వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజులని చూడాలా? ఐతే ఇలా చేయండి!

How To See Deleted WhatsApp Messages: కొంతమంది వాట్సాప్ లో మెసేజులు పెట్టి అవతలి వ్యక్తులు చూసే లోపు డిలీట్ చేస్తుంటారు. అలాంటి మెసేజులని చూడాలంటే కుదరదు. కానీ చూడాలన్న ఆశ చావదు. అయితే మీరు వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజులని చూడాలనుకుంటే ఇలా చేయండి.

How To See Deleted WhatsApp Messages: కొంతమంది వాట్సాప్ లో మెసేజులు పెట్టి అవతలి వ్యక్తులు చూసే లోపు డిలీట్ చేస్తుంటారు. అలాంటి మెసేజులని చూడాలంటే కుదరదు. కానీ చూడాలన్న ఆశ చావదు. అయితే మీరు వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజులని చూడాలనుకుంటే ఇలా చేయండి.

కొంతమంది వాట్సాప్ లో మెసేజ్ పంపిన తర్వాత చూసేలోపు డిలీట్ చేస్తారు. అయితే ఆ డిలీట్ అయిన మెసేజులని చూడాలన్న ఆతురత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఏం మెసేజ్ పెట్టారో అడగలేము.. అడిగినా చెప్పరు. చెప్పేవాళ్ళు అయితే డిలీట్ చేయరన్న ఉద్దేశంతో అడగలేము. కానీ ఏం మెసేజ్ పెట్టారో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అయితే కొన్ని పద్ధతుల ద్వారా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజులని తెలుసుకోవచ్చు. 

మొదటి పద్ధతి:

కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నోటిఫికేషన్ హిస్టరీ ఫీచర్ ఉంటుంది. ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తే.. అందులో నోటిఫికేషన్ హిస్టరీ ఉంటుంది. కొన్ని ఫోన్స్ లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ హిస్టరీ ఉంటుంది. అందులోకి వెళ్ళాక యూజ్ నోటిఫికేషన్ హిస్టరీని టర్న్ ఆన్ చేయాలి. ఈ ఫీచర్ 24 గంటల వరకూ ఆరోజు వచ్చిన నోటిఫికేషన్స్ ని ఉంచుతుంది. డిలీట్ అయిన మెసేజులు కూడా చూసే వీలు ఉంటుంది. 

రెండో పద్ధతి:

వాట్సాప్ ని మీ స్మార్ట్ ఫోన్ నుంచి తొలగించడం లేదా అన్ ఇన్స్టాల్ చేయడం ద్వారా కూడా డిలీట్ అయిన మెసేజులని చూడవచ్చు. అందుకోసం అన్ ఇన్స్టాల్ చేయాలి. లేదా స్మార్ట్ ఫోన్ నుంచి యాప్ ని తొలగించాలి. ఆ తర్వాత మరలా ఇన్స్టాల్ చేయాలి. మొబైల్ నంబర్ తో లాగిన్ అయ్యి బ్యాకప్ కోసం అనుమతి ఇవ్వాలి. ఏదైనా రీసెంట్ బ్యాకప్ ఉంటే కనుక రీస్టోర్ బటన్ పై ట్యాప్ చేయండి. దీని వల్ల అన్ని మెసేజులు వెనక్కి వస్తాయి. మీడియా ఫైల్స్ బ్యాక్ గ్రౌండ్ లో డౌన్ లోడ్ అవుతాయి. అయితే బ్యాకప్ ఒకరోజు ముందు అయి ఉండి.. మెసేజ్ డిలీట్ అయిన గంట తర్వాత మెసేజ్  చూడాలనుకుంటే అవ్వదు. బ్యాకప్ అనేది ఏరోజుకారోజు క్రియేట్ అవుతుంటే కనుక డిలీట్ అయిన మెసేజులు వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి.

మూడో పద్ధతి:

వాట్సాప్ వెబ్ ద్వారా డిలీట్ అయిన మెసేజులని చూడవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా డెస్క్ టాప్ లో వెబ్ వాట్సాప్ లాగిన్ అవ్వాలి. దీని వల్ల ఫోన్ లో మెసేజులు, చాట్ హిస్టరీ వంటివి వెబ్ వాట్సాప్ లో లోడ్ అవుతాయి. డిలీట్ అయిన మెసేజులు కూడా వచ్చే అవకాశం ఉంది.       

నాల్గో పద్ధతి:

పైవేమీ అవ్వకపోతే థర్డ్ పార్టీ యాప్ ఒకటి ఉంది. దాని పేరు నోటిసేవ్ (Notisave). ఇది నోటిఫికేషన్ హిస్టరీలా పని చేస్తుంది. వాట్సాప్ కి వచ్చిన నోటిఫికేషన్స్ ని సేవ్ చేసి ఒకచోట ఉంచుతుంది. దీంతో మీరు డిలీట్ అయిన వాట్సాప్ మెసేజులని చూడవచ్చు. అందుకోసం నోటిసేవ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసే సమయంలో నోటిఫికేషన్స్ యాక్సెస్ చేసేందుకు అనుమతి ఇవ్వాలి. ఫోన్ లోపల, యాప్ నోటిఫికేషన్స్ మెనూలో నోటిసేవ్ మీద ట్యాప్ చేయాలి. ఆ తర్వాత నోటిఫికేషన్ యాక్సెస్ ని అనుమతించాలి. ఆ తర్వాత అలో మీద ట్యాప్ చేసి అనుమతి ఇవ్వాలి.   

పైన చెప్పిన నాలుగు పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని అవలంభిస్తే డిలీట్ అయిన మెసేజులని పొందవచ్చు అని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Show comments