Swetha
సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ చేసి.. గంజాయి విక్రయిస్తున్న ఓ కేడి లేడిని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి భారీగా మొత్తంలో గంజాయిని, డబ్బును సీజ్ చేశారు పోలీసులు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ చేసి.. గంజాయి విక్రయిస్తున్న ఓ కేడి లేడిని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి భారీగా మొత్తంలో గంజాయిని, డబ్బును సీజ్ చేశారు పోలీసులు.
Swetha
హైదరాబాద్ లో గంజాయి సరఫరా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలో పోలీసులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ.. గంజాయి విక్రేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకించి ఓ టీమ్ ను కూడా ఏర్పాటు చేసి గంజాయి సరఫరాను ఆపివేసే దిశగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది గంజాయి విక్రేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్.. నానక్ రామ్ గూడలో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళను.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయి, డబ్బును సీజ్ చేశారు. అలాగే సైబరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
నానక్ రామ్ గూడాకు చెందిన నీతూ బాబు అనే మహిళ.. గత కొన్నేళ్ల నుంచి ఈ గంజాయి దందాను నడిపిస్తోంది. పైగా ఈ మహిళ కుటుంబం మొత్తం ఇదే దందాలో జీవనం కొనసాగిస్తున్నట్లు.. పోలీసుల విచారణలో బయటపడింది. అయితే, ఈ మహిళ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లనే టార్గెట్స్ గా పెట్టుకుని.. ఈ వ్యాపారం చేస్తోంది. ఆమె ప్రతిరోజూ దాదాపు 20 లక్షల విలువైన గంజాయిని అమ్ముతున్నట్లు.. పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ అమ్మకాల ద్వారా కొన్ని కోట్ల రూపాయలను సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ అమ్మకాల విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమె ఇంటిపై దాడులు నిర్వహించి.. 20 కేజీల గంజాయిని, రూ.20 లక్షల నగదును సీజ్ చేశారు. గతంలో కూడా ఈ మహిళ ఇదే కేసులో పోలీసుల వలకు చిక్కింది. అయినా కూడా ఈ మహిళలో ఎటువంటి మార్పు రాలేదు. ఇక తాజాగా మరోసారి ఈ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
అంతేకాకుండా సైబరాబాద్ పరిధిలో.. భారీగా గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో భారీగా గంజాయి చాక్లేట్లను పట్టుకున్నారు. దానితో పాటూ నిషేధించబడిన సిగేరేట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. డిమెట్లలో 1500 గంజాయి చాక్లెట్స్, పటాన్‌చెరులో 1960 చాక్లెట్స్, నిజాంపేట్‌లో 114 ప్యాకెట్స్ ఈ-సిగరెట్లు సీజ్ చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.