WhatsApp Brings New Feature For Message: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. మెసేజ్ మీద డబుల్ క్లిక్ చేస్తే!

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. మెసేజ్ మీద డబుల్ క్లిక్ చేస్తే!

WhatsApp Working On Double Tap Feature For Quick Reactions To Messages: వాట్సాప్ యూజర్స్ కోసం మెటా ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ని, ఫీచర్స్ ని తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ని తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ని టెస్ట్ చేస్తుంది.

WhatsApp Working On Double Tap Feature For Quick Reactions To Messages: వాట్సాప్ యూజర్స్ కోసం మెటా ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ని, ఫీచర్స్ ని తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ని తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ని టెస్ట్ చేస్తుంది.

వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ని తీసుకొస్తూ యూజర్స్ కి కిక్ ఇస్తుంది. వినియోగదారుల యూజర్ ఎక్స్ పీరియన్స్ ని పెంచేందుకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్ ని తీసుకొస్తుంది. ఇప్పటికే నెట్ లేకుండా దగ్గర్లో ఉన్న వారికి ఫైల్స్ సెండ్ చేసుకునే ఫీచర్, వాట్సాప్ లోంచి బయటకెళ్ళకుండానే ఆల్బమ్ పికర్ వంటి ఫీచర్స్ ని పరిచయం చేసింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ బీటా యూజర్లు టెస్ట్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఈ కొత్త ఫీచర్స్ వాట్సాప్ యూజర్స్ అందరికీ అందుబాటులోకి రానున్నాయి. కాగా వాట్సాప్ మరొక కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది. మరో కొత్త ఫీచర్ ని వాట్సాప్ లో జోడిస్తున్నట్లు తెలిపింది. కొత్త మీడియా రియాక్షన్ షార్ట్ కట్ ని తీసుకొచ్చింది.

మీడియా వ్యూవర్ స్క్రీన్ అంటే చాట్ లో కనిపించే ఫోటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజెస్ వంటి వాటికి ఫాస్ట్ గా రియాక్షన్ ఇవ్వడానికి ఈ రియాక్షన్ షార్ట్ కట్ ఉపయోగపడుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నప్పుడు లేదా ఇన్స్టాలో చాట్ చేస్తున్నప్పుడు మెసేజుల మీద డబుల్ క్లిక్ చేస్తే ఎలా అయితే లవ్ సింబల్ ఎనేబుల్ అవుతుందో.. అలా వాట్సాప్ లో ఎవరైనా పంపించిన వీడియోస్ కి, ఫోటోలకి లేదా మెసేజులు లవ్ సింబల్ తో క్విక్ రియాక్షన్ ఇవ్వచ్చు. ఎవరైనా పంపించిన ఫోటోలకు, వీడియోలకు, మెసేజులకు లవ్ సింబల్ తో రియాక్షన్ ఇవ్వచ్చునన్నమాట. ఈ ఫీచర్ వాట్సాప్ బీటా యూజర్స్ కోసం ఆండ్రాయిడ్ 2.24.16.7 అప్డేట్ లో ఉంది. ఇది గూగుల్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది.

డబుల్ ట్యాప్ రియాక్షన్ మీద వాట్సాప్ పని చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో డాట్ కామ్ వెబ్ సైట్ తెలిపింది. ఇప్పటికే ఎమోజీల ద్వారా ఎమోషన్స్ ని మెసేజెస్ కి క్విక్ రియాక్షన్ ఇచ్చేలా ఫీచర్ అందుబాటులో ఉంది. తాజాగా డబుల్ ట్యాప్ చేస్తే క్విక్ రియాక్షన్ వచ్చేలా వాట్సాప్ డెవలప్ చేసింది. ఈ ఫీచర్ ని ఫ్యూచర్ అప్డేట్ లో అందుబాటులో ఉంచనుంది. అయితే ఈ ఫీచర్ లో డీఫాల్ట్ గా హార్ట్ సింబల్ మాత్రమే ఉంటుంది. టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్ గా రియాక్షన్ ఇవ్వాలనుకునేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే లవ్ సింబల్ మాత్రమే కాకుండా వేరే సింబల్స్ ని కూడా పెట్టుకునేలా కస్టమైజేషన్ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది. 

వాట్సాప్ టిప్:

వెబ్ వాట్సాప్ వాడుతున్నారా? అయితే మీ కోసమే ఈ సింపుల్ టిప్. వెబ్ వాట్సాప్ లో మీ మెసేజులకి లేదా వేరే మెసేజులకి రిప్లై ఇవ్వాలంటే కనుక ఆ మెసేజ్ మీద ఉన్న కుడి వైపున దిగువ ఏరో మీద క్లిక్ చేసి అప్పుడు రిప్లై మీద క్లిక్ చేయాలి. దీని వల్ల కొంచెం టైం వేస్టు. అదే మీరు సింపుల్ గా మెసేజ్ పక్కన ఫార్వార్డ్ ఐకాన్ ఉంటుంది. దాని పక్కనే ఎమోజీ ఐకాన్ ఉంటుంది. దాని మీద మౌస్ తో డబుల్ క్లిక్ చేస్తే క్విక్ రియాక్షన్ వస్తుంది. అంటే రిప్లై చాట్ ఓపెన్ అవుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి.

Show comments