వాట్సాప్‌లో ఫేవరెట్స్ ఫీచర్‌ని ఎలా వాడాలి? దీని వల్ల యూజ్ ఏంటి?

How To Use Favorites Feature In WhatsApp: వాట్సాప్ లో చాలా మందికి కొన్ని ఫీచర్స్ ఉన్నట్టు తెలియదు. వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏంటో అనేది తెలియదు. వాటిలో రెగ్యులర్ గా సన్నిహితంగా ఉండేవారితో చాట్ చేసేవారి కోసం.. ముఖ్యంగా లవర్స్ కోసం సెపరేట్ గా ఒక ప్రత్యేక ఫీచర్ అయితే ఉంది. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

How To Use Favorites Feature In WhatsApp: వాట్సాప్ లో చాలా మందికి కొన్ని ఫీచర్స్ ఉన్నట్టు తెలియదు. వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏంటో అనేది తెలియదు. వాటిలో రెగ్యులర్ గా సన్నిహితంగా ఉండేవారితో చాట్ చేసేవారి కోసం.. ముఖ్యంగా లవర్స్ కోసం సెపరేట్ గా ఒక ప్రత్యేక ఫీచర్ అయితే ఉంది. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

వాట్సాప్ లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వారి కాంటాక్ట్ లే కాకుండా వృత్తి సంబంధిత వ్యక్తుల కాంటాక్ట్ లు కూడా ఉంటాయి. అందులో మళ్ళీ అనేక గ్రూప్ లు ఉంటాయి. పర్సనల్ లైఫ్ లో స్నేహితులకు, కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా అనేక గ్రూప్ లు ఉంటాయి. వాట్సాప్ ఓపెన్ చేయగానే గ్రూప్ లు, చాట్ లు ఇవన్నీ చూస్తే గందరగోళంగా అనిపిస్తుంది. ఎక్కువ సార్లు చాట్ చేసే గ్రూప్స్ ని గానీ ఎక్కువగా చాట్ చేసే వ్యక్తుల కాంటాక్ట్ ని గానీ పిన్ చేసుకుంటే టాప్ లో ఉంటాయి. అయితే పిన్ ఆప్షన్ తో కేవలం మూడు చాట్స్ వరకే పరిమితమై ఉంటుంది. దీని వల్ల మిగతా చాట్స్ ని టాప్ ప్రియార్టీలో యాడ్ చేసుకోవడానికి ఉండదు. కేవలం గ్రూప్స్ కోసమే ప్రత్యేకంగా గ్రూప్స్ అనే ఫిల్టర్ ఉంది. ఇది వాట్సాప్ లోని సెర్చ్ కింద ఉంటుంది.

ఆల్, అన్ రీడ్, ఫేవరెట్స్, గ్రూప్స్ ఇలా నాలుగు ఫిల్టర్స్ ఉంటాయి. ఆల్ అంటే అన్ని మెసేజులు కనిపిస్తాయి. అన్ రీడ్ అంటే మీరు చదవని మెసేజులు మాత్రమే కనిపిస్తాయి. గ్రూప్స్ అంటే కేవలం గ్రూప్స్ ని మాత్రమే చూపిస్తుంది. అయితే ఇది కాకుండా ఫేవరెట్స్ అనే ఫిల్టర్ ఉంది. ఈ ఫేవరెట్స్ అనే ఫిల్టర్ లో మీరు మీకు ఇష్టమైన వ్యక్తుల కాంటాక్ట్స్ ని మాత్రమే చూడగలరు. అంటే మీకు బాగా నచ్చిన వ్యక్తులతో ఎక్కువగా చాట్ చేస్తున్నట్లైతే వారిని ఈ ఫేవరెట్స్ లిస్ట్ లో యాడ్ చేయవచ్చు. ఇలా చేస్తే వారి కాంటాక్ట్స్ ని చాట్స్ లోనో, సెర్చ్ లోనో వెతుక్కోకుండా నేరుగా ఫేవరెట్స్ లోకి వెళ్తే సరిపోతుంది. చాట్స్ లో కాంటాక్ట్స్, గ్రూప్స్ ఉంటాయి. దీని వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది.

అదే సెర్చ్ కింద ఉన్న ఫేవరెట్స్ ఫిల్టర్ మీద ట్యాప్ చేస్తే మీకు నచ్చిన వ్యక్తుల కాంటాక్ట్స్ మాత్రమే కనబడతాయి. ముఖ్యంగా ఈ ఫేవరెట్స్ ఫిల్టర్ ఫీచర్ అనేది కుటుంబ సభ్యులతోనో, సన్నిహితులతోనో ఎక్కువగా రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ చాట్ చేసేవారికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రేమికులకు బాగా ఉపయోగపడుతుంది. అయితే మీకు వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ ఫీచర్ కనబడదు. ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ లో మీ వేలితో స్క్రీన్ ని కిందకి జరిపితే అప్పుడు మీకు ఆర్చివ్డ్ కి, సెర్చ్ కి మధ్యలో ఫేవరెట్స్ అని ఫిల్టర్ కనబడుతుంది. వ్యక్తులనే కాదు.. గ్రూప్స్ ని, కమ్యూనిటీస్ ని కూడా మీరు ఫేవరెట్స్ లో యాడ్ చేసుకోవచ్చు.     

ఫేవరేట్స్ ఫిల్టర్ లో నచ్చిన వ్యక్తుల నంబర్స్ ని ఎలా చేర్చాలి?:

  • ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. 
  • వాట్సాప్ లో పైన కుడివైపున మూడు డాట్స్ పై ట్యాప్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. 
  • సెట్టింగ్స్ లో అకౌంట్, ప్రైవసీ, అవతార్ కింద మీకు ఫేవరెట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది.
  • ఫేవరెట్స్ మీద ట్యాప్ చేస్తే ‘యాడ్ ఫేవరెట్’ అని ఒక ప్లస్ గుర్తు కనబడుతుంది. 
  • దాని మీద ట్యాప్ చేస్తే కాంటాక్ట్స్ ఓపెన్ అవుతాయి. 
  • ఆ కాంటాక్ట్స్ లో మీరు బాగా ఇష్టపడే వ్యక్తుల నంబర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. 
  • యాడ్ చేసిన తర్వాత ఆ కాంటాక్ట్స్ ని ప్రాధాన్యతను బట్టి పైకి కిందకు జరుపుకోవచ్చు. 
  • అందుకోసం కాంటాక్ట్ మీద కుడివైపున మూడు అడ్డు గీతలతో కూడిన ఒక ఆప్షన్ కనబడుతుంది. 

ఇలా కూడా ఫేవరెట్స్ లో నచ్చిన వ్యక్తులను యాడ్ చేసుకోవచ్చు:

  • ఆల్, అన్ రీడ్ పక్కన ఫేవరెట్స్ మీద ట్యాప్ చేస్తే ‘యాడ్ టూ ఫేవరెట్స్’ అనే ఆప్షన్ కనబడుతుంది. 
  • దాని మీద ట్యాప్ చేస్తే మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్న అందరి నంబర్స్ వస్తాయి. 

ఫేవరెట్స్ నుంచి కాంటాక్ట్ నంబర్స్ ని డిలీట్ చేయడం ఎలా?: 

  • సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫేవరెట్స్ లోకి వెళ్ళాలి. 
  • ఫేవరెట్స్ లో పైన కుడి వైపున ఎడిట్ అనే పెన్సిల్ ఐకాన్ కనబడుతుంది. 
  • ఆ పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే డిలీట్ ఆప్షన్ కనబడుతుంది. 
  • మీకు అవసరం లేని కాంటాక్ట్ నంబర్ ని ఫేవరెట్ లిస్ట్ నుంచి తొలగించవచ్చు. 
  • లేదా నేరుగా సెర్చ్ కింద ఉన్న ఫేవరెట్స్ ఫిల్టర్ మీద ట్యాప్ చేసి ‘మేనేజ్ ఫేవరెట్స్’ మీద ట్యాప్ చేయాలి. 
  • డిలీట్ ఐకాన్ కనబడుతుంది. డిలీట్ చేస్తే వద్దనుకున్న కాంటాక్ట్ డిలీట్ అయిపోతుంది. 
  • లేదంటే కాంటాక్ట్ మీద లాంగ్ ట్యాప్ చేసి వదిలితే సెలెక్ట్ అవుతుంది. 
  • అప్పుడు మీకు పైన కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. మూడు డాట్స్ మీద ట్యాప్ చేస్తే బ్లాక్ పైన రిమూవ్ ఫ్రమ్ ఫేవరెట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. 
  • దాని మీద ట్యాప్ చేస్తే ఫేవరెట్స్ లోంచి తొలగించబడుతుంది.
Show comments