iDreamPost
android-app
ios-app

భారతదేశంలో అతి త్వరలోనే EV టుక్‌టుక్‌లు ప్రారంభం..

India Is Going To Witnes EV Tuk Tuks On Its Roads Soon: వాతావరణ కాలుష్యంలో కీలక పాత్ర పోషిస్తోంది వాహన రంగం. అందుకే ప్రపంచ దేశాలు విద్యుత్ వాహనాల వైపు మళ్లాయి. ఇప్పుడు ప్రజా రవాణా కూాడా దాదాపుగా ఈవీల్లోకి రావాలి అనేది వారి లక్ష్యం.

India Is Going To Witnes EV Tuk Tuks On Its Roads Soon: వాతావరణ కాలుష్యంలో కీలక పాత్ర పోషిస్తోంది వాహన రంగం. అందుకే ప్రపంచ దేశాలు విద్యుత్ వాహనాల వైపు మళ్లాయి. ఇప్పుడు ప్రజా రవాణా కూాడా దాదాపుగా ఈవీల్లోకి రావాలి అనేది వారి లక్ష్యం.

భారతదేశంలో అతి త్వరలోనే EV టుక్‌టుక్‌లు ప్రారంభం..

పెరుగుతున్న కాలుష్యం నుండి రక్షణ కోసం ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటి వరకు, కేవలం పర్సనల్ వెహికల్స్ నే ఈవీ వెర్షన్లలో విడుదల చేశారు, రవాణా వాహనాలు మాత్రం ఈ విషయంలో వెనుకబడ్డాయి. అయితే, భారతదేశంలో ఆటో రిక్షాలు చాలానే ఉన్నట్లుగా, టుక్‌టుక్‌లు కొన్ని దేశాలలో ప్రజా రవాణాను ఈజీ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో కూడా ఈవీ టుక్‌టుక్‌లను ప్రారంభించడానికి స్పీడ్గా యాక్షన్స్ తీసుకుంటున్నారు. ప్రముఖ కంపెనీ క్లీన్ మోషన్, స్వీడిష్ క్లీన్ మొబిలిటీ లీడర్, ఇండియాలో అభివృద్ధి డెవలప్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌పై వ్యూహాత్మక పెట్టుబడుల పెట్టాలని అనుకుంటున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఆదరణ పొందాయి. ఎందుకంటే కాలుష్యం పెరుగుతున్న కొద్దీ అందులోను వాహనాల ద్వారా బాగా పెరుగుతుంది అని గ్రహించి ప్రభుత్వాలు అలాగే ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడానికి ఇష్టపడుతున్నారు. Covid తరవాత ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చాలా బాగా పెరిగాయి, లాక్ డౌన్ సమయంలో ఓజోన్ పోర దాని అంతట అదే హీల్ అవ్వడం ప్రపంచం అంతా చూసింది, కేవలం రెండు వారాలు పాటు వాహనాలు అనడపడం తగ్గిస్తేనే అంతలా హీల్ అయితే అసలు వాటి వాడకాన్ని దాదాపుగా తగ్గించేస్తే ఏంటి పరిస్థితి అని అలోచించి అందరు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన దృష్టి పెడుతున్నారు. భారతదేశ అనుబంధ సంస్థ, క్లీన్ మొబిలిటీ సొల్యూషన్ ఇండియా, ద్వారా ఈ కంపెనీ ఇండియా యాక్సిలరేటర్‌తో అనుబంధమై ఉన్న ప్రముఖ మైక్రో వీసీ సంస్థ ఫిన్‌వాల్వ్ నుండి 1 మిలియన్ సీడ్ ఫండ్ పెట్టుబడిని తెచ్చుకుంది.

ముందుగా ఇచ్చిన ఈ పెట్టుబడి ఇండియాలో క్లీన్ మోషన్ కోసం ఈ ఎలెక్ట్రి ఆటోలను తయారు చేస్తుంది. అయితే ఇది మేడిన్ ఇండియా ప్రోడక్ట్, ఇప్పుడు ఈ టుక్‌టుక్‌ల గురించి మరింత వివరాలు తెలుసుకుందాం. క్లీన్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో తన నైపుణ్యాన్ని ఉపయోగించి లాస్ట్-మైల్, ఫస్ట్-మైల్ కనెక్టివిటీపై దృష్టి పెట్టాలని వీటిని తయారు చేస్తుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ప్రయాణికుల రవాణా కోసం ఎలక్ట్రిక్ వాహనాలను అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా మెట్రో స్టేషన్లు, మాల్స్, కళాశాలలు, ఆఫీసులు ఉండే అధిక ట్రాఫిక్ ఉన్న రద్దీ ప్రాంతాలలో, ఫిన్‌వాల్వ్ తదుపరి రెండు సంవత్సరాలలో 3 నుండి 5 మిలియన్ యూఎస్ డాలర్ల అదనపు పెట్టుబడితో క్లీన్ మోషన్ ఎక్ష్పన్శన్ కు మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఈ ముందస్తు వ్యూహంలో భాగంగా పూణేలో ఒక ప్రత్యేకమైన మానుఫాక్టురింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇవి “మేడిన్ ఇండియా” ప్రాజెక్టులో భాగంగా మొదలుపెట్టినవి.

క్లీన్ మోషన్, “మేడిన్ ఇండియా” ఈవీ సొల్యూషన్లను అభివృద్ధి చేయాలని టార్గెట్ పెట్టుకుంది, ఇది ఇండియన్ మార్కెట్‌కే కాకుండా ప్రపంచ ఎక్స్పోర్ట్ లకు కూడా ఉపయోగపడుతుంది. అదనంగా, ఆపరేషనల్ క్లస్టర్లలో పవర్ఫుల్ ఈవీ ఛార్జింగ్ బేసిక్ ఏమినిటీస్ అభివృద్ధి చేయాలని కంపెనీ ఆలోచనలో ఉంది. ఈ క్లస్టర్లు 20-25 జీబీ వాహనాల ఫ్లీట్లకు సేవలందించేందుకు వీలుగా ఉంటాయి. ప్రతి క్లస్టర్లో నిర్ణీత పార్కింగ్ స్థలాలు, ప్లగ్-ఇన్ ఛార్జర్లు, పాడైపోయిన బ్యాటరీలను మార్చుకునే సిస్టం ఉండేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగే కొద్ది పొల్యూషన్ చాలా వరుకు తగ్గే అవకాశం ఉంది కాని ప్రతి ఆవిష్కరణలో కూడా కచ్చితంగా కొత్త చల్లెంజేస్ యేవో ఒకటి వస్తూనే ఉంటాయి వాటిని ఎలా అధికమించాలి అనేది ముందు ముందు చూడాలి.