వార్త నిజమో కాదో క్షణాల్లో నిర్ధారించుకోండి.. ఫేక్ న్యూస్‌ని ఇలా అరికట్టండి

Know The News Is Real Or Fake By AI: వార్త నిజమో కాదో క్షణాల్లో నిర్ధారించుకోవచ్చు. ఫేక్ న్యూస్ ని మీరే స్వయంగా అరికట్టవచ్చు. అది కూడా స్మార్ట్ ఫోన్ తోనే సాధ్యం. ఏఐ టెక్నాలజీ సహాయంతో ఒక వార్త నిజమో కాదో తెలుసుకుని ఫేక్ న్యూస్ అయితే కనుక చెక్ పెట్టండిలా!

Know The News Is Real Or Fake By AI: వార్త నిజమో కాదో క్షణాల్లో నిర్ధారించుకోవచ్చు. ఫేక్ న్యూస్ ని మీరే స్వయంగా అరికట్టవచ్చు. అది కూడా స్మార్ట్ ఫోన్ తోనే సాధ్యం. ఏఐ టెక్నాలజీ సహాయంతో ఒక వార్త నిజమో కాదో తెలుసుకుని ఫేక్ న్యూస్ అయితే కనుక చెక్ పెట్టండిలా!

నిజం గడప దాటే లోపు అబద్దం ఊరంతా తిరిగి వస్తుందట. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగం తీరు చూస్తే అలానే ఉంది. నిత్యం వందల, వేల ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. మారుమూల పల్లెల్లో ఉండే వాళ్ళు ఆ వార్తలు చూసి అదే నిజం అనుకుంటున్నారు. ఆ వార్త నిజమో, కాదో అన్న నిర్ధారణ కూడా చేసుకోకుండా షేర్లు చేస్తున్నారు. దీని వల్ల కొన్నిసార్లు అటువంటి ఫేక్ వార్తలు షేర్ చేసినందుకు చిక్కుల్లో కూడా పడుతున్నారు. అయితే మీ స్మార్ట్ ఫోన్ లో కనిపించే వార్తలు నిజమో కాదో స్మార్ట్ ఫోన్ లోనే నిర్ధారించుకోవచ్చు. 

ఇప్పటికే ఏఐ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఏఐ, మెటా ఏఐ వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్స్ లో మీరు ఎలాంటి సమాచారాన్ని అయినా పొందవచ్చు. మెటా ఏఐ, జెమినీ ఏఐ నుంచి టెక్స్ట్ ఇన్పుట్స్ ఇచ్చి ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. అలానే లేటెస్ట్ న్యూస్ లు, బ్రేకింగ్ న్యూస్ లు పొందవచ్చు. వీటితో పాటు సెలబ్రిటీలకు సంబంధించినవి లేదా రాజకీయ ప్రముఖులకు సంబంధించిన వార్తలు నిజమో కాదో కూడా చెక్ చేయవచ్చు. ముందుగా మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తే మీకు మెటా ఏఐ చాట్స్ పైన ఒక రౌండ్ సర్కిల్ కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేస్తే చాట్ బాక్స్ లోకి వెళ్తారు. అందులో మీరు ఏదైనా ఒక వార్తకు సంబంధించి నిజమా? కాదా? అని మెటా ఏఐని అడగవచ్చు.

నిజం అయితే నిజం అని.. ఫేక్ అయితే ఫేక్ అని చెబుతుంది. జెమినీ ఏఐలో కూడా ఇదే విధంగా అడగవచ్చు. దీని కోసం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో జెమినీ ఏఐ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేస్తే కింద టైప్, టాక్ లేదా షేర్ ఏ ఫోటో అనే ఆప్షన్ కనబడుతుంది. అందులో మీరు ఏదైనా న్యూస్ గురించి తెలుసుకునేందుకు ఆ న్యూస్ టాపిక్ టైప్ చేసి నిజమో కాదో నిర్ధారించుకోవచ్చు. ముఖ్యంగా యూట్యూబర్స్, కంటెంట్ రైటర్స్ ఏవైనా టాపిక్స్ గురించి రాస్తున్నప్పుడు.. మెటా ఏఐ లేదా జెమినీ ఏఐని అడిగితే అది నిజమో కాదో నిర్ధారిస్తుంది.

చాలా మంది యూట్యూబ్ లో ఫ్యాక్ట్స్ వీడియోస్ చేస్తుంటారు. ఒకరు చెప్పిన కంటెంట్ ని వంద మంది చేస్తారు. అది తప్పు అని తెలియక దాన్నే కొనసాగిస్తుంటారు. దీని వల్ల ఎప్పటికైనా ఫ్యాక్ట్ చెక్ పడుతుంది. కాబట్టి ముందుగానే మెటా ఏఐ లేదా జెమినీ ఏఐలో ఆ వార్త నిజమో కాదో నిర్ధారించుకోవడం మంచిది. మెటా ఏఐ, జెమినీ ఏఐ యాప్స్ లోనే కాకుండా వెబ్ సైట్స్ లో కూడా చెక్ చేయవచ్చు. ఈ విధంగా మీరు ఫేక్ న్యూస్ ని కనుగొనవచ్చు. ఫేక్ న్యూస్ అని తెలిస్తే కనుక ఆ న్యూస్ ని స్ప్రెడ్ చేసిన వారికి రిపోర్ట్ లు కొట్టి ఫేక్ న్యూస్ ని అరికట్టండి.

Show comments