హైదరాబాద్‌లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్

హైదరాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడం ఇప్పుడు కలవరపాటుకు గురి చేస్తుంది. అది కూడా కార్మికులు పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడం ఇప్పుడు కలవరపాటుకు గురి చేస్తుంది. అది కూడా కార్మికులు పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ మహా నగరం మరింత విస్తరిస్తోంది. భాగ్యనగరానికి ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుండి ఉపాధి, చదువు కోసం ఇక్కడకు వస్తుంటారు. దీంతో జనాభా పెరుగుతోంది. జనాభా పెరగడంతో పట్టణీకరణ అభివృద్ది చెందుతూనే ఉంది. ఇక్కడ నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కట్టడాలు, నిర్మాణాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. పెద్ద పెద్ద భవనాలు నిర్మితమౌతున్నాయి. అపార్ట్ మెంట్స్ లేదా షాపింగ్ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, మల్లీ ఫ్లెక్సులు వంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక పోతే ఈ నిర్మాణాల్లో డొల్లతనం ఒక్కొక్కసారి బయటపడుతుంది. మొన్న ఓ చోట నిర్మాణంలో వంతెన కూలిన సంగతి మర్చిపోక ముందే.. ఇప్పుడు నిర్మిస్తున్న బిల్డింగ్ స్లాబ్ కూలిపోవడం కలవరపాటుకు గురి చేస్తుంది.

నిర్మాణంలో ఉన్న ఓ బిల్లింగ్ స్లాబ్ కుప్పకూలిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో శనివారం ఈ ఘటన జరిగింది. పుప్పాల్ గూడలోని అల్కాపూర్ రోడ్డు నెంబర్ 14లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ స్లాబ్ శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. నాసిరకమైన మెటీరియల్ వాడటంతోనే  ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై యాజమాన్యం దాడికి యత్నించినట్లు తెలుస్తోంది

బిల్డర్స్ నాసిరకమైన మెటీరియల్ వాడి స్లాబ్ వేస్తుండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ఏమీ జరగనట్లు కవర్ చేసేందుకు మేనేజ్ మెంట్ విశ్వ ప్రయత్నాలు చేసింది. మేటర్ బయటకు పొక్కేసింది. అక్కడకు ఎవరినీ రానివ్వకుండా.. ‌ఇరువైపుల రోడ్డును అధికారులు మూసివేశారు. కాగా, ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో నిర్మాణ సంస్థలు చెలగాటం ఆడుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ.. అదే జరిగి ఉంటే.. తీవ్రత స్థాయి ఎక్కువ ఉండేదని అంటున్నారు. ఇదంతా నాసిరకమైన మెటీరియల్స్ వాడటం వల్లే జరిగిందన్న చర్చ నడుస్తుంది

Show comments