Scams: జాగ్రత్త! ఈ స్కామ్స్ కి గురయ్యారంటే మీ డబ్బంతా మాయం?

Scams: టెక్నాలజీ వలన స్కామర్లు బాగా పెరిగిపోయారు. పలు మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ మోసాలు ఫోన్ కాల్‌తో ప్రారంభమవుతాయి. స్కామర్లు బారిన పడి జనాలు తమ డబ్బంతా పోగొట్టుకుంటున్నారు.

Scams: టెక్నాలజీ వలన స్కామర్లు బాగా పెరిగిపోయారు. పలు మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ మోసాలు ఫోన్ కాల్‌తో ప్రారంభమవుతాయి. స్కామర్లు బారిన పడి జనాలు తమ డబ్బంతా పోగొట్టుకుంటున్నారు.

టెక్నాలజీ అభివృద్ధి చెందడం వలన స్కామర్లు బాగా పెరిగిపోయారు. డబ్బే లక్ష్యంగా చేసుకొని పలు మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువగా మోసాలు ఫోన్ కాల్‌తో ప్రారంభమవుతాయి. ఇలాంటి కాల్స్ జనాలు ఎక్కువగా ఎదుర్కుంటున్నారు. మోసగాళ్ల బారిన పడి తమ డబ్బంతా పోగొట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్కామ్స్ సమస్యలు పెరిపోతున్నాయి. కానీ ఇండియాలో మాత్రం ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మంది స్కామర్లు రకరకాలుగా ఫోన్లు చేస్తూ మోసం చెయ్యడం వలన ప్రజలు మోసపోతున్నారు. దేశంలో ఇలాంటి కేసులు విచ్చల విడిగా దర్శనం ఇస్తున్నాయి. అయితే ఇలాంటి స్కాములకు గురి కాకుండా ముందుగా జాగ్రత్త పడటం ముఖ్యం. ఇప్పుడు అలాంటి స్కామ్స్ గురించి మనం తెలుసుకుందాం.

ఎక్కువగా జరిగే మోసాల్లో బ్యాంకుకి సంబంధించినవి ఉంటాయి. స్కామర్లు మీ బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మీరు మోసానికి గురైనట్లు చెప్తారు. మిమ్మల్ని బాగా నమ్మించడానికి ప్రయత్నిస్తారు. వారు మీ బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని అడగవచ్చు. కానీ అలా ఎవరు ఫోన్ చేసి అడిగినా కానీ అస్సలు నమ్మకండి. బ్యాంకుకి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పండి. ఆ తరువాత బ్యాంకుకి వెళ్లి లేదా బ్యాంకుకి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. మీకు వచ్చింది స్కాం కాల్ అని తెలియగానే తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేదా పోలీసులకు ఫిర్యాదు చెయ్యండి.

కొన్ని కొన్ని సార్లు మీకు కోట్లలో లాటరీ తగిలిందని మీ ఫోన్స్ కి మెసేజ్ వస్తుంది. లేదా స్కామర్లు మీ ఈమెయిల్ అకౌంట్ కి మీరు లాటరీ గెలుచుకున్నట్లు మెయిల్ పంపుతారు. ఇలాంటి మెసేజీలు, మెయిల్స్ మీకు విదేశాల నుంచి వచ్చినట్లు ఉంటాయి. మీ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాక ఆ లాటరీ డబ్బును మీ అకౌంట్ కి పంపడానికి డబ్బులు అడుగుతారు. కోట్లలో లాటరీ తగిలిందనే ఆనందంలో చాలా మంది డబ్బులు పంపుతారు. కానీ అలా చేస్తే మోసపోతారు. మీ నుంచి డబ్బంతా దోచుకునేదాకా వారు అలానే మిమ్మల్ని ఆశపెడతారు. మీ డబ్బంతా దోచుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. తరువాత మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. కాబట్టి ఇలాంటి మెసేజులు కానీ, మెయిల్స్ కానీ వచ్చినప్పుడు వాటికి స్పందించకండి. జాగ్రత్తగా ఉండండి. అలాంటివి మళ్లీ  రాకుండా ఆ అకౌంట్లనీ, నెంబర్లని బ్లాక్ చేసేయండి. ఒకవేళ మీరు ఇటువంటి మోసాలకు గురైతే కచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ చెయ్యండి.

Show comments