవైసీలు, గిఫ్ట్ కార్డులు, లాటరీలు, ఖరీదైన గిఫ్టుల పేరుతో లింకులు పంపించి ఖాతాలు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే.  ఇక వీరి ఉచ్చులో రోజు రోజుకి చాలామంది బలైపోతున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా నగరంలోని సైబర్ కేటుగాడు  మళ్లీ కొత్త తరహా ప్లాన్ తో ఓ యువకుడుని మోసం చేశాడు. కానీ, తెలివిగా ఆ యువకుడు ఆ సైబర్ నేరగాడి ఆట కట్టించి జైలు పోలీసులకు చిక్కేలా చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ యువకుడు ఇల్లు మారేందుకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ సర్వీస్ కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు. ఈ క్రమంలోనే.. ఓ సైబర్ నేరగాడు సదరు యువకుడిని మోసం చేయాలని ప్లాన్ చేశాడు. అందుకోసం ఓ నకిలీ  వెబ్‌సైట్ ను పెట్టి ఆ యువకుడి ఇంటి సామాన్లు తరలింపునకు తాము వెహికల్ ఏర్పాటు చేస్తామని నమ్మబలికాడు. దీంతో చెప్పిన విధంగానే నగరానికి చెందిన ఓ లారీని యువకుడి ఇంటికి పంపించాడు. ఇక ఆ లారీలో సామాన్లు ఎక్కించిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ, సాయంత్రం అయినా ఆ యువకుడు చెప్పిన అడ్రస్ కు సామాన్లు రాకపోవడంతో ఆ యువకుడికి అనుమానం వచ్చింది. దీంతో సామాన్లతో సహా లారీ డ్రైవర్ పరారయ్యాడని విషయం తెలుసుకొని వెంటనే ఆ యువకుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

అయితే సామాన్లు తరలించే సమయంలోనే సదరు యువకుడు తెలివిగా డ్రైవర్ కు తెలియకుండా తన సామన్లతో జీపీఎస్ ట్రాకర్ ను అమర్చాడు. దీంతో యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాకర్ సాయంతో లారీ ఎక్కడుందో కనిపెట్టడానికి ఈజీ అయ్యింది. వెంటనే కనుక్కొని నిందితుడిని అరెస్టు చేశారు.  అలాగే యువకుడు చాకచక్యంగా వ్యవహరించడంతో.. తన సామాన్లు కూడా చోరి కాకుండా.. కాపాడుకోగలిగాడు. ఇక పోలీసులు కూడా ఆ యువకుడి తెలివితేటలకు ప్రశంసిస్తూ.. మరోసారి ఇలాంటి అపరిచిత లింక్స్ ను ఓపెన్ చేయవద్దని జాగ్రత్తగా ఉండమని సూచించారు. మరి, నగరంలో ఈ తరహా కొత్త మోసం వెలుగులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments