iDreamPost
android-app
ios-app

సిగ్నల్ లేకపోయినా పని చేసే స్మార్ట్‌ఫోన్లు!.. కాల్స్, ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు

Satellite Smartphone: మొబైల్ యూజర్లకు త్వరలో సిగ్నల్ తో పనిలేకుండా పనిచేసే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలైన వివో, జియోమి, హువాయ్‌ వంటి మొబైల్‌ తయారీ సంస్థలు నెట్ వర్క్ లేకుండా పనిచేసే ఫోన్లను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Satellite Smartphone: మొబైల్ యూజర్లకు త్వరలో సిగ్నల్ తో పనిలేకుండా పనిచేసే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలైన వివో, జియోమి, హువాయ్‌ వంటి మొబైల్‌ తయారీ సంస్థలు నెట్ వర్క్ లేకుండా పనిచేసే ఫోన్లను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సిగ్నల్ లేకపోయినా పని చేసే స్మార్ట్‌ఫోన్లు!.. కాల్స్, ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు

టెక్నాలజీలో వచ్చిన మార్పులు వినూత్నమైన ఆవిష్కరణలకు వేదికలవుతున్నాయి. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో ప్రభావం చూపిస్తున్నది. ఇక ప్రపంచాన్ని చుట్టేసేంత అవకాశం లేకున్నా కూడా స్మార్ట్ ఫోన్ సాయంతో వరల్డ్ లో జరుగుతున్న విషయాలను ఇట్టే తెలుసుకునే సౌలభ్యం ఏర్పడింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సాయంతో క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపనున్నాయి స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు. నెట్ వర్క్ లేకున్నా పనిచేసే మొబైల్స్ ను త్వరలో తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ల సాయంతో సిగ్నల్ లేకున్నా కూడా కాల్స్, ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చని తెలుస్తున్నది.

కాల్స్, ఇంటర్నెట్ వాడుకోవాలంటే ఫోన్ లో సిగ్నల్ కంపల్సరీ ఉండాల్సిందే. లేదంటే ఈ సేవలను పొందలేము. అప్పుడప్పుడు సిగ్నల్ లేక ఇబ్బందులు పడిపోతుంటారు మొబైల్ యూజర్లు. ఇకపై ఈ సమస్యలకు పరిష్కారం చూపనున్నాయి మొబైల్ తయారీ కంపెనీలు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలైన వివో, జియోమి, హువాయ్‌ వంటి మొబైల్‌ తయారీ సంస్థలు నెట్ వర్క్ లేకుండా పనిచేసే ఫోన్లను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొండ, పర్వత ప్రాంతాల్లో సిగ్నల్ లేకున్నా కూడా మొబైల్ సేవలు పొందొచ్చు. ఈ కంపెనీలు శాటిలైట్ ఆధారిత నెట్‌వర్క్‌ అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ని డైరెక్ట్‌గా శాటిలైట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా కాలింగ్, డేటా సేవలను పొందొచ్చునని సమాచారం.

స్మార్ట్ ఫోన్ ను శాటిలైట్ కు కనెక్ట్ చేయడం ద్వారా పనిచేస్తుంది. ఈ ప్రత్యేక టెక్నాలజీలో స్మార్ట్‌ ఫోన్ ఉపగ్రహానికి వెళ్లే ప్రత్యేక రకం సిగ్నల్‌ను పంపుతుంది. ఉపగ్రహం ఈ సిగ్నల్‌ను స్వీకరించి, దానిని మరొక ఫోన్ లేదా నెట్‌వర్క్‌కి ప్రసారం చేస్తుంది. దీంతో నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో మొబైల్ సేవలు పొందొచ్చు. ఈ టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే మొబైల్ సేవలు ఈజీగా అందనున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల మధ్య పోటీ కూడా పెరగనున్నది. అయితే శాటిలైట్ ఆధారిత స్మార్ట్ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయాల్లో శాటిలైట్ ఫోన్లు ఉపయోగకరంగా మారనున్నాయి.