గవర్నమెంట్ స్కూల్లో దారుణం.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత

తెలంగాణలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం తిన్న 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆందోళన నెలకొన్నది.

తెలంగాణలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం తిన్న 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆందోళన నెలకొన్నది.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆందోళనలు హాట్ టాపిక్ గా మారాయి. సౌకర్యాల లేమి, ఫుడ్, టీచర్ల వేధింపులు ఇలా పలు కారణాలతో స్టూడెంట్స్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికార యంత్రాంగంలో మార్పు రావడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఏకంగా 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అటు అధికారులు, ఇటు తల్లిదండ్రుల్లో టెన్షన్ క్రియేట్ అయ్యింది. విద్యార్థుల్లో పలువరికి సీరియస్ గా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన 100 మంది విద్యార్థులు ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. అన్నం, పప్పు, గుడ్డు తిన్న తర్వాత వాంతులు విరేచనాలు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు స్పృహ లేకుండా పడిపోవడంతో అంతా ఆందోళన చెందారు. వెంటనే పాఠశాల సిబ్బంది అనారోగ్యానికి గురైన విద్యార్థులను వైద్యం కోసం మక్తల్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండగా వారిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాప్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని బెడ్స్ అన్నీ విద్యార్థులతో నిండిపోయాయి. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

కాగా విద్యార్థులు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న డీఈవో హుటాహుటిన ప్రభుత్వ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డీఈవోతో వాగ్వాధానికి దిగారు. ఇది వరకు పలుమార్లు ఫుడ్ పాయిజన్ జరిగినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ కు కారణం అధికారుల నిర్లక్ష్యమే అని ఫైర్ అయ్యారు. వంట ఏజెన్సీ, హెచ్‌ఎం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని మార్చాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో మాట్లాడి పిల్లల పరిస్థితి తెలుసుకున్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూండా చూడాలన్నారు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ స్కూల్ హెచ్ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్​చార్జ్ హెచ్‌ఎం బాపురెడ్డిని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సస్పెండ్ చేశారు. 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments