Dharani
Samsung Galaxy F14: బడ్జెట్ ధరలో అది కూడా మంచి కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే సామ్‌సంగ్ ఓ ఫోన్‌ని తీసుకొచ్చింది. ధర కూడా 9 వేలే. ఆ ఫోన్ వివరాలు మీకోసం
Samsung Galaxy F14: బడ్జెట్ ధరలో అది కూడా మంచి కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే సామ్‌సంగ్ ఓ ఫోన్‌ని తీసుకొచ్చింది. ధర కూడా 9 వేలే. ఆ ఫోన్ వివరాలు మీకోసం
Dharani
నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ అనేది మనిషి జీవితంలో ఓ భాగం అయ్యింది. కరోనా ఫలితంగా ఆన్‌లైన్ క్లాసుల పేరు చెప్పి.. చిన్నారుల చేతుల్లోకి కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి. ఇక మొన్నటి వరకు కూడా డేటా తక్కువ ధరకే లభిస్తుండటం.. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడానికి ఓ కారణం అని చెప్పవచ్చు. ఇక దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో.. చాలా వరకు కంపెనీలు.. బడ్జెట్ ధరల్లో వీటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా సామ్‌సంగ్ కూడా ఇదే బాటలో పయనిస్తూ.. కేవలం 9 వేల రూపాయల ధరలోనే.. అది కూడా 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చింది. మరి దాని ఫీచర్స్ ఏంటి.. ఎక్కడ కొనాలి.. వంటి వివరాలు.. మీ కోసం
ప్రస్తుతం దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలన్ని.. 5 జీ సేవలు అందిస్తున్నాయి. దాంతో మొబైల్ కంపెనీలన్ని.. 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఇకపై రాబోయేదంతా 5జీ యుగమే కావడంతో.. మొబైల్ కంపెనీల మధ్య విపరీతైమన పోటీ నెలకొని ఉంది. దాంతో చాలా కంపెనీలు తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌లని అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధర, దాని ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సామ్‌సంగ్ బడ్జెట్ ధరలో గ్యాలక్సీ ఎఫ్14 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఫుల్‌హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ప్రస్తుతం ఈ ఫోన్.. సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ స్క్రీన్‌ను అందించారు. 90 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీంతో పాటు ఈ ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులోని ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఒన్‌యూఐ 6.1 ఓఎస్‌లో రన్ అవుతుంది. కెమరా విషయానికి వస్తే.. 50 ఎంపీతో ప్రైమరీ కెమరా, 2 ఎంపీతో మరో రెండు కెమరాలను అందుబాటులోకి తెచ్చారు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 13 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమరాను ఇచ్చారు.
ఇక ఈ ఫోన్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5.1, జీపీఎస్ వంటి ఫీచర్లను అందించారు. గతేడాది తీసుకొచ్చిన గ్యాలక్సీ ఎఫ్14 ఫోన్‌కి అప్‌డగ్రేడ్ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999గా నిర్ణయించారు. ఇక ఈ ఫోన్‌ను మూన్‌లైట్ సిల్వర్, పెప్పర్‌మింట్ గ్రీన్ కలర్స్‌లో తీసుకొచ్చారు.