iDreamPost
android-app
ios-app

పండగ సీజన్లలో ఇలా Shopping చేస్తున్నారా? జాగ్రత్త.. దారుణంగా మోసపోతారు?

  • Published Oct 28, 2024 | 11:41 AM Updated Updated Oct 28, 2024 | 11:41 AM

Shopping: చాలా మంది కూడా ఆఫ్ లైన్ షాపింగ్ కంటే ఆన్ లైన్ షాపింగ్ చేయడానికే ఇష్టపడతారు. కానీ దాని వల్ల నష్టపోతారు.

Shopping: చాలా మంది కూడా ఆఫ్ లైన్ షాపింగ్ కంటే ఆన్ లైన్ షాపింగ్ చేయడానికే ఇష్టపడతారు. కానీ దాని వల్ల నష్టపోతారు.

పండగ సీజన్లలో ఇలా Shopping చేస్తున్నారా? జాగ్రత్త.. దారుణంగా మోసపోతారు?

పండుగలు వస్తున్నాయంటే చాలు.. అందరిలో ఏదో తెలియని సంతోషం పెరుగుతుంది. ఆ సంతోషంతో షాపింగ్ స్టార్ట్ చేస్తారు. కొత్త దుస్తులు, మ్యాచింగ్ బ్లౌజ్, బ్యాంగిల్స్ ఇలా ఒకటేంటి.. అన్ని కొనేస్తారు. అయితే ప్రస్తుత కాలంలో షాప్‌కి వెళ్లి కొనే వాళ్ళు తక్కువయ్యారు. అలా కొనే వాళ్లకంటే ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే వారు ఎక్కువ అయ్యారు. ఈ బిజీ లైఫ్ లో ఆన్లైన్ షాపింగ్ చేయడమే బెటర్ అనుకుంటున్నారు. పైగా ధరలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ ఆఫర్లు ఉంటాయి. అటు డబ్బులు సేవ్ అవుతాయి. టైమ్ కూడా సేవ్ అవుతుంది. అందుకే జనాలు ఆన్లైన్ షాపింగ్ కి అలవాటు పడుతున్నారు. కానీ ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువ అవుతున్న క్రమంలో మోసాలు కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. పండగకి కొత్త దుస్తులు, వస్తువులు కొనాలనే ఆలోచనలో తెలియక కొందరు షాపింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల కచ్చితంగా దారుణంగా మోసపోయే ప్రమాదం ఉంది. మరి ఆ మోసాలు ఏంటి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పూర్తిగా తెలుసుకుందాం.

ఇలాంటి పండుగ సీజన్లను బాగా క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ మోసగాళ్ళు. ఇలాంటి టైమ్ లో జనాలు షాపింగ్ చేస్తారని తెలుసుకుని రెచ్చిపోతున్నారు. జనాలను దారుణంగా మోసం చేస్తున్నారు. తక్కువ డబ్బులకే బట్టలు, మ్యాచింగ్ మంచి ఆఫర్లలో ఉన్నాయని సోషల్ మీడియాలో లింక్‌లు పంపిస్తుంటారు. వీటిని క్లిక్ చేసి తక్కువ ఖర్చుతోనే బ్రాండెడ్ ఐటంస్ కొనుక్కోవచ్చని టెంప్ట్ చేస్తారు. దీంతో చాలా మంది కూడా ఆ లింక్‌ లపై క్లిక్ చేస్తారు.. దాంతో అకౌంట్లలోని డబ్బులు అంతా పోగొట్టుకుంటారు. కాబట్టి ఫేమస్ ఈ కామర్స్ సైట్‌లో మాత్రమే షాపింగ్ చేయండి. సోషల్ మీడియాలో ఏదైనా సైట్ లేదా లింక్ ఓపెన్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. చాలా మంది మోసగాళ్ళు టెలిగ్రాంని అడ్డాగా చేసుకొని ప్రమాదకర లింకులు పంపిస్తారు. అంతేగాక ఈ ఫెస్టివల్ సీజన్‌లో మనకు ఫార్వార్డెడ్ మెసేజ్‌లు ఎక్కువగా వస్తుంటాయి. ఈ లింక్‌ను షేర్ చేస్తే గిఫ్ట్స్, డబ్బులు వస్తాయంటూ ఆశ చూపిస్తారు. కాబట్టి ఇలాంటి లింక్స్ వస్తే అసలు ఓపెన్ చేయవద్దు. కొన్ని లింక్స్ ఓపెన్ చేస్తే.. అకౌంట్లోని డబ్బులు క్షణాల్లో మాయం అయిపోతాయి.

ఒరిజినల్ సైట్లు ఎలా ఉంటాయో.. ఫేక్ సైట్‌లను కూడా అచ్చం అలాగే డిజైన్ చేస్తారు కేటుగాళ్లు. అదిరిపోయే డ్రెస్సులు చూపిస్తారు. ఆఫర్లతో టెంప్ట్ చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదంటారు. లిమిటెడ్ ఆఫర్స్ అంటారు. తీరా ఆర్డర్ పెట్టాక ఐటంస్ రావు. పొరపాటున మీరు ఇలా ఫేక్ సైట్‌లో షాపింగ్ చేస్తే మీ వస్తువులు తిరిగి రాకపోవడమే కాకుండా బ్యాంక్ ఖాతాల్లో ఉండే డబ్బంతా ఖాళీ అవుతుంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే ఫేమస్ ఆన్లైన్ షాపింగ్ యాప్స్ లో మాత్రమే షాపింగ్ చెయ్యండి. ఇదీ సంగతి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.