Keerthi
దేశీయ సోషల్ మీడియా యాప్ అయిన కూ సోషల్ మీడియా యాప్ గురించి అందరికి తెలిసిందే. ఇక ఈ యాప్ ను ఎక్స్ ప్లాట్ ఫామ్ కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాప్ ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కారణం ఇదే.
దేశీయ సోషల్ మీడియా యాప్ అయిన కూ సోషల్ మీడియా యాప్ గురించి అందరికి తెలిసిందే. ఇక ఈ యాప్ ను ఎక్స్ ప్లాట్ ఫామ్ కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాప్ ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కారణం ఇదే.
Keerthi
‘కూ’ యాప్.. దేశీయ సోషల్ మీడియా యాప్స్ లో ఇది కూడా ఒకటి. మైక్రో బ్లాగింగ్ సైట్ ‘కూ యాప్’ అనేది ఎక్స్ (ట్విట్టర్) లా పనిచేస్తుంది. పైగా ఇది మన దేశీయ యాప్ కావడం గమన్హారం. అయితే ఇది దేశంలోని పరిణామాల్లో ఎక్స్ సోషల్ మీడియాల్లో సమస్యలు వచ్చినప్పుడు చాలామంది ఈ కూ యాప్ ను వినియోగించిన విషయం తెలిసిదే. పైగా ఈ కూ యాప్ లో ఎక్స్ ప్లాట్ ఫామ్ కు ఉన్న ఫీచర్ల మొత్తం ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా.. దీనిని స్థానిక భాషల్లో మన విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ఇకపోతే ఈ కూ యాప్ అనేది 2019లో అవిష్కరణ చేశారు. ఇక ఈ యాప్ ను అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్కా కలిసి ప్రారంభించారు. అయితే తాజాగా ఈ యాప్ ను మూసి వేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఈ మేరకు లింక్డిన్ లో బుధవారం పోస్ట్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
దేశీయ సోషల్ మీడియా యాప్ అయిన ‘కూ’ (Koo app) యాప్ తాజాగా మూత పడింది. అయితే ఎక్స్ ప్లాట్ ఫామ్ కు ప్రత్యామ్నాయంగా రూపొందించారు ఈ సోషల్ మీడియా యాప్. కాగా, ఈ యూప్ అనేది రైతు ఉద్యమ సమయంలోని అకౌంట్ల బ్లాకింగ్ విషయంలో ట్విటర్‌తో కేంద్రానికి ఘర్షణ నెలకొన్నప్పుడు కూ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రులే స్వయంగా ఆత్మనిర్భర్ యాప్‌గా దీన్ని ప్రమోట్ చేశారు. దీంతో అనతి కాలంలో యూజర్ బేస్ భారీగా పెరిగింది. తర్వాత నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకూ తన కార్యకలాపాలను విస్తరించింది. కానీ, ఆ తర్వాత కాలంలో సంస్థకు ఆర్థిక కష్టాలు చుట్టు ముట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ఆ సంస్థ దిగ జారిది. పైగా ఈ ఏడాది లేఆఫ్ లూ కూడా ప్రకటించింది.
ఇకపోతే గతంలో పలు అంతర్జాతీయ కంపెనీలు, మీడియా హౌస్‌లతో కూ విక్రయం కోసం చర్చలు జరిపినప్పటికీ అవేవీ సఫలమవ్వలేదని, అలాగే డైలీ హంట్ సహా వివిధ కంపెనీలతో విక్రయానికి చర్చలు జరిపినా కూడా ప్రయోజనం లేదని సంస్థ వ్యవస్థాపకులు, మయాంక్ పేర్కొన్నారు. ఇక అందుకే కూ యాప్ కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఈ లింక్డిన్‌లో ఓ నోట్ పెట్టారు. అయితే ఆ నోట్ లో స్థానిక భాషలకు పెద్ద పీట వేస్తూ దేశీయ యాప్‌ను రూపొందించామని, ఓ దశలో 21 లక్షల డైలీ యాక్టివ్ యూజర్లను కూడా ‘కూ’ సొంతం చేసుకుందని తెలిపారు. కానీ నిధుల కొరత తమకు అవరోధంగా మారిందని, దేశీయ యాప్‌ను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని రాసుకొచ్చారు. అలాగే తన నాలుగేళ్ల ప్రయాణంలో ‘కూ’ అనేక హెచ్చు, తగ్గులు చూసిందని ఇక లిటిల్ ఎల్లో బర్డ్ కు గుడ్ బై చెప్తోందంటూ వ్యవస్థాపకులు తమ లింక్డిన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మరి, కూ యాప్ ను నిలివేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.