iDreamPost
android-app
ios-app

12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్.. ధర, ఫీచర్లకి మెంటలే!

  • Published Jul 04, 2024 | 4:54 PM Updated Updated Jul 04, 2024 | 4:54 PM

Motorola Razr 50 Ultra: మార్కెట్లో ఇప్పటికే శామ్ సంగ్, వివో వంటి ఫోల్డబుల్ ఫోన్లు వచ్చాయి. తాజాగా మోటోరోలా కంపెనీ కూడా ఫోల్డబుల్ ఫోన్ ని భారత మార్కెట్లో లాంఛ్ చేసింది. దీని ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. అంత అధునాతన ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Motorola Razr 50 Ultra: మార్కెట్లో ఇప్పటికే శామ్ సంగ్, వివో వంటి ఫోల్డబుల్ ఫోన్లు వచ్చాయి. తాజాగా మోటోరోలా కంపెనీ కూడా ఫోల్డబుల్ ఫోన్ ని భారత మార్కెట్లో లాంఛ్ చేసింది. దీని ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. అంత అధునాతన ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్.. ధర, ఫీచర్లకి మెంటలే!

భారత మార్కెట్లో మోటోరోలా తమ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేసింది. అల్టిమేట్ ఫ్లిప్ ఫోన్ ని పరిచయం చేసింది. ఈ ఫోన్ కొన్నవారికి వైర్ లెస్ ఇయర్ బడ్స్ ని ఉచితంగా ఇస్తుండడం విశేషం. అదనంగా బెస్ట్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ ని పొందాలంటే మోటో బడ్స్ లేదా మోటో బడ్స్+ ఇయర్ బడ్స్ ఉండాల్సిందే. ఇది మోటో ఏఐ ఇంటెలిజెన్స్ తో పని చేస్తుంది. స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో వస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 12 నిమిషాల టర్బో పవర్ ఛార్జ్ తో రోజంతా వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 45 వాట్ ఛార్జింగ్ లేదా 15 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. 

ఫీచర్స్:

ఫాస్ట్ ఫ్లాష్ లైట్, క్విక్ క్యాప్చర్, త్రీ ఫింగర్ స్క్రీన్ షాట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ని రెండు సార్లు పైకి, కిందకి ఫోన్ ని ఊపితే ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది. ఫోన్ ని పట్టుకుని మోచేతిని అటూ, ఇటూ కుడి, ఎడమవైపున రెండు సార్లు కుదిపితే ఫోన్ కెమెరా ఆటోమెటిక్ గా ఆన్ అవుతుంది. ఇక స్క్రీన్ షాట్ తీయాలంటే జస్ట్ మూడు వేళ్ళను స్క్రీన్ మీద పెట్టి ఒక్క సెకను ఉంచితే చాలు స్క్రీన్ షాట్ వస్తుంది. ఫైల్స్ ని, ఇమేజెస్ ని ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ నుంచి ఫోన్ కి, ఫోన్ నుంచి ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ కి ట్రాన్స్ ఫర్ చేయాలంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. అలానే ఫోన్ యాప్స్ ని ల్యాప్ టాప్ లో కూడా చూసుకునేలా ఎక్స్ టెండింగ్ ఫీచర్ ని ఇచ్చారు. మోటో ఏఐ మ్యాజి కాన్వాస్ ఇచ్చారు. దీంతో మీ మైండ్ లో ఉన్న ఆలోచనలను ఇన్పుట్ గా ఇస్తే ఇమేజెస్ ని పొందవచ్చు.

ఇందులో సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను ఇచ్చారు. రెండు రేర్ కెమెరాలు ఇచ్చారు. ఒకటి ఓఐఎస్ టెక్నాలజీతో 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, మరొకటి 50 మెగా పిక్సెల్ టెలీఫోటో కెమెరా వస్తున్నాయి. ఇందులో 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్ ఇచ్చారు. 1 ఎక్స్ లోనూ, 30 ఎక్స్ జూమ్ లోనూ ఫోటో అనేది క్లారిటీగా వస్తుంది. వీడియోల కోసం 60 ఫ్రేమ్స్ వరకూ 4కే రిజల్యూషన్ తో వస్తుంది. ఫోటో ఎన్హ్యాన్స్ మెంట్ ఇంజిన్ ఫీచర్ ఉంది. ఇది మోటో ఏఐ ఎన్హ్యాన్స్డ్ ఇమేజెస్ తో వీడియోలను పర్ఫెక్ట్ గా షూట్ చేస్తుంది. ఇందులో ఉన్న ఏఐ కెమెరా కుదుపులు లేకుండా రన్నింగ్ వీడియోస్ ని కూడా స్థిరంగా రికార్డ్ చేస్తూ అద్భుతమైన అవుట్ పుట్ ని ఇస్తుంది. యాక్షన్ షాట్స్ ని కూడా అద్భుతంగా రికార్డ్ చేస్తుంది. ఇక ఇందులో స్టోర్ చేయబడిన ఫోటోలు, వీడియోల కోసం మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్, ఫోటో అన్ బ్లర్ వంటి ఫీచర్స్ ఇచ్చారు.

ఈ ఫోన్ ని ఫ్లిప్ చేసి పాత క్యామ్ కార్డర్ లా వాడుకోవచ్చు. ఫోటోలు తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మడతపెట్టే ఫోన్ కావడంతో చేతుల్లో కూడా చిన్నగా ఉంటుంది. సెల్ఫీ తీసుకోవడానికి, వీడియో రికార్డింగ్ కి చాలా అనువుగా ఉంటుంది. ఈ ఫోన్ ని సగం వరకూ మడతపెట్టి టేబుల్ కి గానీ లేదా ఏదైనా కార్నర్ కి గానీ తగిలించి ట్రైపాడ్ కెమెరాగా కూడా వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14, హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. మూడేళ్ళ వరకూ ఓఎస్ అప్డేట్స్ ని ఇస్తున్నారు. అలానే సెక్యూరిటీ ప్యాచెస్ మీద నాలుగేళ్ల వారంటీ ఇస్తున్నారు. ఇందులో మోటో ఏఐతో పాటు గూగుల్ జెమినీ ఏఐ ఫీచర్ కూడా ఉంది. పవర్ బటన్ ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి ‘హే గూగుల్’ అంటే చాలు మీరు గూగుల్ జెమినీ ఏఐతో చాట్ చేయవచ్చు.

మడతపెడితే చిన్న డిస్ప్లే, మడత విప్పితే పెద్ద డిస్ప్లే వస్తుంది. దీన్ని చిన్న ఫోన్ గా, పెద్ద ఫోన్ గా వాడుకోవచ్చు. ప్రధాన స్క్రీన్ సైజు 6.9 అంగుళాలతో వస్తుండగా.. చిన్న స్క్రీన్ సైజు 4 అంగుళాలతో వస్తుంది. ఇది 165 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. 12 జీబీ ఎల్పీడీడీ ఆర్5ఎక్స్ ర్యామ్, 512  జీబీ మాసివ్ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. ఇది డ్యూరబుల్ గొరిల్లా గ్లాస్ తో వస్తుంది. ఎక్స్ టర్నల్ డిస్ప్లే కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్, నీటిలో పడినా ఏమీ కాకుండా ఉండడం కోసం ఐపీఎక్స్8 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. కాబట్టి ఇది చేతిలోంచి జారి కింద పడితే పగిలిపోతుందేమో, నీటిలో పడితే పోతుందేమో అన్న టెన్షన్ అక్కర్లేదు. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ తో వస్తుంది.     

ఈ ఫోన్ తో పాటు వచ్చేవి:

  • స్మార్ట్ ఫోన్
  • ఎకో-ఫ్రెండ్లీ రీసైకిల్డ్ కేస్
  • 68 వాట్ పీడీ ఛార్జర్
  • యూఎస్బీ టైప్ సీ టూ టైప్ సీ కేబుల్
  • మోటో బడ్స్+
  • సిమ్ ఎజెక్టర్ టూల్
  • పేపర్ వర్క్

ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. మిడ్ నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పాంటోన్ పీచ్ ఫజ్ రంగుల్లో వస్తుంది. ఇక దీని ధర రూ. 99,999. లాంఛింగ్ సందర్భంగా ఈ ఫోన్ పై 5 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల మీద 5 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది. మొత్తం మీద లాంఛింగ్ లో భాగంగా 10 వేలు తగ్గింపుతో ఈ ఫోన్ ని రూ. 89,999కే పొందవచ్చు. జూలై 20 నుంచి అమెజాన్, రిలయన్స్ స్టోర్స్ తో పాటు ఇతర ప్లాట్ ఫామ్స్ లో కూడా లభిస్తుంది. జూలై 10 నుంచి బుకింగ్ లు మొదలవుతాయి.  

  • ఈ ఫోన్ ని చూసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • ఈ ఫోన్ గురించి తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.