P Venkatesh
ఇయర్ బడ్స్ ను ఎక్కువగా ఉపయోగించే వారికి సరికొత్త ఇయర్ బడ్స్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా జేబీఎల్ కొత్త ఇయర్‌బడ్స్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. జేబీఎల్ లైవ్ బీమ్ 3 ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది.
ఇయర్ బడ్స్ ను ఎక్కువగా ఉపయోగించే వారికి సరికొత్త ఇయర్ బడ్స్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా జేబీఎల్ కొత్త ఇయర్‌బడ్స్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. జేబీఎల్ లైవ్ బీమ్ 3 ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది.
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది. స్మార్ట్ పరికరాలను విరివిగా వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వాడకం ఎక్కువై పోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను వాడేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో సరికొత్త ఇయర్ బడ్స్ మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. మ్యూజిక్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని ఆయా కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ బడ్స్ ను రూపొందిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు సాధారణమైన ఇయర్ బడ్స్ ను చూశాం. ఇప్పుడు ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ స్మార్ట్ ఛార్జింగ్ కేస్ తో సరికొత్త ఇయర్ బడ్స్ ను తీసుకొచ్చింది. ధర కూడా తక్కువే.
ఆడియో ప్రాడక్ట్స్ తయారీ సంస్థ జేబీఎల్ ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. తాజాగా జేబీఎల్ కొత్త ఇయర్‌బడ్స్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. జేబీఎల్ లైవ్ బీమ్ 3 ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ స్మార్ట్ ఛార్జింగ్ కేస్ తో వస్తోంది. ఈ ఛార్జింగ్ కేసు 1.45 అంగుళా టచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జ్ తో 40 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్స్ లో లభిస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఈ ఇయర్ బడ్స్ పై 44శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వీటి అసలు ధర రూ. 24,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా ఈ ఇయర్ బడ్స్ ను రూ.13,999కే దక్కించుకోవచ్చు.
టచ్ స్క్రీన్ సాయంతో వాల్యూమ్, ఈక్విలైజర్‌ను నియంత్రించొచ్చు. మెసేజ్‌లు చూడొచ్చు. కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు. 48 గంటల ప్లేబ్యాక్ టైమ్ కలిగి ఉంటుంది. ఇయర్‌బడ్స్‌లో 10ఎంఎం డైనమిక్ డ్రైవర్లు అమర్చారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో మెరుగైన సర్వీస్ ను అందిస్తుంది. స్మార్ట్ యాంబియంట్ సౌండ్ మోడ్ ను కూడా కలిగి ఉంటుంది. ఐపీ55 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ (వాటర్ ఫ్రూఫ్)తో వస్తుంది. ఒక్కో ఇయర్‌బడ్ 68ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 12 గంటలపాటు ప్లేబ్యాక్ లైఫ్ ఉంటుంది. ఛార్జింగ్ కేస్ 36 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. స్మార్ట్ కేస్‌ను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. మరి మీరు జేబీఎల్ లైవ్ బీమ్ 3 ఇయర్ బడ్స్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.