nagidream
WhatsApp Brings New Feature To Hide Phone Number: ఇప్పుడు అంతా వాట్సాప్ నే వినియోగిస్తున్నారు. కొత్త వ్యక్తులతో కూడా వాట్సాప్ ద్వారానే కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో ఫోన్ నంబర్ ఇస్తే ఇబ్బందులకు గురి చేస్తారేమో అన్న భయం ఉంటుంది. ఈ విషయంలో అమ్మాయిలు ఎక్కువగా భయపడతారు. అలా భయపడేవారి కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది.
WhatsApp Brings New Feature To Hide Phone Number: ఇప్పుడు అంతా వాట్సాప్ నే వినియోగిస్తున్నారు. కొత్త వ్యక్తులతో కూడా వాట్సాప్ ద్వారానే కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో ఫోన్ నంబర్ ఇస్తే ఇబ్బందులకు గురి చేస్తారేమో అన్న భయం ఉంటుంది. ఈ విషయంలో అమ్మాయిలు ఎక్కువగా భయపడతారు. అలా భయపడేవారి కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది.
nagidream
వాట్సాప్ వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనేక ఫీచర్స్ ని తీసుకొస్తుంది. ఇప్పటికే వాట్సాప్ ప్రొఫైల్ ని స్క్రీన్ షాట్ తీసే సదుపాయాన్ని తొలగించిన సంస్థ తాజాగా మరో కీలక అప్డేట్ ని ఇచ్చింది. మొబైల్ నంబర్ తో పని లేకుండా మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చే పనిలో పడింది. ‘యూజర్ నేమ్’ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్ కి ఫోన్ నంబర్ అవసరం లేకుండా వాట్సాప్ లో వ్యక్తులకు మెసేజులు పంపించుకోవచ్చు. కొత్త వాళ్ళకి ఫోన్ నంబర్ ఇవ్వాలంటే చాలా మందికి ఒక తెలియని భయం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ భయం ఉంటుంది. ఫోన్ నంబర్ ఇస్తే లేనిపోని తలనొప్పి. బిజినెస్ అవసరాల కోసం, ఇతర అవసరాల కోసం ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే ఫోన్ నంబర్ ఇస్తే అదే పనిగా కాల్స్ చేసి విసిగిస్తుంటారు. దీని వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ నంబర్ లేకుండా నేరుగా వాట్సాప్ లో సందేశాలు పంపించుకునే సదుపాయాన్ని తీసుకొస్తుంది. కొత్తవారితో చాట్ చేయాలంటే ఫోన్ నంబర్ కి బదులు యూజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. యూజర్ నేమ్ తో పాటు ఒక పిన్ కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. ఆ పిన్ ని కొత్త వారు ఎంటర్ చేస్తేనే ఇవతల వ్యక్తులతో చాట్ చేసే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులు తొలిసారిగా మీతో మాట్లాడాలంటే ఖచ్చితంగా యూజర్ నేమ్ తో పాటు పిన్ నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ ఫీచర్ వల్ల అవతలి వ్యక్తికి మీ ఫోన్ నంబర్ అనేది కనబడదు. కేవలం మీరు పెట్టుకున్న యూజర్ నేమ్ మాత్రమే కనబడుతుంది. మీరు ఎవరి నుంచి ఐతే అతిగా మెసేజులు రాకూడదు అనుకున్నారో అలాంటి వారిని లిమిట్ లో పెట్టేలా పిన్ ని సెట్ చేసుకోవచ్చు. ఆ పిన్ ఉంటేనే అవతల వాళ్ళు మీతో చాట్ చేయగలరు. కొత్తవారికి మాత్రమే పిన్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ చాట్ చేస్తున్న వారికి పిన్ సెట్ చేసుకోవడం కుదరదు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజులను నియంత్రించడం కోసం వాట్సాప్ ఈ ఫీచర్ ని తీసుకొస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ తో అందరికీ ఫోన్ నంబర్ కనిపించకుండా హైడ్ చేయాలి అనుకునేవారికి.. మరీ ముఖ్యంగా అమ్మాయిలకి మేలు చేకూరనుంది. అపరిచితుల నుంచి వచ్చే మెసేజులని అరికట్టేందుకు ఫీచర్ ని తీసుకురాబోతుంది.