WhatsApp Working On Lists Feature To Manage People And Groups: వాట్సాప్‌లో కొత్తగా లిస్ట్స్ ఫీచర్! దీని వల్ల యూజ్ ఏంటంటే?

వాట్సాప్‌లో కొత్తగా లిస్ట్స్ ఫీచర్! దీని వల్ల యూజ్ ఏంటంటే?

WhatsApp Working On Lists Feature To Manage People and Groups: వాట్సాప్ లో ఎక్కువ సంఖ్యలో కాంటాక్ట్స్, గ్రూప్స్ ఉంటాయి. అలాంటి వారికి కాంటాక్ట్స్ ని, గ్రూప్స్ ని మేనేజ్ చేయడం కష్టమవుతుంది. దీని వల్ల పెద్ద తలనొప్పి. అందుకోసమే వాట్సాప్ కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది.

WhatsApp Working On Lists Feature To Manage People and Groups: వాట్సాప్ లో ఎక్కువ సంఖ్యలో కాంటాక్ట్స్, గ్రూప్స్ ఉంటాయి. అలాంటి వారికి కాంటాక్ట్స్ ని, గ్రూప్స్ ని మేనేజ్ చేయడం కష్టమవుతుంది. దీని వల్ల పెద్ద తలనొప్పి. అందుకోసమే వాట్సాప్ కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది.

వాట్సాప్ కొత్త గ్రూప్ డిస్క్రిప్షన్ ప్రాంప్ట్ ఫీచర్ ని డెవలప్ చేస్తుంది. కొత్తగా కమ్యూనిటీ గ్రూప్ చాట్స్ ని క్రియేట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ ని మరింత వివరంగా పెట్టుకునేందుకు కమ్యూనిటీ అడ్మిన్స్ కి కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది. దీంతో గ్రూప్ ముఖ్య ఉద్దేశం, గైడ్ లైన్స్ అనేవి గ్రూప్ సభ్యులకు తెలిసేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ని బీటా యూజర్లు టెస్ట్ చేస్తున్నారు. గ్రూప్ చాట్స్ లో డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి యూజర్స్ ని అనుమతిస్తుంది. కానీ ఈ ఆప్షన్ అనేది సెటప్ చేసే సమయంలో గ్రూప్ చాట్స్ కి డిస్క్రిప్షన్ ఎంటర్ చేసేలా యూజర్స్ ని వాట్సాప్ అనుమతిస్తుంది. కానీ ఈ ఆప్షన్ కమ్యూనిటీస్ కి యాడ్ అయిన గ్రూప్స్ కి వర్తించదు. ఈ ఫీచర్ ఎక్కువ సంఖ్యలో ఉన్న యూజర్స్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇదే కాకుండా మరొక ఫీచర్ ని కూడా వాట్సాప్ డెవలప్ చేస్తుంది. నిర్దిష్ట కాంటాక్ట్స్ ని, గ్రూప్స్ ని సులువుగా గుర్తించేలా ఫీచర్ ని తీసుకొస్తుంది. యూజర్ అనుభూతిని, సమర్థతను మెరుగుపరిచేందుకు వాట్సాప్ ఈ ఫీచర్ ని తీసుకొస్తుంది.

లిస్ట్స్ అనే ఫీచర్ మీద ప్రస్తుతం వాట్సాప్ పని చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా పీపుల్ ని, గ్రూప్స్ ని మేనేజ్ చేయవచ్చు. స్పెసిఫిక్ పీపుల్ ని, స్పెసిఫిక్ గ్రూప్స్ ని మేనేజ్ చేసే ఫీచర్ ని ఫ్యూచర్ అప్డేట్ లో విడుదల చేయనుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు కాంటాక్ట్స్ ని, గ్రూప్స్ ని ఆర్గనైజ్ చేసుకోవడానికి వివిధ లిస్టులను క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో సులువుగా కాంటాక్ట్స్ తో, గ్రూప్స్ తో ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. వాట్సాప్ లో ఎవరికైతే ఎక్కువ సంఖ్యలో కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయో వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. కేటగిరీల వారీగా కాంటాక్ట్స్ ని, గ్రూప్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం గ్రూప్స్ కోసం ప్రత్యేకంగా ఒక ఫీచర్ అయితే ఉంది. చాట్స్ లో గ్రూప్స్ ని వెతుక్కోకుండా సెర్చ్ బాక్స్ కింద ఉన్న గ్రూప్స్ పై ట్యాప్ చేస్తే కేవలం గ్రూప్స్ మాత్రమే కనబడతాయి. అయితే ఇప్పుడు వాట్సాప్ తీసుకొస్తున్న లిస్ట్స్ ఫీచర్ తో గ్రూప్స్ ని, కాంటాక్ట్స్ ని కేటగిరీల వారీగా డివైడ్ చేసుకోవచ్చు, క్రమబద్ధీకరించుకోవచ్చు.

ఈ ఫీచర్ ని స్టేటస్ అప్డేట్స్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. కావాల్సిన వారికి సులువుగా ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. లిస్ట్స్ క్రియేట్ చేసుకోవడం ద్వారా యూజర్లు నచ్చిన వారికి మాత్రమే స్టేటస్ కనిపించేలా చేసుకోవచ్చు. కేవలం లిస్టులో యాడ్ చేసిన వారికే స్టేటస్ షేర్ చేసుకునేలా ఈ ఫీచర్ ఉంది. దీని వల్ల కమ్యూనికేషన్ మరింత మెరుగుపడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులతో సంబంధిత సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. కంటెంట్ ని బట్టి ఎవరికి కనిపించాలో ఎవరికి కనబడకూడదో అనేది కూడా ప్రైవసీ సెట్టింగ్స్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. చాట్స్ లిస్టులో ఉన్న కాంటాక్ట్స్ లో మీకు బాగా క్లోజ్ అనుకున్న కాంటాక్ట్స్ కి ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ ఫీచర్ తో కావాల్సిన కాంటాక్ట్ లతో సంభాషణలను అనువుగా మేనేజ్ చేసుకునేందుకు యూజర్ అనుభూతిని మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉంది. లిస్ట్స్ ఫీచర్ అనేది ఫ్యూచర్ అప్డేట్ లో రానుంది.  

Show comments