P Venkatesh
ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరకే మార్కెట్ లో అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లతో కేవలం 50 వేలకే లభిస్తోంది. లెక్ట్రిక్స్ ఈవీ సంస్థ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరకే మార్కెట్ లో అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లతో కేవలం 50 వేలకే లభిస్తోంది. లెక్ట్రిక్స్ ఈవీ సంస్థ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ను మార్కెట్లోకి విడుదల చేసింది.
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోయింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా అంతా ఎలక్ట్రిక్ వాహనాలవైపే మొగ్గు చూపుతున్నారు. ధరలు కూడా సామాన్యుల బడ్జెట్ లోనే ఉండడం.. అద్భుతమైన ఫీచర్లతో ఈవీలు మార్కెట్ లోకి విడుదలవుతుండడంతో ఈవీ స్కూటర్లు, బైక్ లకు డిమాండ్ పెరిగిపోయింది. కస్టమర్ల అభిరుచులకు తగినట్టుగా ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థలు సరికొత్త మోడళ్లను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో స్టన్నింగ్ లుక్స్, అదిరే ఫీచర్లతో లెక్ట్రిక్స్ ఈవీ సంస్థ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని మీరు కేవలం రూ. 49,999లకే దక్కించుకోవచ్చు.
మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే.. లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ఈ స్కూటర్ బెస్ట్ అని చెప్పొచ్చు. అంతేకాదు లైఫ్ టైమ్ బ్యాటరీ వారంటీని అందిస్తోంది సంస్థ. ఈ ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 50 కెఎమ్ పీహెచ్. సబ్‌స్క్రిప్షన్ బేసిస్ కింద వినియోగదారులు బ్యాటరీ సర్వీస్ కోసం డబ్బులు చెల్లించాలి. ఇంకా ఇతర మోడల్స్‌తో పోల్చితే.. బ్యాటరీ-ఆస్-ఏ-సర్వీస్ ప్రోగ్రామ్ కింద విక్రయిస్తున్న తమ లెక్ట్రిక్స్ ఈవీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 40 శాతం తక్కువని సంస్థ వెల్లడించింది. సాధారణంగా పెట్రోల్ తో నడిచే స్కూటర్లు కొనుగోలు చేయాలంటే కనీసం లక్ష అయినా వెచ్చించాల్సి ఉంటుంది.
కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం రూ. 49,999 కే అందుబాటులో ఉంది. లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, డోర్-టు-డోర్ సర్వీస్ ఫీచర్లను కలిగి ఉంది. ఇది వరకు ఎల్‌ఎక్స్‌ఎస్ 2.0 పేరిట ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంఛ్ చేసింది లెక్ట్రిక్స్. దీని రేంజ్ 98 కిలోమీటర్లుగా ఉంది. దీంట్లో 2.3 KWH బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 79,999 గా ఉంది. మరి రూ. 49,999కే వస్తున్న లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.