భారత మార్కెట్లో లాంచ్ అవ్వనున్న మోటోరోలా రేజర్ 50 ఫోల్డబుల్ ఫోన్!

Motorola Razr 50: మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకు రాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో రేజర్ 50 ని లాంచ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుంది.

Motorola Razr 50: మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకు రాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో రేజర్ 50 ని లాంచ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుంది.

ఫేమస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మోటోరోలా భారత మార్కెట్లో కొత్త కొత్త ఫోన్‌లని లాంచ్‌ చేస్తుంది. మంచి ఫీచర్లతో వివిధ రకాల ఫోన్లని తీసుకొస్తుంది. ఇక ఇటీవల రేజర్‌ 50 అల్ట్రా పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ టెక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. చాలా సింపుల్ గా కంఫర్ట్ గా ఉండే ఈ ఫోన్ ఫీచర్లు బాగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ సిరీస్ లో మోటో తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది.. మోటోరోలా రేజర్‌ 50 పేరుతో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే మార్కెట్లోకి ఈ ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది. ఇక రాబోయే ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మోటోరోలా రేజర్‌ 50 ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియా టెక్‌ డైమన్సిటీ 7300 ఎక్స్‌ తో, ఆక్టా కొర్, 2.5 GHz ప్రాసెసర్ తో రానుంది.. ఈ ఫోన్ 8జీబీ/12జీబీ ర్యామ్, 256జీబీ/512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సల్ ఇంకా 13 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాతో రానుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సల్ ఉంటుంది. ఈ ఫోన్ 6.9 ఇంచెస్ ఇన్నర్ ఫోల్డింగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఇంకా LTPO అమోల్డ్ స్క్రీన్ ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 30 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు, 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ లో మోటోరోలా కంపెనీ తన అన్ని మోడల్స్ లాగే వాటర్ ప్రూఫ్ టెక్నాలజీని అందిస్తుంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ IPX8 రేటింగ్ వాటర్ రెసిస్టన్స్ తో వస్తుంది. ఇది డ్యూయల్ సిం, 3G, 4G, 5G, VoLTE, వై ఫై, NFC కి సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఫోన్ ధరకి సంబంధించి ఇప్పటి దాకా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ రేజర్ 50 ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. US మార్కెట్‌లో కూడా లాంచ్ అయ్యింది కానీ అక్కడ వేరే పేరుతో (Motorola Razr+ 2024 ఇంకా Razr 2024) లాంచ్ అయ్యింది. మరి చూడాలి ఈ ఫోల్డబుల్ ఫోన్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో..?

Show comments