Swetha
Salaar: ఈ సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ఓటిటి లో కూడా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంటుంది.సాధారణంగా ఏదైనా సినిమా ఒకటి లేదా రెండు ఓటిటి లలో రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా ఏకంగా ఏడు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయింది.
Salaar: ఈ సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ఓటిటి లో కూడా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంటుంది.సాధారణంగా ఏదైనా సినిమా ఒకటి లేదా రెండు ఓటిటి లలో రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా ఏకంగా ఏడు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయింది.
Swetha
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2023లో సలార్ సినిమా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కాకముందు నుంచి భారీ హైప్ నెలకొంది. అలానే రిలీజ్ తర్వాత ఈ సినిమా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా థియేటర్స్ లో విధ్వంసం సృష్టించింది. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఆదరించారు. దీనితో ఈ సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ఓటిటి లో కూడా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంటుంది.
సాధారణంగా ఏదైనా సినిమా ఒకటి లేదా రెండు ఓటిటి లలో రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా ఏకంగా ఏడు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయింది. పైగా సలార్ సినిమా మొబైల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అత్యధికంగా చూడబడిన సినిమాగా నిలిచింది అంటూ నిల్సన్ అనే సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, ఎంఎక్స్ ప్లేయర్ ఇలా అనేక రకాల ఓటిటి లలో… వివిధ భాషల్లో సలార్ అందుబాటులో ఉంది. ఎవరిని అడిగిన ఈట్ వాచ్ సలార్ స్లీప్ రిపీట్ ఇదే అంటున్నారని సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు టాక్ నడుస్తూనే ఉంటుంది.
ప్రస్తుతానికి సాలార్ పార్ట్ 2 ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ ఆ సమాధానాలను ఎలా ఇస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటు ప్రభాస్ కూడా చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక సాలార్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో ఎవరికీ ఐడియా లేదు. మొత్తానికి సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతున్నా కానీ ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక ముందు ముందు సాలార్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.