అధిక వడ్డీ ఆశ చూపించాడు.. రూ.50 కోట్లు ముంచాడు!

Uppal Issue: ఈ మధ్య కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఎన్నో అక్రమాలు, అన్యాయాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారికి మాయమాటలు చెప్పి నిండు ముంచుతున్నారు.

Uppal Issue: ఈ మధ్య కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఎన్నో అక్రమాలు, అన్యాయాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారికి మాయమాటలు చెప్పి నిండు ముంచుతున్నారు.

ఇటీవల కొంతమంది డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాన్ని గడపాలని చూస్తున్నారు. ఇందుకోసం అమాయకులకు మాయ మాటలు చెప్పి నిండా ముంచుతున్నారు. కొంతమంది కేటుగాళ్లు మీరు ఫలానా కంపెనీలో పెట్టుబడి పెడితో రెండంతలు అధిక డబ్బు వస్తుందని నమ్మించి మోసాలకు పాల్పపడుతున్నారు. మరికొంతమంది అధిక వడ్డీ ఆశ చూపించి జనాలకు కుచ్చు టోపీ పెడుతున్నారు. అసలు విషయం తెలిసేలోపు కంటికి కనిపించకుండా ఉడాయిస్తున్నారు. దీంతో లబో దిబో అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. అలాంటి ఘటనే బొడుప్పల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.50 కోట్లు టోకరా వేశాడు ఓ కేటుగాడు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తమ డబ్బు తమకు చెల్లించాలని నిందితుని ఇంటి వద్ద బాధితులు ఆందోళనుకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పది రూపాయల వడ్డీ ఆశ చూపించి బోడుప్పల్ మునసిపల్ కార్పోరేషన్, రాఘవేంద్ర నగర్ చుట్టు పక్కల కాలనీ వాసుల వద్ద సుమారు రూ.50 కోట్ల వరకు భాషెట్టి నాగరాజు అనే వ్యక్తి వసూలు చేశాడని తెలిపారు. ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుండి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. కొంతమంది క్రెడిట్ కార్డులు తీసుకొని అందులో నుంచి డ్రా చేసుకున్నాడని.. తమ డబ్బు తమకు ఇవ్వాలని అడిగితే మూడు నెలలుగా కనిపించకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అధిక వడ్డీ ఆశ చూపించి అందరినీ దారుణంగా ముంచాడని ఆరోపిస్తున్నారు. మూడు నెలల క్రితమే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని.. బాధితుల డబ్బుల సమస్య కొలిక్కి రాకపోవడంతో నాగరాజు ఇంటి ముందు ఆందోళన చేస్తున్నామని అన్నారు. తమ వద్ద లక్షల్లో డబ్బు తీసుకొని కొన్ని నెలలు వడ్డీ కట్టి నమ్మించాడని.. తర్వాత వడ్డీ లేదు, అసలు లేకపోవడంతో నాగరాజు అసలు రంగు బయటపడింందని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు. కష్టపడి దాచుకున్న డబ్బు నమ్మి అతని చేతిలో పెడితే దారుణంగా మోసం చేశాడని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించేలా వెంటనే పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

Show comments