భూమ్మీదున్న ప్రతి ఒక్కరినీ కోటీశ్వరులని చేసే వజ్రాల గని.. ఎక్కడుందో తెలుసా?

14 KM Diamond Layer Exist On Mercury Said NASA: ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ ధనవంతులు అయ్యేంత వజ్రాల గని ఉందట. అయితే ఆ గని ఎక్కడ ఉందో, అది ఎంత పెద్దదో.. అంత పెద్ద గని ఎలా ఏర్పడిందో? ఆ గనిలోంచి వజ్రాల వెలికితీత వంటి విషయాలను నాసా వెల్లడించింది.

14 KM Diamond Layer Exist On Mercury Said NASA: ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ ధనవంతులు అయ్యేంత వజ్రాల గని ఉందట. అయితే ఆ గని ఎక్కడ ఉందో, అది ఎంత పెద్దదో.. అంత పెద్ద గని ఎలా ఏర్పడిందో? ఆ గనిలోంచి వజ్రాల వెలికితీత వంటి విషయాలను నాసా వెల్లడించింది.

భూమ్మీద ఏమైనా నిధులు, నిక్షేపాలు ఉంటాయని మైనింగ్ చేస్తుంటారు. శాస్త్రవేత్తలు ఎప్పుడూ రెడీగా ఉంటారు. కొంతమంది బృందాలుగా వెళ్లి మైనింగ్ చేసి వజ్రాలు, రత్నాలు, బంగారం వంటివి తవ్వి బయటకు తీస్తుంటారు. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరినీ కోటీశ్వరులని చేసేంత స్థాయి కలిగిన వజ్రాల గనిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ వజ్రాల గనిని తవ్వితే కనుక భూమ్మీద ఉన్న అందరూ ధనవంతులు అయిపోయే ఛాన్స్ ఉందట. అంతలా అక్కడ వజ్రాలు ఉన్నాయి. ఈ విషయాన్ని నాసా తెలిపింది.    

బుధ గ్రహం మీద 15 కి.మీ. మేర విస్తరించి ఉన్న మందపాటి వజ్రాల పొరను నాసా కనుగొంది. బుధ గ్రహం ఉపరితలం కింద 9 మైల్స్ మేర వజ్రాలు కలిగిన ఒక పొర ఉందని నాసా గుర్తించింది. దీనికి సంబంధించి ఫైండింగ్స్ అన్నీ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రచురించబడిన స్టడీలో వివరించారు. ఈ పరిశోధన ప్లానెట్ కంపోజిషన్, యూనిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అన్వేషిస్తుంది. అయితే బుధ గ్రహం ఉపరితలం కింద లోతుగా ఉన్న ఈ వజ్రాల పొర మైనింగ్ కి అనుకూలంగా లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని లోతు, అలానే కఠినమైన పరిస్థితుల కారణంగా వజ్రాల పొరను తవ్వి బయటకు వజ్రాలను తీయడం కష్టమని చెబుతున్నారు. అంతకు ముందు చేసిన పరిశోధనలో బుధ గ్రహం లోతు తక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది.

కానీ ఇప్పుడు దాన్ని మించిన లోతు బుధ గ్రహం కలిగి ఉందని నాసా తెలిపింది. ఈ పరిశోధన అధునాతన టెక్నాలజీ సాయంతో బుధ గ్రహం అంతర భాగాన్ని అధ్యయనం చేసింది. భూకంప మరియు మాగ్నెటిక్ డేటా ఆధారంగా బుధ గ్రహం మీద డైమండ్ లేయర్ ఉన్నట్టు అంచనా వేశారు. 2008 నుంచి 2015 వరకూ బుధ గ్రహం చుట్టూ తిరుగుతున్న నాసా వ్యోమనౌక మెసెంజర్ నుంచి వచ్చిన డేటా ఆధారంగా డైమండ్ పొర ఉన్నట్లు నాసా వెల్లడించింది. గతంలో ఈ పొరను గ్రాఫైట్ పొర అని అనుకుంది. కానీ అది వజ్రపు పొర అని తేల్చింది. ఈ మెసెంజర్ మిషన్ బుధ గ్రహం యొక్క జియాలజీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కీలకమైన డేటాని అందించింది. ఆ గ్రహం ధృవం మీద వాటర్ ఐస్ తో సహా ముఖ్య లక్షణాలను కనుగొంది.

పరిశోధనల ప్రకారం.. గ్రహం యొక్క పొరలో డెవలప్ అయిన ఆలివిన్ లాంటి ఖనిజాలకు సల్ఫర్ తోడైనప్పుడు ఆ రసాయన మిశ్రమం అధిక ఉష్ణోగ్రతల వద్ద ఘనీభవిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్రం ఏర్పడే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. బుధ గ్రహం అంతర్భాగంలో కూడా ఘనీభవించిన సమయంలోనే వజ్రపు పొర ఏర్పడి ఉండవచ్చునని శాస్త్రవేత్తల కంప్యూటర్ నమూనాలు తెలిపాయి. అంచనాల ప్రకారం.. బుధ గ్రహం అంతర్భాగంలో వజ్రాలు సుమారు 15 కి.మీ. మేర ఒక మందపాటి పొరగా ఏర్పడ్డాయి. అయితే గ్రహం మీద ఉన్న అధిక ఉష్ణోగ్రతలు, దీనికి తోడు వజ్రాలు గ్రహం ఉపరితలం కింద 485 కి.మీ. దిగువున ఉన్న కారణంగా తవ్వడం అసాధ్యమని నాసా వెల్లడించింది.

Show comments