iDreamPost

వైద్యుల నిర్లక్ష్యం.. ప్రసవం కోసం వచ్చిన మహిళ మృతి

  • Published Mar 23, 2024 | 2:14 PMUpdated Mar 23, 2024 | 2:14 PM

ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రిల్లోని దారుణ ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులకు, ముఖ్యంగా గర్భిణీలకు సకాలంలో వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజగా ప్రసవం కోసం ఓ గర్భిణీ మహిళ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడంతో అక్కడ డాక్టర్ చేసిన పనికి జరగరాని ఘోరమే జరిగిపోయింది.

ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రిల్లోని దారుణ ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులకు, ముఖ్యంగా గర్భిణీలకు సకాలంలో వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజగా ప్రసవం కోసం ఓ గర్భిణీ మహిళ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడంతో అక్కడ డాక్టర్ చేసిన పనికి జరగరాని ఘోరమే జరిగిపోయింది.

  • Published Mar 23, 2024 | 2:14 PMUpdated Mar 23, 2024 | 2:14 PM
వైద్యుల నిర్లక్ష్యం.. ప్రసవం కోసం వచ్చిన మహిళ మృతి

ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఆసుపత్రిల్లోని దారుణ ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అందుకు కారణం ఆసుపత్రిలోని వైద్యులు చూపించే నిర్లక్ష్య వైఖరి అని అంటున్నారు. ఎందుకంటే.. మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులకు, ముఖ్యంగా గర్భిణీలకు సకాలంలో వైద్యం అందించడం లేదు.  దీంతోపాటు వారికి కనీస మౌలిక సదుపాయాలను అందించకపోగా.. సరైన సమయానికి ప్రసవం చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే నగరంలో ఇప్పటికే చాలమంది గర్భిణీలు ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మరణించిన ఘటనలు చాలా జరిగాయి. అయితే తాజాగా మరో గర్భిణీ మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లడంతో అక్కడ డాక్టర్ చేసిన పనికి జరగరాని ఘోరమే జరిగిపోయింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింతను బలిగొన్నారు. తీవ్ర రక్తస్రావం జరగడటంతో ఆ మహిళ పరిస్థితి విషమంగా మారి మృతి చెందింద. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన మేడమాని కల్పన గర్భవతి. కాగా, ప్రసవం కోసం ఆమె భర్త అంజేనయులు గురువారం అచ్చంపేట వంద పడకల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రసవం చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది గర్భిణీ స్త్రీని సిద్ధం చేశారు. అయితే, అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్.. తనకు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోలేదని అక్కస్సుతో ప్రసవం చేయకుండా నిరాకరించి. దీంతో భార్య ఆవేదన చూసిన ఆంజనేయులు అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లి అక్కడ వైద్యులకు సంప్రదించాడు. కాగా, అక్కడ తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలంటే.. రూ.35 వేలు అవుతుందని చెప్పడంతో అంత మొత్తం నగదును చెల్లించేందుకు భర్త అంగీకరించాడు. ఇక గురువారం రాత్రి ప్రైవేటు ఆసుపత్రిలో ఆ గర్భిణీకి వైద్యులు సర్జరీని నిర్వహించారు. ఇక సర్జరీ చేసిన అనంతరం ఆ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పసిబిడ్డ క్షేమంగా ఉన్నా..బాలింతకు మాత్రం తీవ్ర రక్తస్రావం జరిగింది. కాగా, అది ఎంతకు ఆగకపోవడంతో ఈ నేపథ్యంలోనే ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది మహిళ పరిస్థితి విషమంగా మారిందని వెంటనే జిల్లా ప్రభుత్వ కేంద్రానికి తీసుకెళ్లామని సూచించడంతో భర్త తీసుకెళ్లానన్నాడు.

కానీ, ఆ బాలింతను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు గర్భసంచిని తొలగిస్తే రక్తస్రావం ఆగిపోతుందని భర్త ఆంజనేయులు ఒప్పుకున్నాడు. ఇక ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించినప్పటికీ కూడా రక్తస్రావం ఎంతకీ ఆగలేదు. దీంతో బలవంతంగా అతడితో కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, బాధితురాలి భర్త ఆంజనేయులు తెలిపాడు. ఇక బయట మరికొన్ని పరీక్షలు చేయించుకోవాలని అతడితో చెప్పాగా..వెళ్లి వచ్చేసరికి అతడి ప్రమేయం లేకుండానే తన భార్యను అంబులెన్స్ లోకి ఎక్కించారని పేర్కొన్నాడు. కానీ, అప్పటికే తన భార్య చనిపోయిందని వారితో కొంతసేపు వాదనకు దిగినా వినకుండా..బలవంతగా ఆక్సిజన్ పెట్టి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని ఆదేశించారని భర్త వాపోయాడు. దీంతో జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు మేమోని కల్పన (29) మృతి చెందినట్లు భర్తకు తెలిపారు.

ఇక తన భార్య చనిపోవడానికి కారణం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులేనని, అక్కడ సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగుండేది కాదనీ, అతను రోధించాడు. ఇక పుట్టిన బిడ్డ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఉండగా.. తల్లి మాత్రం గాంధీ ఆసుపత్రిలో మృతి చెంది ఉండే ఈ ఘటన పై అటు భర్త, కుటుంబ సభ్యులతో పాటు స్థానికులకు కూడా కంటతడి పెట్టించింది. ఇక భార్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని , తమకు తగిన న్యాయం చేయాలని భర్త ఆంజనేయులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మరి, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వలన ఓ బాలింత మృతి చెందిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి