Tirupathi Rao
వాట్సాప్ ని కేవలం మెసేజ్ ల కోసం మాత్రమే కాకుండా.. ఆడియో, వీడియో కాల్స్ కి కూడా వాడుతూ ఉంటారు. అయితే అలా కాల్స కి వాడటం వల్ల మీ ఫోన్ హ్యాక్ అవుతుందని మీకు తెలుసా?
వాట్సాప్ ని కేవలం మెసేజ్ ల కోసం మాత్రమే కాకుండా.. ఆడియో, వీడియో కాల్స్ కి కూడా వాడుతూ ఉంటారు. అయితే అలా కాల్స కి వాడటం వల్ల మీ ఫోన్ హ్యాక్ అవుతుందని మీకు తెలుసా?
Tirupathi Rao
టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. విపరీతంగా పెరిగిన టెక్నాలజీ మనిషి జీవితాన్ని సులభతరం చేయడం మాత్రమే కాదు.. కష్టాల కడలిలోకి కూడా నెట్టేస్తోంది. సాంకేతికత బాగా పెరిగిన తర్వాత మనుషుల వ్యక్తిగత జీవితానికే కాదు.. ఖాతాలో దాచుకున్న డబ్బుకు కూడా భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎలాంటి మోసానికి గురవుతామో అంటూ బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ భయం రెట్టింపు అయింది. ఇప్పటికే ప్రజలు ఎన్నో రకాల మోసాలను, సైబర్ నేరాలను చూశారు. అయితే మీరు వాడుతున్న వాట్సాప్ ద్వారా కూడా మీ ఫోన్ హ్యాక్ అవుతుందనే విషయం మీకు తెలుసా?
వాట్సాప్ అంటే తెలియని స్మార్ట్ ఫోన యూజర్ ఉండడేమో? ఈ సోషల్ మెసేజింగ్ యాప్ ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్ మరి. దీనిని కేవలం మెసేజెస్ కోసం మాత్రమే కాకుండా కాల్స్ కోసం కూడా వాడుతూ ఉంటారు. ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఈ మెసేజింగ్ యాప్ ద్వారా ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు. కానీ, ఈ వాట్సాప్ యాప్ ద్వారా మీ ఫోన్ హ్యాక్ అవుతుందని మీకు తెలుసా? అవును వాట్సాప్ ద్వారా కూడా మీ ఫోన్ ని హ్యాక్ చేయచ్చు. అలా చేసేందుకు మీరు వాట్సాప్ ద్వారా మాట్లాడే కాల్స్ కారణం కావచ్చు. అంటే మీరు వాట్సాప్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో మీ ఫోన్ ని హ్యాక్ చేసేందుకు వీలుంటుంది.
కాల్స్ సమయంలో మీ లొకేషన్, ఐపీ అడ్రస్ ద్వారా మీ ఫోన్ ని హ్యాక్ చేయచ్చు. అలా హ్యాక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం మాత్రమే కాదు.. మీ బ్యాంకు ఖాతాలు కూడా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే వాట్సాప్ సంస్థ నుంచి మీకు ప్రొటెక్షన్ ఉంటూనే ఉంటుంది. కాల్స్ కి సంబంధించి మీకు వాట్సాప్ లో ఒక ఫీచర్ ఉంటుంది. దానిని ఆన్ చేయడం ద్వారా మీరు ఈ హ్యాక్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. వాట్సాప్ సెట్టింగ్స్ లో ప్రైవసీ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత అందులో అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఆన్ చేసి పెట్టుకోవాలి.
అలా ఐపీ అడ్రస్ ప్రొటెక్షన్ ఆన్ చేయడం ద్వారా మీరు కాల్స్ మాట్లాడే సమయంలో మీకు అదనపు రక్షణ లభిస్తుంది. మీ ఐపీ అడ్రస్ మీరు కాల్ మాట్లాడే వారికి కనిపించదు. మీరు ఇండివిడ్యూవల్ గా మాట్లాడే కాల్స్ దీనిని ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే గ్రూప్ కాల్స్ విషయంలో మీ ఐపీ అడ్రస్ ఎవరికీ కనిపించదు. కాకపోతే ఇది ఆన్ చేయడం వల్ల మీ కాల్స్ లో కాస్త క్వాలిటీ తగ్గుతుంది. కానీ, ప్రొటెక్షన్ మాత్రం ఉంటుంది. ఇంక వాట్సాప్ కాల్స్, మెసేజెస్ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ తో ఉంటాయి. అంటే ఆఖరికి వాట్సాప్ సంస్థ కూడా మీ కాల్స్ వినలేదు. మీ మెసేజెస్ ని చదవలేదు. మరి.. మీ ఫోన్ లో ఈ ఐపీ అడ్రస్ ప్రొటెక్షన్ ఆన్ చేసుకున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.