iDreamPost
android-app
ios-app

మైక్రోసాఫ్ట్ డౌన్.. స్తంభించిన ప్రపంచం.. అసలు ఏం జరిగిందంటే?

Reason Behind Microsoft 365 Services Down: ప్రస్తుతం ప్రపంచం మొత్తం మైక్రోసాఫ్ట్ 365 సర్వీసెస్ డౌన్ అవ్వడం వల్ల ఎఫెక్ట్ అవుతోంది. చాలా వరకు సర్వీసెస్ అన్నీ మైక్రోసాఫ్ట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే అసలు ఈ సినారియోలో ఏం జరిగిందో చూద్దాం.

Reason Behind Microsoft 365 Services Down: ప్రస్తుతం ప్రపంచం మొత్తం మైక్రోసాఫ్ట్ 365 సర్వీసెస్ డౌన్ అవ్వడం వల్ల ఎఫెక్ట్ అవుతోంది. చాలా వరకు సర్వీసెస్ అన్నీ మైక్రోసాఫ్ట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే అసలు ఈ సినారియోలో ఏం జరిగిందో చూద్దాం.

మైక్రోసాఫ్ట్ డౌన్.. స్తంభించిన ప్రపంచం.. అసలు ఏం జరిగిందంటే?

ప్రపంచం మొత్తం సాంకేతికంగా స్తంభించి పోయింది. విమాన సర్వీసులు, స్టాక్ మార్కెట్స్, మరెన్నో సేవలు నిలిచిపోయాయి. చాలాచోట్ల విమాన రాకపోకలకు, టికెట్స్ బుక్ చేసుకోవడానికి.. చెక్ ఇన్ కి కూడా సమస్యలు ఏర్పడుతున్నాయి. దీని అంతటికీ కారణం.. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ అన్నీ డౌన్ అయిపోవడమే. ఏయే సంస్థలకు మైక్రోసాఫ్ట్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉందో.. ఆ సంస్థలకు చెందిన సర్వీసులు మొత్తం స్తంభించిపోయాయి. కాసేపు అంతా గందరగోళం అయిపోయింది. అన్ని ప్రముఖ సంస్థలు సోషల్ మీడియాలో తమ వినియోగదారులకు విజ్ఞప్తులు చేయడం స్టార్ట్ చేశాయి. అయితే ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ ఎందుకు డౌన్ అయ్యాయో చూద్దాం.

విమాన సర్వీసులకు అంతరాయం:

మైక్రోసాఫ్ట్ 365 సర్వీసెస్ యాప్స్ డౌన్ అవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్పైస్ జెట్, అకాసా ఎయిర్, ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. బుకింగ్, చెక్ ఇన్, ఫ్లైట్ అప్ డేట్స్ కు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇండియాలోనే కాకుండా.. యూఎస్ కు చెందిన ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ఎయిర్ పోర్టులో కూడా సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ అయితే 147 విమానాలను రద్దు చేసుకుంది. 212 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు అందరూ అసలు మైక్రోసాఫ్ట్ 365 సర్వీసులకు ఏమైంది? ఎందుకు ఈ అంతరాయం ఏర్పడింది అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ఈ సమస్యపై ఈ టెక్ దిగ్గజం స్పందించింది.

అంతరాయానికి కారణం?:

మైక్రోసాఫ్ట్ పేజ్ హెల్త్ స్టేటస్ ని బట్టి చూస్తే.. అజ్యూర్ బ్యాకెండ్ వర్క్ లోడ్స్ కి సంబంధించి కన్ఫిగరేషన్ ఛేంజ్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు. అలా చేయడం వల్ల కంప్యూట్ రిసోర్సెస్ కి స్టోరేజ్ కి సంబంధించి సమస్యలు తలెత్తాయి. దానివల్ల మైక్రోసాఫ్ట్ 365కి సంబంధించిన అన్ని యాప్స్ డౌన్ అయ్యాయి. యూజర్ వాడేందుకు వీలు లేకుండా.. ల్యాప్ ట్యాప్స్ బ్లూ స్క్రీన్స్ వచ్చేశాయి. ఎక్స్ బాక్సులు కూడా వర్క్ అవ్వలేదు. ఇంక విమానా సర్వీసులు మొత్తం స్తంభించిపోయాయి. విడోయస్ ఆపరేటింగ్ సిస్టమ్ 10, 11లో ప్రధానంగా సమస్యలు వచ్చాయి. ఈ సమస్య జులై 19న తెల్లవారుజామున 3.26 గంటల సమయంలో వచ్చినట్లు తెలిపారు.

మైక్రోసాఫ్ట్ ఏం చెప్పింది?:

ఈ విషయం తెలియగానే మైక్రోసాఫ్ట్ సంస్థ ఎంతో వేగంగా స్పందించింది. తెల్లవారుజాము నుంచి ఈ సమస్యపై పని చేస్తోంది. ఇప్పటికే కొన్ని యాప్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ డిఫెండర్, షేర్ పాయింట్ ఆన్ లైన్, ఇన్ ట్యూన్, వన్ నోట్ వంటి వాటిని వర్క్ అయ్యేలా చేశారు. కానీ, పవర్ బీఐ, పర్ వ్యూ, వివా ఎంగేజ్, టీమ్స్, ఫ్యాబ్రిక్ వంటివి ఇంకా అందుబాటులోకి రాలేదు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ ట్రాఫిక్ మొత్తాన్ని ఆల్టర్ నేటివ్ రీసోర్సెస్ కి రీరూట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమస్యను పరిష్కరించడమే వారి అత్యంత ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. దానికి తగినట్లుగానే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడితే.. పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రపంచం మొత్తం చూసింది. మరి.. మైక్రోసాఫ్ట్ 365 సర్వీసుల్లో అంతరాయం ఏర్పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి