Tirupathi Rao
TS SSC 2024 Results- Government School Student: ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు.
TS SSC 2024 Results- Government School Student: ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు.
Tirupathi Rao
తెలంగాణ పదో తరగతి ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫలితాల్లో బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి టోటల్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. గతేడాది టీఎస్ ఎస్సెస్సీ ఓవరాల్ పర్సెంటేజ్ 83.60గా ఉంది. ఈ ఏడాది అది 91.31కి చేరింది. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99.09 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. అన్ని జిల్లాల కంటే తక్కువగా వికారాబాద్ జిల్లాలో కేవలం 65.10 శాతం ఉత్తీర్ణత మాత్రమే సాధించారు. ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. నిజామాబాద్ నుంచి ఓ విద్యార్థిని బెస్ట్ గ్రేడ్ సాధిచింది.
కార్పొరేట్ విద్య మొదలయ్యాక.. చదువు అంటే ప్రైవేటు పాఠశాలల్లోనే చదివించాలి అని చాలా మంది తల్లిదండ్రులు భ్రమలో ఉంటున్నారు. అలాంటి వారికి ఈ అమ్మాయి బెస్ట్ ఉదాహరణ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలోనే చదివి మంచి గ్రేడ్ సాధించింది. మిర్చి బండి నిర్వహిస్తూ ఎంతో కష్టపడి తన తండ్రి తనని చదివిస్తున్నాడు. ఆయన కష్టానికి తగిన విజయాన్ని ఈ విద్యార్థిని సాధించింది. జామాబాద్ లోని ఆర్యనగర్ కు చెందిన స్వప్న- రాజు దంపతుల కుమార్తె తృషణ. ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్ అయిన ఈ అమ్మాయికి పదో తరగతిలో 9.5 జీపీఏ దక్కింది. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలకు బెస్ట్ విద్య అందదు అనుకునే చాలామంది తల్లిదండ్రులకు ఇది బెస్ట్ ఉదాహరణగా చెప్పచ్చు.
తనకు పదో తరగతి ఫలితాల్లో 10కి 9.5 జీపీఏ రావడంపై విద్యార్థిని తృషణ ఆనందం వ్యక్తం చేసింది. తాను ఇంత మంచి మార్కులు సాధించడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయులు అందించిన విద్య అంటూ విద్యార్థిని వ్యాఖ్యానించింది. “మా అమ్మానాన్న ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా.. నన్ను చదువుకోనిచ్చారు. అన్ని విషయాల్లో నాకు సపోర్టుగా నిలిచారు. మరోవైపు మా ఉపాధ్యాయులు కూడా నా ఈ విజయానికి ప్రధాన కారణం.
ఏరోజు ఎలాంటి డౌట్ వచ్చి అడిగినా.. అర్థమయ్యేలా వివరించేవాళ్లు. మా క్లాస్ లో కూడా విద్యార్థులను గ్రూపులుగా విభజించి.. సిలబస్ ని అందరికీ అర్థమయ్యేలా చెప్పేవాళ్లు. ఉదయం పూట స్పెషల్ క్లాసెస్ పెట్టి మాకు పాఠాలు చెప్పేవాళ్లు. మనం ఎక్కడ చదువుతున్నాం అనేది ముఖ్యం కాదు.. ఎలా చదువుతున్నాం అనేదే ముఖ్యం” అంటూ విద్యార్థిని తృషణ చెప్పుకొచ్చింది. ఈ అమ్మాయి చెప్పిన మాటలు ఎంతో మందికి కనువిప్పు కావచ్చు. ఎందుకంటే ఎక్కడ చదువుతున్నాం అన్న దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ, ఎలా చదువుతున్నాం అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.