nagidream
Uses Of Google Gemini AI: ఇప్పటికే చాట్ జీపీటీ, మెటా ఏఐ, గూగుల్ జెమినీ ఏఐ యూజర్స్ కి అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటన్నిటిలోనూ గూగుల్ జెమినీ ఏఐ బాగా ఆకర్షిస్తోంది. మరి గూగుల్ జెమినీ ఏఐ ఉపయోగాలు ఏంటో చూడండి.
Uses Of Google Gemini AI: ఇప్పటికే చాట్ జీపీటీ, మెటా ఏఐ, గూగుల్ జెమినీ ఏఐ యూజర్స్ కి అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటన్నిటిలోనూ గూగుల్ జెమినీ ఏఐ బాగా ఆకర్షిస్తోంది. మరి గూగుల్ జెమినీ ఏఐ ఉపయోగాలు ఏంటో చూడండి.
nagidream
ఆండ్రాయిడ్, ఐఫోన్స్ లో గూగుల్ జెమినీ ఏఐ యాప్ ఇప్పటికే అందుబాటులో ఉంది. గూగుల్ జెమినీ అని ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో టైప్ చేస్తే మీకు యాప్ కనబడుతుంది. అయితే ఈ గూగుల్ జెమినీ ఏఐ యాప్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అనేది ఈ కథనంలో తెలుసుకోండి. గూగుల్ జెమినీ ఏఐని గతంలో బార్డ్ అని పిలిచేవారు. దీన్ని పలు రకాల పనుల్లో సహాయం చేసేందుకు రూపొందించారు. ఇది వెబ్ యాప్, మొబైల్ యాప్ రెండు ప్లాట్ ఫామ్స్ లోనూ అందుబాటులో ఉంది.
జెమినీ ఏఐ యాప్ అనేది తెలివైన సెర్చ్ టూల్ గా వ్యవహరిస్తోంది. కీ వర్డ్స్, మొదటి వాక్యం ఇచ్చి.. మీరు సెర్చ్ చేస్తే దానికి సంబందించిన పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. ఇది వికీపీడియాలా పని చేస్తుంది. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకున్నా, చరిత్ర గురించిన సమాచారం ఇస్తుంది.
రాయడానికి ఆలోచనలు రాక ఇబ్బంది పడేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పద్యాలు, స్క్రిప్ట్ వంటి వాటిలో ఇది సహాయం చేస్తుంది. ఇతర భాషలను కూడా ఇది అనువాదం చేస్తుంది.
ఈమెయిల్స్ పంపడంలో మీకు జెమినీ ఏఐ ఎంతగానో సహాయపడుతుంది. ఈమెయిల్స్ లేదా లెటర్స్ రాసేటప్పుడు పదబంధాలు, వివిధ స్వరాలను ఇది సూచిస్తుంటుంది.
వెబ్ యాప్ లో ఉన్నట్టే కంటెంట్ రైటింగ్ ఈ మొబైల్ యాప్ లో చేసుకోవచ్చు. అందులో ఉన్న ఫంక్షన్సే ఇందులో కూడా ఉంటాయి.
ఏమైనా సమస్యలు ఉన్నా.. ఆలోచనలు రాక స్టక్ అయిపోయినా ఈ జెమినీ ఏఐ క్రియేటివ్ ఐడియాస్ ని ఇస్తుంది.
మొత్తంగా గూగుల్ జెమినీ ఏఐ ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. క్రియేటివిటీ, ప్రొడక్టివిటీని మెరుగుపరుస్తుంది. అలానే వివిధ టాస్క్ ల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. అయితే ప్రస్తుతం వెబ్ యాప్, మొబైల్ యాప్ అందుబాటులో ఉన్నా ఇది ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉంది. ఫ్యూచర్ లో కొత్త ఫీచర్స్, ఫంక్షనాలిటీస్ యాడ్ అవుతాయి. గూగుల్ జెమినీ ఏఐని ఉపయోగించుకోవాలంటే గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా మీరు ఎవరికైనా థాంక్స్ చెప్పాలనుకుంటే మీకు మేటర్ టైప్ చేసి ఇస్తుంది. ఎలాంటి సమాచారాన్ని అయినా ఇస్తుంది. ఇమేజ్ ని అప్లోడ్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు. అలానే వెబ్ యాప్ లో కూడా సమాచారాన్ని పొందవచ్చు. మీరు పొందిన సమాచారాన్ని వినాలనుకుంటే వినచ్చు. కంటెంట్ ఉన్న ఫోటో అప్లోడ్ చేసి అందులో ఉన్న కంటెంట్ ని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసి ఇవ్వమంటే ఇస్తుంది. గూగుల్ జెమినీ ఏఐ వెబ్ యాప్ లో మీరు ఇమేజెస్ ని జనరేట్ చేయవచ్చు. మీరు వీడియో క్రియేటర్స్ అయితే కనుక మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో అడ్వాన్స్డ్ వెర్షన్ ఉంది.
గూగుల్ జెమినీ ఏఐ వెబ్ యాప్ ని ఈ లింక్ పై క్లిక్ చేసి ట్రై చేయండి.