iDreamPost
android-app
ios-app

వీడియో: సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు చూశారు.. OLA సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ వచ్చేస్తోంది..

OLA Self Balancing EV Bike: మీరు ఇప్పటివరకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి విని ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలు చూసుంటారు. కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ గురించి విన్నారా? అలాంటి బైక్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

OLA Self Balancing EV Bike: మీరు ఇప్పటివరకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి విని ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలు చూసుంటారు. కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ గురించి విన్నారా? అలాంటి బైక్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

వీడియో: సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు చూశారు.. OLA సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ వచ్చేస్తోంది..

మారుతున్న టెక్నాలజీతో ఆటోమొబైల్స్ లో కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. అన్ని కంపెనీలు తమ వాహనాల్లో కొత్తదనం నింపేందుకు, సరికొత్త ఫీచర్స్ అందించేందుకు పని చేస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన రెవల్యూషన్స్ లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి అందరికీ తెలుసు. ఇండియాలో కూడా కొన్ని కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో ఉన్నాయి. అయితే ఎప్పుడైనా సెల్ఫ్ డ్రైవింగ్ టూవీలర్ గురించి విన్నారా? అసలు టూ వీలర్ విషయంలో అలాంటి ఆలోచన కూడా వచ్చి ఉండదు. కానీ, ఓలా కంపెనీకి అలాంటి థాట్ వచ్చింది. అందుకే ఓలా సోలో అని ప్రాజెక్ట్ ని చేపట్టారు. అందుకు సంబంధించిన వీడియో కూడా విడుదలచేశారు.

సాధారణంగా సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ అనగానే కచ్చితంగా ఎవ్వరూ నమ్మరు. ఓలా కంపెనీ తమ ఓలా సోలో గురించి ఏప్రిల్ ఒకటో తేదీన అనౌన్స్ చేసింది. అందరూ వినియోగదారులను ఫూల్స్ చేసేందుకు ఓలా కూడా అలాంటి ఒక ప్రాంక్ చేసింది అనుకున్నారు. కానీ, ఓలా వ్యవస్థాపకుడు భవనీశ్ అగర్వాల్ మరోసారి తమ సెల్ఫ్ బ్యాలెన్సింగ్, అటామనస్ టూ వీలర్ కి సంబంధించిన వివరాలు మరోసారి వెల్లడించారు. తాము చేపట్టిన ఓలా సోలో ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలను వెల్లడించారు. భవనీశ్ పోస్ట్ చేసిన వీడియోలో ఒక ఓలా ఎలక్ట్రిక్ బైక్ దానంతట అదే ముందుకు వెళ్తూ ఉంది. కింద పడకుండా నేరుగా వెళ్లడమే కాకుండా.. పక్కకు కూడా తిరుగుతోంది. ఆగిపోయినా కూడా పక్కకు పడకుండా బ్యాలెన్స్ అవుతోంది. ఈ వీడియో మరోసారి పోస్ట్ చేస్తూ.. ఆ వీడియో సరదా కోసమే తీశామన్నారు. కానీ, వారి ప్రాజెక్ట్ మాత్రం నిజమేనని చెప్పారు.

ఓలా బృందం ఒక అటానస్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టూవీలర్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని చెప్పారు. దానికి సంబంధించిన ప్రోటోటైప్ కూడా సిద్ధం చేశామన్నారు. ఫ్యూచర్లో తమ నుంచి వచ్చే ఉత్పత్తుల్లో ఈ టెక్నాలజీని చూసేందుకు ఆస్కారం ఉంటుందని భవనీశ్ స్పష్టం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఈ టెక్నాలజీని ప్రశంసిస్తున్నారు. ఇదే గనుక ఆచరణలోకి వస్తే.. ఓలాని ఎవరూ టచ్ చేయలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కొంతమంది ఈ టెక్నాలజీపై పెదవి విరుస్తున్నారు. అసలు అలాంటి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైక్ వల్ల ఏంటి లాభం అంటున్నారు. ఇంకొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న బైక్స్ క్వాలిటీపై దృష్టి పెట్టాలంటూ సూచిస్తున్నారు. మరి.. ఈ టెక్నాలజీ ఉపయోగమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.