iDreamPost
android-app
ios-app

తక్కువ ధరకే Moto నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు ఇవే..!

  • Published Jan 09, 2024 | 10:15 PM Updated Updated Jan 09, 2024 | 10:18 PM

మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మోటరోలా నుంచి విడుదలైన మోటో జీ34 5జీ ఫోన్‌ ను మీరు కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది.

మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మోటరోలా నుంచి విడుదలైన మోటో జీ34 5జీ ఫోన్‌ ను మీరు కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది.

తక్కువ ధరకే Moto నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు ఇవే..!

స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. అద్భుతమైన ఫీచర్లతో రూపొందించిన ఈ ఫోన్ బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉండనుంది. ఈ మధ్య కాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నవారు ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకోవచ్చు. తాజాగా మోటో జీ34 5జీ పేరుతో స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లో ప్రవేశపెట్టింది. మోటరోలా కంపెనీకి చెందిన ఈ సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.10 వేల లోపు ధరతో కొనుగోలు చేయొచ్చు. 50ఎంపీ ప్రధాన కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం వంటి ఇంకెన్నో ఫీచర్లు, మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.

మోటో జీ34 5జీ ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉండనుంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.11,999గా కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ చార్‌కోల్ బ్లాక్, ఐస్ బ్లూ, ఓషన్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది. జవనరి 17 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయని కంపెనీ వెల్లడించింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని రిటైల్‌ షాపుల్లో కొనుగోలు చేయొచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్ఛేంజీ ఆఫర్‌ సాయంతో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని పొందినట్లయితే, ఈ ఫోన్ యొక్క 4 జీబీ వేరియంట్ రూ. 9,999కి దక్కించుకోవచ్చు.

ఫీచర్స్:

  • డిస్ప్లే: ఈ ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ డిస్‌ప్లేను 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ కలిగి ఉంది.
  • చిప్‌సెట్: అక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ను అమర్చారు.
  • కెమెరా : ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెన్సార్ అందించబడ్డాయి. సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంటుంది.
  • కనెక్టివిటీ: 5G, 3.5 mm ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు మరియు Dolby Atmos సపోర్ట్‌తో వస్తున్న ఈ తాజా హ్యాండ్‌సెట్‌లో భద్రత కోసం సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
  • బ్యాటరీ: 20 వాట్ల టర్బోచార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ సామార్థ్యం ఉంది.