iDreamPost
android-app
ios-app

ఇక ట్రూకాలర్ అవసరం లేదు.. ఫోన్ చేసేది ఎవరో తెలిసిపోతుంది.. ఎలా అంటే?

మీకు గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు.. చేసిందెవరో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ ను వినియోగిస్తున్నారా? అయితే ఇకపై ట్రూ కాలర్ అవసరం లేకుండానే ఫోన్ చేసిందేవరో తెలిసిపోనుంది.

మీకు గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు.. చేసిందెవరో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ ను వినియోగిస్తున్నారా? అయితే ఇకపై ట్రూ కాలర్ అవసరం లేకుండానే ఫోన్ చేసిందేవరో తెలిసిపోనుంది.

ఇక ట్రూకాలర్ అవసరం లేదు.. ఫోన్ చేసేది ఎవరో తెలిసిపోతుంది.. ఎలా అంటే?

ఆఫీస్ పనుల్లో ఉన్నప్పుడు, లేదా ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఏదో ఓ కాల్ వచ్చి అంతరాయం కలిగిస్తూ ఉంటుంది. అదీగాక కాల్ లిఫ్ట్ చేయని సమయంలో ఫోన్ చేసింది ఎవరో తెలియకపోతే మరింత చికాకుగా ఉంటుంది. ఫోన్ చేసింది ఎవరో తెలుసుకోవాలంటే తిరిగి ఫోన్ చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఫోన్ ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు మొబైల్ యూజర్లు ట్రూకాలర్ యాప్స్ ను వినియోగిస్తున్నారు. దీంతో యూజర్లకు కొంత వరకు స్పామ్ కాల్స్ నుంచి ఉపశమనం లభించినట్లైంది. కానీ ఈ ట్రూ కాలర్ అంత సేఫ్ కాదని అంటున్నారు. అయితే తాజాగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రూకాలర్ అవసరం లేకుండానే ఫోన్ చేసేది ఎవరో యూజర్లకు తెలిసేలా చేయాలని టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్ ప్రతిపాదనలు చేసింది.

లోన్ల కోసమని, క్రెడిట్ కార్డుల కోసమని ప్రతీరోజు స్పామ్ కాల్స్ వస్తుంటాయి. ఈ స్పామ్ కాల్స్ వల్ల మొబైల్ వినియోగదారులు కాల్స్ ఎవరు చేస్తున్నారో తెలుసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాయ్ తీసుకున్న నిర్ణయంతో ఫోన్ చేసేది ఎవరో తెలిసిపోనుంది. ట్రూకాలర్ వంటి యాప్స్ తో సంబంధం లేకుండానే ఫోన్ చేసేది ఎవరో ఇకపై మొబైల్ స్క్రీన్ పై డిస్ల్పే అవుతుంది. ట్రాయ్ టెలికాం ఆపరేటర్లకు చేసిన ప్రతిపాదనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. కాగా ఫోన్ చేసేదెవరో తెలిసిపోయేలా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనలు అమల్లోకి రానున్నాయి.

Dont need truecaller app

కస్టమర్ల అభ్యర్థన మేరకు సప్లిమెంటరీ సర్వీస్ గా టెలికాం కంపెనీలు కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ని అందించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. ఇప్పటి వరకు మొబైల్స్ లో సేవ్ చేసుకున్న పేర్లు మాత్రమే కాల్ చేసినప్పుడు డిస్ల్పే పై కనిపించేవి. అయితే తాజా ప్రతిపాదనలతో మన ఫోన్ లో సేవ్ చేయని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఎవరు చేశారో తెలిసిపోనుంది. ఫోన్ చేసేదెవరో తెలిసిపోయేలా రానున్న ఈ సర్వీసులు భారత్ లో డీఫాల్ట్ గా అందుబాటులోకి రానున్నాయి. ట్రాయ్ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే.. కస్టమర్ సిమ్‌కార్డు తీసుకున్పుడు నమోదు చేసుకున్న పేరు కాల్ చేసేటప్పుడు స్క్రీన్‌ పై డిస్ల్పే అవుతుంది. కాగా యూజర్ అభ్యర్థనపై మాత్రమే ఈ ఫీచర్ పని చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అమల్లోకి వస్తే వినియోగదారులకు ట్రూకాలర్ లాంటి యాప్స్ అవసరం ఉండదని అంటున్నారు.