Vinay Kola
Vivo T3 Ultra: వివో తన టి3 అల్ట్రా 5జి స్మార్ట్ మొబైల్ లాంచ్ డేట్ ని ప్రకటించింది. ఈ ఫోన్ సూపర్ ఫీచర్లతో మంచి స్పెసిఫికేషన్స్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది.
Vivo T3 Ultra: వివో తన టి3 అల్ట్రా 5జి స్మార్ట్ మొబైల్ లాంచ్ డేట్ ని ప్రకటించింది. ఈ ఫోన్ సూపర్ ఫీచర్లతో మంచి స్పెసిఫికేషన్స్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది.
Vinay Kola
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో తన టి3 అల్ట్రా 5జి స్మార్ట్ మొబైల్ లాంచ్ డేట్ ని ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ని సెప్టెంబర్ 12 న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు వివో కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ ఫీచర్లతో మంచి స్పెసిఫికేషన్స్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది వివో ఫోన్లలో బెస్ట్ ఫోన్ గా నిలుస్తుంది అని కంపెనీ భావిస్తుంది. అలాగే ఇది చూడటానికి ఎంతో స్టైలిష్ గా కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని మనం ఫ్లిప్ కార్ట్ నుంచి లేదా వివో అధికారిక వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే దీన్ని ప్రమోట్ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వివో టీ3 అల్ట్రా 6.78 ఇంచెస్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే తో రాబోతుంది. ఇది 2800 × 1260 పిక్సల్స్ రెసొల్యూషన్ తో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నైట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. ఈ ఫోన్ 50MP + 8MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సల్ ఉంటుంది. దీంతో సెల్ఫీలు, వీడియో కాల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ తో వస్తుంది. దీని ర్యామ్ విషయానికి వస్తే.. 12 జీబీ దాకా ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 5500 ఎంఏహెచ్ ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జ్ తో వస్తుంది. ఈ ఫోన్ మందం 7.58 ఎంఎం ఉంటుంది.
వివో టీ3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ లూనార్ గ్రే అండ్ ఫ్రాస్ట్ గ్రీన్ వంటి రెండు కలర్ లలో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 30 వేల నుంచి 35 వేల మధ్యలో ఉంటుంది. వేరియంట్ల వారీగా ధరలు ఉంటాయి. ₹30,999 వేలకి 8GB ర్యామ్/128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ₹32,999 వేలకి 8GB ర్యామ్/256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ఇంకా అలాగే ₹34,999 వేలకి 12GB ర్యామ్/256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ఈ ధరల్లో ఇలాంటి ఫీచర్స్ రావడం విశేషం. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.