ఫోన్లలోకి కొత్త మాల్వేర్.. ఇలా చేయకుంటే మీ Bankలో డబ్బు మాయమవుతుంది!

Malware: ఆండ్రాయిడ్ ఫోన్లలోకి కొత్త మాల్వేర్ వస్తుంది. ఈ మాల్వేర్ మన ఫోన్లలో ప్రవేశించి మన బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉంది.

Malware: ఆండ్రాయిడ్ ఫోన్లలోకి కొత్త మాల్వేర్ వస్తుంది. ఈ మాల్వేర్ మన ఫోన్లలో ప్రవేశించి మన బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ లు వాడే వారికి ఇప్పుడు చెప్పబోయే న్యూస్ నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. వారికి పెను ముప్పు పొంచి ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త మాల్వేర్ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. దీని పేరు టాక్సిక్ పాండా. ఇక అసలు ఏంటి ఈ కొత్త మాల్వేర్?ఇది స్మార్ట్ ఫోన్ల లోకి ఎలా ప్రవేశిస్తుంది? దీని వల్ల కలిగే నష్టం ఏంటి ? ఈ ప్రమాదకరమైన మాల్వేర్‌ను ఎలా నివారించవచ్చు? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ మాల్వేర్ ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్, Google Chrome రూపంలో మొబైల్‌లలో స్ప్రెడ్ అవుతుంది. ఫేమస్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్లీఫీ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం ఈ డేంజరస్ మాల్వేర్‌ను గుర్తించింది. ఈ మాల్వేర్ డివైజ్‌లలోకి స్ప్రెడ్ అయితే బ్యాంకింగ్ సేఫ్టీకి పెద్ద ముప్పు ఉంటుంది. దీంతో బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తం కూడా పోతుంది.ఈ మాల్వేర్ ఎంత ప్రమాదకరమైనది అంటే.. దీని ద్వారా రిమోట్ హ్యాకర్లు మీ మొబైల్‌ను ఎక్కడి నుండైనా కంట్రోల్ చేయవచ్చు. పైగా ఈ టాక్సిక్ పాండా మాల్వేర్‌ని కనుక్కోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇది మన మొబైల్‌లలో ఉండే సాధారణ యాప్‌ లాగే కనిపిస్తుంది. TgToxic అనే మాల్వేర్ నుంచి ఈ టాక్సిక్ పాండా మాల్వేర్ వచ్చింది. ఈ కొత్త మాల్వేర్ ని మన బ్యాంకులో డబ్బులు దోచుకోవడానికే హ్యాకర్లు కనిపెట్టారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లోని యాక్సెసిబిలిటీ ఫీచర్‌ను హ్యాక్ చేసి, ఫోన్‌లో వచ్చిన ఓటీపీని యాక్సెస్ చేసే విధంగా ఈ మాల్వేర్ ని డిజైన్ చేశారు హ్యాకర్లు.

చాలా మంది కూడా గూగుల్ ప్లే లేదా గెలాక్సీ స్టోర్ వంటి ఆఫీషియల్ యాప్ స్టోర్‌లలో కాకుండా థర్డ్ పార్టీ సైట్‌ల ద్వారా యాప్‌ లను డౌన్‌లోడ్ చేసుకుంటారు. అప్పుడు ఈ టాక్సిక్ పాండా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి వస్తుందని టెక్ నిపుణులు తెలిపారు. ఒక్కోసారి గూగుల్ యాప్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ టాక్సిక్ పాండాను ఎవరు డెవలప్ చేశారనే దానిపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. అయితే దీనిని హాంకాంగ్‌లో డెవలప్ చేసినట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు.ఇది మీ పర్సనల్ డేటాని కూడా హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. మీ పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంటుని సేఫ్ గా ఉంచుకోవాలనుకుంటే Google Play Store లేదా Galaxy Store కాకుండా మరెక్కడా ఏ యాప్‌ని పొరపాటున డౌన్‌లోడ్ చేసుకోకండి. తెలియని థర్డ్ పార్టీ సైట్‌ల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం వల్ల మీ మొబైల్‌పై ఈ మాల్వేర్ దాడి జరిగే ప్రమాదం పెరుగుతుంది. మీ ఫోన్ హ్యాంగ్ అవుతున్నా, స్లోగా ఉన్నా ఖచ్చితంగా ఇలాంటి మాల్వేర్ ప్రవేశించిందని అర్ధం. మీ ఫోన్ అలా ఉంటే వెంటనే రీసెట్ కొట్టండి. దాంతో మీ ఫోన్లో ఉండే వైరస్ కానీ, మాల్వేర్స్ కానీ ఈజీగా తొలగిపోతాయి. ఇదీ సంగతి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments