P Venkatesh
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్లే. అంతలా అడిక్ట్ అయిపోయారు జనాలు. అయితే స్మార్ట్ ఫోన్ యూజర్లను తమ మొబైల్ ఫోన్లను డిసెంబర్ 20న స్విచాఫ్ చేయాలట. ఆ వివరాల్లోకి వెళ్తే..
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్లే. అంతలా అడిక్ట్ అయిపోయారు జనాలు. అయితే స్మార్ట్ ఫోన్ యూజర్లను తమ మొబైల్ ఫోన్లను డిసెంబర్ 20న స్విచాఫ్ చేయాలట. ఆ వివరాల్లోకి వెళ్తే..
P Venkatesh
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నది. దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఉన్నది. స్మార్ట్ ఫోన్ లేకపోతే అసలు గడియ గడిచే పరిస్థితి లేదు. మొబైల్ ఫోన్ మానవ జీవితాన్ని అంతలా ప్రభావితం చేస్తోంది. స్మార్ట్ ఫోన్ వాడకంలోకి వచ్చాక సమాచారం కావాలన్నా, సమాచారం చేరవేయాలన్నా క్షణాల్లో జరిగిపోతోంది. మానవ సంబంధాలకు వారధిగా మారిందని చెప్పుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ వచ్చాక పక్కనున్న వారిని పలకరించడం మానేసి ప్రపంచంలో ఎక్కడో ఉన్నవారిని పలకరించేలా తయారయ్యింది సొసైటీ. అయితే స్మార్ట్ ఫోన్ వాడే వారికి ముఖ్య గమనిక. అదేంటంటే మీరు మీ ఫోన్లను డిసెంబర్ 20న స్విచాఫ్ చేయాలట. ఈ ఫోన్ స్విచాఫ్ కార్యక్రమాన్ని ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో తీసుకొచ్చింది.
స్మార్ట్ ఫోన్ వినియోగంలోకి వచ్చాక మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఫోన్ చేతిలో ఉంటే చాలు అసలు పక్కన ఏం జరుగుతుదో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడలేనంతగా స్మార్ట్ ఫోన్ తో గడిపేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వల్ల లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. స్మార్ట్ పోన్ నిత్యం వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. మొబైల్ ఫోన్ యూజర్లకు దాని వల్ల కలిగే నష్టాల గురించి టెక్ నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెద్దలే గాక పిల్లలు కూడా విపరీతంగా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు.
అయితే స్మార్ట్ ఫోన్ వాడకం వ్యసనంగా మారిన తరుణంలో ఆరోగ్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి పూర్తిగా విరుగుడును కనిపెట్టలేము గాని స్విచాఫ్ చేయడం ద్వారా కొంత ఉపశమనం పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో భాగంగానే మొబైల్ తయారీ కంపెనీ వివో ఫోన్ స్విచాఫ్ కార్యక్రమాన్ని తీసుకు వచ్చింది. డిసెంబర్ 20 2023రోజున మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేయాలని సూచించింది. అయితే రోజంతా స్విచాఫ్ చేయలేరు కాబట్టి ఒక గంట సేపైనా ఫోన్ స్విచాఫ్ చేయాలని తెలిపింది. డిసెంబర్ 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేయాలని వివో కోరింది. ఆ ఒక్క గంట సేపు తమ ఫోన్లను స్విచాఫ్ చేసి కుటుంబ సభ్యులతో గడపాలని తద్వారా మానవ సంబంధాలు మెరుగవుతాయని తెలిపింది.