Useful Gadgets Under 400: ఇంట్లోకి ఉపయోగపడే బెస్ట్ గ్యాడ్జెట్స్.. కేవలం రూ.400ల్లోపే..

ఇంట్లోకి ఉపయోగపడే బెస్ట్ గ్యాడ్జెట్స్.. కేవలం రూ.400ల్లోపే..

Useful Gadgets For Kitchen Home Appliances: సాధారణంగా ఇంట్లో అందరికీ ఎన్నో పనులు ఉంటాయి. కొన్నిసార్లు ఆ పనుల వల్ల శ్రమ, సమయం వృథా అవుతూ ఉంటుంది. అలాంటి పనులు సులువుగా చేసే గ్యాడ్జెట్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

Useful Gadgets For Kitchen Home Appliances: సాధారణంగా ఇంట్లో అందరికీ ఎన్నో పనులు ఉంటాయి. కొన్నిసార్లు ఆ పనుల వల్ల శ్రమ, సమయం వృథా అవుతూ ఉంటుంది. అలాంటి పనులు సులువుగా చేసే గ్యాడ్జెట్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

సాధారణంగా మనకి ఇంట్లో పనులు సులభం అయ్యేందుకు ఎన్నో వస్తువులు ఉంటాయి. వాటిలో చాలా వరకు మన పనిని ఈజీ చేస్తూ ఉంటాయి. అయితే అలాంటి వస్తువుల ధర కొన్నిసార్లు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మీకోసం ఆన్ లైన్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ యూజ్ ఫుల్ గ్యాడ్జెట్స్ ని తీసుకొచ్చాం. మీ ఇంట్లో, కిచెన్ లో, కార్ లో ఉపయోగపడేలా కొన్ని బెస్ట్ వస్తువులను తీసుకొచ్చాంది. అది కూడా కేవలం రూ.400 లోపు ధరలోనే ఉంటాయి. మరి.. ఆ వస్తువులు ఏంటి? వాటి వల్ల మీకు ఉన్న ఉపయోగాలు ఏంటి? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. అలాగే మీకు ఆ వస్తువులు నచ్చితే అక్కడే ఉండే లింక్ క్లిక్ చేసి కొనేయండి.

హుక్ టైప్ వేయింగ్ మిషన్:

సాధారణంగా ఇంట్లో కచ్చితంగా ఒక వేయింగ్ మిషన్ ఉండాలి. ఎందుకంటే మీరు ప్రయాణాలు చేసే సమయంలో ముఖ్యంగా విమానం ఎక్కాలంటే తీసుకెళ్లే లగేజ్ కి లిమింట్ ఉంటుంది. అక్కడు వెళ్లి మీరు సర్దుబాటు చేసుకోవాలంటే కష్టం. అదే ఇంట్లో ఇలాంటి ఒక మిషన్ ఉంటే మీరు చక్కగా లగేజ్ బరువు చూసుకోవచ్చు. అంతేకాకుండా మీకు కావాలి అనుకుంటే గ్రాముల బరువును కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బయట ఏమైన కొంటే అది సరైన బరువు ఉందా లేదా అనే అనుమానం ఉన్నా కూడా ఈ వేయింగ్ మెషిన్ ద్వారా క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఈ మిషన్ ఎమ్మార్పీ విషయానికి వస్తే.. రూ.899గా ఉంది. కానీ, 69 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.279కే అందిస్తున్నారు. మరి ఈ హుక్ టైప్ వేయింగ్ మిషన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీచైన్ ఫ్లాష్ లైట్:

సాధారణంగా బైక్, కారు ఏదైనా గానీ మీరు ఒక్కోసారి రాత్రి పూట ప్రయాణం చేయాల్సి రావచ్చు. మీ వెహికిల్ దగ్గరకు వెళ్లేందుకు కూడా చీకటి ఉండచ్చు. అలాంటి సమయంలో ఈ కీచైన్ ఫ్లాష్ లైట్ బాగా ఉపయోగంగా ఉంటుంది. దీనికి ధోనీ లైట్ అనే పేరు కూడా ఉంది. దీనిని ధోనీ బాగా వాడేవాడు. అతని వల్లే దీనికి ధోనీ లైట్ అనే పేరు కూడా వచ్చింది. ఈ ఎల్ఈడీ లైట్ 3 ఆప్షన్స్ తో వస్తుంది. అంటే 3 రకాలుగా వెలుగుతుంది. ఇది బ్లింక్ కూడా అవుతుంది. దీనికి స్టాండ్ కూడా ఉంటుంది. కావాలంటే ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఒక చిన్న స్టాండ్ లైట్ గా కూడా వాడుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.599 కాగా 79 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.124కే అందిస్తున్నారు. మరి.. ఈ ధోనీ ఫ్లాష్ లైట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెడ్ లైట్ విత్ హార్న్:

ఇప్పుడు అందరూ సైకిలింగ్ చేస్తున్నారు. సైకిల్ తొక్కడం హాబీగా కూడా మారిపోయింది. హైదరాబాద్ లాంటి నగరాల్లో డే అండ్ నైట్ సైకిల్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు చీకట్లో సైకిలింగ్ చేయాలి అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సైకిల్ కి ఈ హెడ్ లైట్ విత్ హార్న్ ఉంటే ఆ ఇబ్బంది ఉండదు. దీనిని మీరు యూఎస్బీ కేబుల్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలో హార్న్ కూడా ఉంటుంది. అలాగే దీనికి టెయిల్ లైట్ కూడా వస్తుంది. అంటే సైకిల్ వెనుక వైపు మీరు ఈ టెయిల్ లైట్ ని ఫిక్స్ చేయచ్చు. ఇది వర్షంలో తడిసినా ఏం కాదు. దీని ఎమ్మార్పీ రూ.1,199 కాగా కేవలం రూ.369కే అందిస్తున్నారు. మరి.. ఈ హెడ్ లైట్ విత్ హార్న్, టెయిల్ లైట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రఫ్ ప్యాడ్ ఈ- రైటర్:

ఈ రఫ్ ప్యాడ్ ఈ- రైటర్ పిల్లలకు బాగా ఉపయోగంగా ఉంటుంది. దీనిలో డ్రాయింగ చేసుకోవచ్చు, చిన్న పిల్లలు ఏబీసీడీలు రాసుకోవచ్చు. పిల్లలు ఇలా నేర్చుకోవడం కోసం చాలా పుస్తకాలను వేస్ట్ చేస్తూ ఉంటారు. అదే ఈ ప్యాడ్ అయితే చాలా పేపర్లు సేవ్ చేసిన వాళ్లు అవుతారు. అలాగే కేవలం చిన్న పిల్లలకు మాత్రమే కాకుండా పెద్ద వాళ్లు కూడా రఫ్ నోట్స్ కోసం దీనిని వాడుకోవచ్చు. ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు హైలెట్ పాయింట్స్ ని రాసుకోవచ్చు. వర్క్ అయిపోయిన తర్వాత సింపుల్ గా డిలీట్ బటన్ నొక్కగానే మీరు రాసింది డిలీట్ అయిపోతుంది. అలాగే కావాల్సిన వాటిని సేవ్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. షేర్ కూడా చేయచ్చు. దీని ఎమ్మార్పీ రూ.899 కాగా రూ.229కే అందిస్తున్నారు. మరి.. ఈ రఫ్ ప్యాడ్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హ్యాండీ చాపర్:

వంటిట్లో కూరగాయలు కోయడం ఎంతో పెద్ద పని. అయితే ఈ మినీ చాపర్ తో మీరు ఎంతో సులభంగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిర్చి, క్యారెట్ వంటి కూరగాయలను కట్ చేయచ్చు. అందుకు పెద్ద సమయం కూడా పట్టదు. పైగా ఇది పెద్ద కంటైనర్ తో వస్తోంది. అంటే కట్ చేసిన తర్వాత దీనిని మీరు ఒక బౌల్ గా కూడా వాడుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.545 కాగా.. రూ.196కే అందిస్తున్నారు. ఈ మినీ చాపర్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్లెక్సిబుల్ కిచెన్ ట్యాప్:

కిచెన్ లో ఉండే ఆడవాళ్లకు షింకుతో చాలా పని ఉంటుంది. కానీ, ఆ ట్యాప్ మాత్రం ఫిక్స్డ్ గా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ట్యాప్ వాటర్ ని ఒక్కోసారి కార్నర్ కి వాడాల్సి వస్తుంది. లేదంటే బౌల్ క్లీన్ చేసే సమయంలో ట్యాప్ కాస్త అటూ ఇటూ తిరుగుతూ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అలాంటి సమస్యలకు ఈ కిచెన్ ట్యాప్ చక్కని సమాధానంగా చెప్పవచ్చు. ఇది 360 డిగ్రీలు తిరుగుతుంది. షింక్ యూస్జ్ కి చాలా బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.799 కాగా రూ.165కే అందిస్తున్నారు. మరి.. ఈ ఫ్లెక్సిబుల్ కిచెన్ ట్యాప్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రిమోట్ షట్టర్:

అందరూ ఇప్పుడు సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి అలవాటు పడిపోయారు. కానీ, ప్రతిసారి చేతితో పట్టుకుని ఫొటో, వీడియో తీయాలి అంటే అది కష్టంగా ఉంటుంది. కానీ, ఫోన్ దూరంగా పెట్టి రికార్డ్ చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ రిమోట్ షట్టర్ బాగా యూజ్ అవుతుంది. ఇది స్మార్ట్ ఫోన్, టాబ్లెట్స్ కు ఉపయోగపడుతుంది. దీనిని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.999 కాగా కేవలం రూ.169కే అందిస్తున్నారు. మరి.. ఈ రిమోట్ షట్టర్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

స్క్రీన్ క్లీనర్:

ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, పీసీ, ల్యాప్ ట్యాప్ లను వాడుతూ ఉంటారు. అయితే స్క్రీన్ మీద మరకలు, వాడుతున్నప్పుడు ఫింగర్ ప్రింట్స్ వంటివి పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని క్లీన్ చేసుకోవడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. అందుకు ఈ స్క్రీన్ క్లీనర్ చక్కటి పరిష్కారం అవుతుంది. దీనిలోనే క్లీనర్ ఉంటుంది. దానికే చుట్టూ డస్టర్ లాంటి మెటీరియల్ కూడా ఉంటుంది. మరి.. ఈ స్క్రీన్ క్లీనర్ ని కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

 

Show comments