iDreamPost
android-app
ios-app

కన్నప్ప కుట్ర వెనుక ఉన్నది ఎవరంటే ?

  • Published May 28, 2025 | 10:27 AM Updated Updated May 28, 2025 | 10:29 AM

మంచు విష్ణు మూవీకి సంబందించిన హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇండస్ట్రీ వర్గాలను అటు అభిమానులను సైతం ఆలోచనలోకి నెట్టింది. సరిగ్గా ఇంకో నెల రోజుల్లో మూవీ రిలీజ్ ఉండగా ఇలా జరగడం అందరికి ఆందోళన కలిగించింది. అయితే దీని గురించి 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ నుంచి అఫీషియల్ స్టేట్ మెంట్ ఒకటి వచ్చింది.

మంచు విష్ణు మూవీకి సంబందించిన హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇండస్ట్రీ వర్గాలను అటు అభిమానులను సైతం ఆలోచనలోకి నెట్టింది. సరిగ్గా ఇంకో నెల రోజుల్లో మూవీ రిలీజ్ ఉండగా ఇలా జరగడం అందరికి ఆందోళన కలిగించింది. అయితే దీని గురించి 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ నుంచి అఫీషియల్ స్టేట్ మెంట్ ఒకటి వచ్చింది.

  • Published May 28, 2025 | 10:27 AMUpdated May 28, 2025 | 10:29 AM
కన్నప్ప కుట్ర వెనుక ఉన్నది ఎవరంటే ?

మంచు విష్ణు మూవీకి సంబందించిన హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇండస్ట్రీ వర్గాలను అటు అభిమానులను సైతం ఆలోచనలోకి నెట్టింది. సరిగ్గా ఇంకో నెల రోజుల్లో మూవీ రిలీజ్ ఉండగా ఇలా జరగడం అందరికి ఆందోళన కలిగించింది. అయితే దీని గురించి 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ నుంచి అఫీషియల్ స్టేట్ మెంట్ ఒకటి వచ్చింది. ఇది ఆ హార్డ్ డిస్క్ కు సంబందించిన కొన్ని సందేహాలను తీర్చేలా ఉందని అంటున్నారు. ఆ హార్డ్ డిస్క్ లో రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కు మధ్య జరిగిన సిక్వెన్స్ స్టోర్ అయ్యి ఉందట. అది ముంబైలోని హైప్ స్టూడియోస్ నుంచి హైదరాబాద్ లో విష్ణు ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ అయిందట. కానీ అసలు విష్ణు సంస్థకు సంబంధం లేని రఘు, హారిక అనే ఇద్దరి వ్యక్తులు ఇల్లీగల్ గా దాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి వారిద్దరూ కనిపించడం లేదు.

ఇదంతా నాలుగు వారలా కిందట జరిగిన సంఘటన. కానీ రెండు రోజుల క్రితమే ఈ వార్తా వెలుగులోకి వచ్చింది. దీనితో వెంటనే సైబర్ క్రైమ్ అధికారులు విచారణ ప్రారంభించారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఆ 90 నిమిషాల ఫుటేజ్ ని ఆన్ లైన్ లో లీక్ చేసేందుకు ఆ నిందితులు సిద్ధం అయ్యారట. పైగా ఇదంతా ఇండస్ట్రీతో భాగస్వామ్యం అయినా వారే చేయడం ఆశ్చర్యకరమైన విషయం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇన్ టైంలో స్పందించడంతో తక్షణం చర్యలు తీసుకోవడానికి అవకాశం దొరికిందట.

ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే పేర్లను విష్ణు ఇంతవరకు బయటపెట్టలేదు. కానీ ఎవరో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసారని మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే స్పందించి విష్ణు బృందం యాక్టివ్ కావడంతో ఎక్కువ డ్యామేజ్ కాకుండా కాపాడుకోగలిగారు.ప్రస్తుతానికి కన్నప్ప టీం ఊపిరి పీల్చుకున్నారు. కానీ కంప్లీట్ గా అయితే ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని చెప్పొచ్చు. ఇక ముందు ముందు ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.