iDreamPost
android-app
ios-app

యమహా స్కూటర్‌లో హైటెక్ ఫీచర్లు.. దొంగిలించినా దొరికేస్తుంది!

యమహా కంపెనీ సరికొత్త స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. హైటెక్ ఫీచర్లతో రూపొందించిన ఈ స్కూటర్ ను దొంగలు ఎత్తుకెళ్లే ఛాన్స్ లేదు. ఒక వేళ దొంగిలించినా దొరికేస్తుంది.

యమహా కంపెనీ సరికొత్త స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. హైటెక్ ఫీచర్లతో రూపొందించిన ఈ స్కూటర్ ను దొంగలు ఎత్తుకెళ్లే ఛాన్స్ లేదు. ఒక వేళ దొంగిలించినా దొరికేస్తుంది.

యమహా స్కూటర్‌లో హైటెక్ ఫీచర్లు.. దొంగిలించినా దొరికేస్తుంది!

ప్రముఖ టీవీలర్ తయారీ కంపెనీ యమహా సరికొత్త మోడళ్లను రూపొందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. మార్కెట్ లో యమహా బైక్ లకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల అధునాతన టెక్నాలజీని వాడి దొంగలు కొట్టేస్తారు అనే టెన్షన్ లేకుండా హైటెక్ ఫీచర్లను పొందుపరుస్తూ ఓ స్కూటర్ ను విడుదల చేసింది యమహా. ఇటీవల భారత్ లో ఎయిరాక్స్ 155ఎస్ వెర్షన్ ను రిలీజ్ చేసింది యమహా కంపెనీ. ఈ స్కూటర్ ను దొంగలు చోరి చేసినా ఎక్కడ ఉందో తెలిసిసోతుంది. ఈ స్కూటర్ ను దొంగలు దొంగిలించలేరు. అంతే కాదు ఈ స్కూటర్ లో కళ్లు చెదిరే ఫీచర్లను అందించిది కంపెనీ. మరి ఈ స్కూటర్ ధర ఎంత? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

యమహా ఎయిరాక్స్ 155ఎస్ వెర్షన్ లో స్మార్ట్ కీ టెక్నాలజీని అందించారు. సిస్టమ్ ఆన్సర్ బ్యాక్, అన్‌లాక్, ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కీలెస్ ఇగ్నిషన్ స్మార్ట్ కీ సిస్టమ్ మరొక ప్రయోజనం ఏమిటంటే, కీ వాడకుండానే స్కూటర్‌ను స్టార్ట్ చేయొచ్చు. అంతే కాదు కీ దగ్గరగా లేనప్పుడు ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా స్కూటర్ దొంగిలించబడకుండా చేసుకోవచ్చు. దీని ధర రూ.1,50,600 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ అథ్లెటిక్ డిజైన్‌ను కలిగి ఉంది.

ట్రాక్షన్ కంట్రోల్‌ అమర్చి ఉంది. ఇది వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ తో కూడిన కొత్త-తరం 155సీసీ బ్లూ కోర్ ఇంజన్‌ కలిగివుంది. ఇది 8,000ఆర్పీఎం వద్ద 15 హెచ్‌పీ శక్తినీ, 6,500rpm వద్ద 13.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యమహా ఏరోక్స్ ఎస్ ఇంజిన్‌ 155సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ మోటార్ కలిగి ఉంది. దేశవ్యాప్తంగా కంపెనీ బ్లూ స్క్వేర్ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ స్కూటర్‌ను విక్రయించనుంది.