ఇన్‌స్టాలో అదిరిపోయే ఫీచర్.. అమ్మాయిలకు మాత్రం ఇది సూపర్ గుడ్ న్యూస్!

New Feature In Instagram: ఇన్స్టాగ్రామ్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ తో అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ఎక్కువగా లాభపడనున్నారు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే?

New Feature In Instagram: ఇన్స్టాగ్రామ్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ తో అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ఎక్కువగా లాభపడనున్నారు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే?

సోషల్ మీడియా యాప్స్ వాడాలంటే అబ్బాయిలకి పెద్ద సమస్య ఉండదు. కానీ అమ్మాయిల విషయంలోనే అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. అమ్మాయిల ప్రైవసీకి ఇబ్బంది కలిగించేలా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు లైవ్ లోకి వస్తే చాలు.. ఎగబడి నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. అలాంటి వారికి చెక్ పెట్టేలా ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇన్ స్టాగ్రామ్ తమ యూజర్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఇది అమ్మాయిలకు సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందులోనూ ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న అమ్మాయిలకు ఈ ఫీచర్ చాలా ప్రయోజనం చేకూర్చబోతుంది. ఇన్నాళ్లు ఇన్స్టా యూజర్స్ లైవ్ లోకి వస్తే ఆ లైవ్ స్ట్రీమింగ్ అనేది ఫాలోవర్స్ అందరికీ కనిపించేది.

ఈ కారణంగా ఫాలోవర్స్ అందరూ ఈ లైవ్ స్ట్రీమ్ లో జాయిన్ అయ్యేవారు. దీని వల్ల లైవ్ స్ట్రీమ్ నిర్వహించిన యూజర్స్ కి భద్రత విషయంలో ముప్పు ఉండేది. ఆకతాయిలు ఎవరైనా ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉండేవి. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఫీచర్ తో ఈ సమస్యకు చెక్ పెట్టినట్లయ్యింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ తో కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే లైవ్ స్ట్రీమ్ లోకి అనుమతించబడతారు. గతంలోలాగా ఫాలోవర్స్ అందరూ లైవ్ స్ట్రీమ్ లో జాయిన్ అవ్వడానికి ఇప్పుడు వీలుపడదు. ఇన్స్టా యూజర్ల భద్రతకు పెద్దపీట వేస్తూ మెటా.. క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్’ అనే సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ తో కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవారు మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ లో జాయిన్ అవ్వడానికి వీలుంటుంది. ఇతరులకు లైవ్ స్ట్రీమ్ లోకి అనుమతి ఉండదు.

యూజర్లు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ లిస్టులోకి కావాల్సిన వాళ్ళను చేర్చుకోవచ్చు.. వద్దనుకున్నవాళ్ళని తొలగించవచ్చు. దీంతో లైవ్ స్ట్రీమ్ లో ఎవరు ఉండాలో అనేది యూజర్లు డిసైడ్ అవ్వచ్చు. అవసరమైన వారిని ఉంచుకుని మిగతా వారిని రిమూవ్ చేయవచ్చు. గత కొన్ని నెలలుగా మెటా సంస్థ ఇన్స్టాగ్రామ్ ను ప్రైవేట్ ప్లేస్ గా మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా 2023 నవంబర్ లో క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే గ్రిడ్ పోస్టులు కనిపించేలా ఒక ఫీచర్ ని తీసుకొచ్చింది. తాజాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ పేరుతో మరో ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో యూజర్లు ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం, వర్క్ విషయంలో కొలాబరేట్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ కి మాత్రం ప్రైవేట్ లైవ్ స్ట్రీమ్స్ ఏర్పాటు చేసుకునేలా ఆప్షన్ ఉంటుంది. దీని కోసం కొంత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. 

Show comments