iDreamPost
android-app
ios-app

స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ ఎలా పని చేస్తుందో తెలుసా?

టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో వినూత్నమైన ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా స్క్రీన్ లెస్ ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. ధర ఎంతంటే?

టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో వినూత్నమైన ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా స్క్రీన్ లెస్ ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. ధర ఎంతంటే?

స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ ఎలా పని చేస్తుందో తెలుసా?

ఒకప్పుడు కంప్యూటర్ ఒక పెద్ద ఇల్లు అంత ఉండేది, పోను పోను అది ఒక రూమ్ అంత మారింది, కాలం గడిచే కొద్ది ఒక టేబుల్ మీదకి డెస్క్ టాప్ రూపంలో వచ్చింది. టెక్నాలజీ అడ్వాన్సు అయ్యే కొలది అది కాస్తా ఒడిలో పెట్టుకుని వర్క్ చేసుకునే లాప్టాప్ సైజుకి వచ్చింది.. ఇప్పుడు ఈ లాప్టాప్ కూడా పోయి మరి కొత్త డివైస్ ని కనుక్కున్నారు.. ఇది కూడా లాప్టాప్ ఏ. కాని స్క్రీన్ ఉండదు.. అదేంటి మరి ఎలా చూడాలి అని అనుకోవచ్చు.. ఈ స్క్రీన్లేస్స్ లాప్టాప్ ని మూడేళ్లు కష్టపడి స్క్రీన్ లేకుండా పనిచేసే విధంగా కనుక్కున్నారు. స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ ఎలా పని చేస్తుందనే అనుమానం చాలా మందికి రావొచ్చు.. సైట్‌ఫుల్ కృషి ఫలితంగా ఈ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి AR (Augmented reality) స్క్రీన్ లెస్ ల్యాప్‌టాప్‌ను తయారు చేసింది. ఇది ఏఆర్‌ గ్లాసెస్ సహాయంతో 100-అంగుళాల వర్చువల్ డిస్‌ప్లేను చూపిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ పేరు Spacetop G1, ఈ ల్యాప్‌టాప్ ఏ ఫీచర్లను అందిస్తుంది? AR గ్లాస్సెస్ తో ఎలా పని చేస్తుంది. రేటు ఎలా ఉండబోతుంది.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Sightful Spacetop G1 ఫీచర్స్‌:

ఈ స్క్రీన్ లెస్ ల్యాప్‌టాప్ లో 100-ఇంచెస్ వర్చువల్ స్క్రీన్‌ను సెట్ చేసుకోవచ్చు. Chrome ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది రన్‌ అవుతుంది. గ్రాఫిక్స్ కోసం KRYO CPU, Adreno 740 GPUతో Qualcomm Snapdragon QCS8550ని ఉపయోగిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ 16 GB LPDDR5 RAM, 128 GB UFS3.1 స్టోరేజీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఈ ల్యాప్‌టాప్‌లో 2 USB టైప్-సి పోర్ట్‌లు, Wi-Fi 7, 5G (నానో-సిమ్ ఇంకా ఇ-సిమ్ సపోర్ట్), బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ ఉన్నాయి. ల్యాప్‌టాప్ 60Wh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు పని చేస్తుంది అని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఏఆర్‌ గ్లాసెస్ గురించి మాట్లాడితే.. ఈ గ్లాసెస్ స్పష్టమైన, అధిక-రిజల్యూషన్ OLED డిస్‌ప్లే ప్యానెల్‌తో వస్తుంది.

ఏఆర్‌ టెక్నాలజీతో వచ్చే ఈ ప్రత్యేకమైన ల్యాప్‌టాప్ ధరను కంపెనీ $1,700 (సుమారు రూ. 1,42,035)గా నిర్ణయించింది. అయితే ల్యాప్‌టాప్ సాధారణంగా $1,900 (సుమారు రూ. 1,58,745)కి విక్రయిస్తుంది. ల్యాప్‌టాప్‌ను $100 (సుమారు రూ. 8355) చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ల్యాప్‌టాప్ డెలివరీ అక్టోబర్ 2024 నుండి యూఎస్‌లో ప్రారంభమవుతుంది. భారత మార్కెట్‌లో వినియోగదారుల కోసం ఎప్పుడు లాంచ్ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. అంతా బాగానే ఉంది కాని ఈ AR గ్లాస్సెస్ రెగ్యులర్ గా వర్క్ చెయ్యడానికి వాడితే కంటి సమస్యలు అలానే బ్రెయిన్ కి అది ఎంత వరుకు ఎఫెక్ట్ అవుతుంది అలాంటి టెస్ట్స్ ఏమన్నా చేసారా అనేది ముందు ముందు వచ్చే వివరాల్లోనే తెలుసుకోవాలి.