iDreamPost
android-app
ios-app

నోకియా నుంచి బోరింగ్ ఫోన్.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • Published Apr 19, 2024 | 10:18 PM Updated Updated Apr 19, 2024 | 10:18 PM

ప్రస్తుతం ఫోన్ తయారీ కంపెనీలు రోజుకో కొత్త వర్షన్ తో యూజర్లలో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నోకియా నుంచి బోరింగ్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని ప్రత్యేకత ఏంటంటే?

ప్రస్తుతం ఫోన్ తయారీ కంపెనీలు రోజుకో కొత్త వర్షన్ తో యూజర్లలో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నోకియా నుంచి బోరింగ్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని ప్రత్యేకత ఏంటంటే?

నోకియా నుంచి బోరింగ్ ఫోన్.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు అందుబాటులో ఉన్న టెక్నాలజీని తెగ వాడేస్తున్నాయి. మార్కెట్ లో తమ ఉనికిని చాటుకునేందుకు ఒకదానికి మించి మరొకటి న్యూ వర్షన్ లతో మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇటీవల ఇన్ఫీనిక్స్ నుంచి వైర్ లెస్ ఛార్జ్ తో కూడిన స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త రకం ఫోన్ విడుదలైంది. ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా బోరింగ్ ఫోన్‌ను లాంచ్ చేసింది. గతంలో నోకియా ఫోన్లకు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉండేదో వేరే చెప్పక్కర్లేదు. అయితే ఈ ఫోన్ ను తీసుకొచ్చేందుకు నోకియా హీనెకెన్-బోడెగా అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా నోకియా బోరింగ్ ఫోన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మాత్రం మీరు షాకవ్వకుండా ఉండలేరు.

అయితే నోకియా బోరింగ్ ఫోన్లను లిమిటెడ్ గానే తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం 5 వేల యూనిట్లను మాత్రమే మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. కానీ ఈ ఫోన్ ను ఇప్పట్లో సేల్ చేయడం లేదు. ఈ ఫోన్ హ్యాండ్‌సెట్ ఫ్లీప్ స్క్రీన్‌ కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్లో ఉండే ప్రత్యేకతను మాత్రం మీరు ఊహించి ఉండరు. మామూలుగా ఫోన్ అంటే ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. సోషల్ మీడియా యాప్స్ డౌన్ లోడ్ అవ్వాలి ఇంకా ఎన్నో ఫీచర్లు ఉండాలని యూజర్లు కోరుకుంటారు.

కానీ నోకియా బోరింగ్ ఫోన్లో మాత్రం ఇంటర్నెట్ యాక్సెస్, సోషల్ మీడియా, ఇతర థర్డ్ పార్టీ యాప్‌లు ఇందులో డౌన్‌లోడ్ చేయలేరు. గతంలో వచ్చిన ఫీచర్ ఫోన్ల మాదిరిగానే కాల్స్ చేయడానికి, మెసెజింగ్‌కి మాత్రమే యూజ్ అవుతుంది. ఫ్లిప్‌ను మూసివేయడం ద్వారా కాల్‌ను డిస్‌కనెక్ట్ చేయవచ్చు. బోరింగ్ ఫోన్‌లో 2.8-అంగుళాల క్యూవీజీఏ ఇన్నర్ డిస్‌ప్లే, 1.77-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంది. ఇది 0.3 మెగాపిక్సెల్ కెమెరా, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ని కలిగి ఉంది. ప్రస్తుతం అంతా సోషల్ మీడియాలోనే ఎక్కువ టైమ్ గడిపేస్తున్నారు. దీన్ని తగ్గించేందుకే నోకియా బోరింగ్ ఫోన్ ను రూపొందించినట్లు తెలుస్తోంది.