పవర్ కట్స్‌తో బాధపడుతున్నారా? ఐతే ఈ పోర్టబుల్ జనరేటర్ మీ కోసమే!

Solar Portable Generator: కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ మినీ పోర్టబుల్ జనరేటర్ మీ కోసమే. దీని మీద మీరు మిక్సీని రన్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్ వాడుకోవచ్చు. ల్యాప్ టాప్, కంప్యూటర్లు వాడుకోవచ్చు. చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

Solar Portable Generator: కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ మినీ పోర్టబుల్ జనరేటర్ మీ కోసమే. దీని మీద మీరు మిక్సీని రన్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్ వాడుకోవచ్చు. ల్యాప్ టాప్, కంప్యూటర్లు వాడుకోవచ్చు. చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

ఎండాకాలం అయినా.. వర్షాకాలం అయినా విద్యుత్ కోతలు మామూలే. వర్షాలు పడితే అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. గాఢ నిద్రలో ఉండగా పవర్ పోతే అమ్మ బాబోయ్ ప్రాణాలు పోయినంత పనవుద్ది. ఇంట్లో పిల్లలు ఉంటే పెద్దలకి ఆ రాత్రంతా నరకమే. అసలు కరెంట్ పోయిందంటే పోయినట్టు తెలియకూడదు, మళ్ళీ వచ్చినప్పుడు వచ్చినట్టు తెలియకూడదు. అలా ఉండాలి. అలా ఉండాలంటే మీ ఇంట్లో ఈ మినీ పోర్టబుల్ జనరేటర్ ఉండాలి. జనరేటర్ అంటే మీకు తెలిసిందే. బాగా ఉన్నవాళ్లు, పెద్ద పెద్ద కంపెనీలు, వ్యాపార సంస్థలు వాడుతుంటాయి. డీజిల్ సహాయంతో నడుస్తుంటాయి. అంత పెద్ద జనరేటర్లు సామాన్యులు కొనలేరు. కాబట్టి ఈ మినీ సైజ్ పోర్టబుల్ ని కొనుక్కోండి. మీకు బాగా ఉపయోగపడుతుంది. 

సోలార్ 700 ఎల్ఐ-ఎకో పోర్టబుల్ లిథియం పవర్ జనరేటర్. ఇది మల్టీ ఫంక్షనల్ లిథియం పవర్ జనరేటర్. ఈ పవర్ స్టేషన్ 230 వోల్ట్స్ ఏసీ అవుట్ పుట్ ని ఇస్తుంది. ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండు 5 వోల్ట్స్ డీసీ అవుట్ పుట్, 12 వోల్ట్స్ తో నడిచే 4 డీసీ గృహోపకరణాలకి సరిపడా పవర్ ని సరఫరా చేస్తుంది. ఈ సోలార్ జనరేటర్ లో 15 వాట్ హై పవర్ ఎల్ఈడీ లైట్ కలిగి ఉంది. ఇది ఏసీ, డీసీ లోడ్స్ ని సపోర్ట్ చేస్తుండడం దీని ప్రధాన అడ్వాంటేజ్. ఈ జనరేటర్ ని ఉపయోగించి 80 వాట్స్ కంప్యూటర్ ని, 30 వాట్స్ మొబైల్ ని, 10 వాట్స్ ట్రిమ్మర్ ని, 100 వాట్స్ స్మార్ట్ టీవీని, 20 వాట్స్ సీఎఫ్ఎల్ లేదా ఎల్ఈడీ బల్బ్ ని, 400 వాట్స్ టోస్టర్ ని రన్ చేసుకోవచ్చు.

60 వాట్స్ టేబుల్ ఫ్యాన్, 400 వాట్స్ మిక్సీ, 80 వాట్స్ ల్యాప్ టాప్, 100 వాట్స్ కెమెరా బ్యాటరీ ఛార్జర్, 60 వాట్స్ సీలింగ్ ఫ్యాన్, 400 వాట్స్ కాఫీ మేకర్ ని వాడుకోవచ్చు. ఇది 12 వోల్ట్స్ డీసీ అవుట్ పుట్ తో వస్తుంది. దీని బరువు 15 కిలోలు. సులువుగా ఒక చోట నుంచి మరొక చోటకి ఎక్కడికైనా తీసుకెళ్లేలా దీన్ని రూపొందించారు. కమర్షియల్ పర్పస్ కూడా దీన్ని వాడుకోవచ్చు. దీనిపై ఏడాది పాటు వారంటీ కూడా వస్తుంది. ఇది కరెంట్ ఉన్నప్పుడు ఛార్జ్ అవుతుంది. అలానే కరెంట్ పోయినప్పుడు మీ ఇంట్లో సోలార్ ప్యానెల్ ఉంటే దాని ద్వారా కూడా ఛార్జ్ అవుతుంది. పగలంతా కరెంట్ పోయినా గానీ దీని ద్వారా కరెంట్ ని పొందవచ్చు. రాత్రి సమయంలో సోలార్ బ్యాటరీలు ఉంటే కనుక దాన్నుంచి పవర్ బ్యాకప్ వస్తుంది. ఓవర్ లోడ్, ఓవర్ ఓల్టేజ్, ఓవర్ కరెంట్, ఓవర్ టెంపరేచర్, షార్ట్ సర్క్యూట్, సెల్ బ్యాలెన్సింగ్ వంటి మల్టీపుల్ సేఫ్టీ ప్రొటెక్షన్ తో వస్తుంది. కార్ ఛార్జ్ ఇన్పుట్ గా కూడా వాడుకోవచ్చు. అంటే కారులో దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

70 ఏహెచ్ లిథియం బ్యాటరీతో వస్తుంది. దీని వల్ల పవర్ బ్యాకప్ అనేది ఎక్కువ సేపు ఉంటుంది. పవర్ కట్స్ సమయంలో ఇంట్లో బాగా ఉపయోగపడుతుంది. వేగంగా బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఇది 240 వాట్ ఎంపీటీటీ సోలార్ ప్యానెల్ ని సపోర్ట్ చేస్తుంది. ఫోన్లు, ట్యాబ్లెట్లు లాంటివి ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బీ పోర్ట్ ఉంది. ఈ సోలార్ జనరేటర్ ని కరెంట్ ద్వారా, సోలార్ ప్యానెల్ ద్వారా, రన్నింగ్ కారులో సీజీ పోర్ట్ ద్వారా, ఇంజిన్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని అసలు ధర ఆన్ లైన్ లో 33,650 రూపాయలుగా ఉంది. కానీ దీన్ని మీరు ఆఫర్ లో రూ. 24,380 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఉంటే అదనంగా రూ. 1250 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments