iDreamPost

ప్రతీ టూవీలర్ తీసుకోవాల్సిన ముఖ్యమైన వస్తువు.. వర్షాల్లో బాగా యూజ్ అవుతుంది

  • Published May 20, 2024 | 12:11 PMUpdated May 20, 2024 | 12:11 PM

టూవీలర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వస్తువును ఖచ్చితంగా కొనుక్కోవాలి. వర్షాలు పడినప్పుడు దీని ఉపయోగం చాలా ఉంటుంది. వర్షాలు కురిసినప్పుడు హెల్మెట్ మీద ఉన్న వర్షపు నీటి వల్ల రోడ్డు సరిగా కనబడదు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అలా జరక్కుండా ఉండాలంటే ఈ హెల్మెట్ వైపర్ ఉండాల్సిందే.  

వైపర్.. ఇది కార్లు, బస్సులు వంటి పెద్ద వాహనాలకు మాత్రమే ఉంటాయి. కానీ బైక్స్, స్కూటీలకి మాత్రం ఉండవు. నిజానికి వర్షాలు పడినప్పుడు టూవీలర్స్ చాలా ఇబ్బందులు పడతారు. హెల్మెట్ తీస్తే స్కిడ్ అయ్యి కింద పడితే ప్రమాదం జరుగుద్దేమో అన్న భయం. పోనీ తీయకుండా నడిపితే మాత్రం ప్రమాదం జరగకుండా ఉంటుందా అంటే చెప్పలేము. ఎందుకంటే భారీ వర్షాలకు రోడ్డు సరిగా కనబడదు. ఎదురుగా ఎవరు వస్తున్నారో తెలియదు. దీని వల్ల చాలా మంది బండ్లు స్కిడ్ అయ్యి కింద పడిపోతున్నారు. అయితే హెల్మెట్ కి వైపర్ ఉంటే బాగుణ్ణు అని ఎప్పుడైనా అనుకున్నారా? మన సమస్య ఏదైనా గానీ దానికి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇవాళ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది. దీంతో ప్రతీ చిన్న సమస్యకి సొల్యూషన్ ని కనిపెడుతున్నారు. 

ఈ క్రమంలో కొన్ని కంపెనీలు హెల్మెట్ వైపర్ ని తయారు చేశాయి. ఇది హెల్మెట్ కి పెట్టుకుంటే చాలు.. కార్లు, లారీలు, బస్సుల వైపర్స్ లానే నీటిని తుడిచేస్తుంటుంది. వర్షం పడుతున్నా హెల్మెట్ మీద నీటిని ఉంచకుండా చేస్తుంది. వర్షాలు పడినప్పుడు ఈ వైపర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈకామర్స్ వెబ్ సైట్స్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రో ప్రైమ్ పేరుతో ఒక వైపర్ అందుబాటులో ఉంది. ఇది యూనివర్సల్ హెల్మెట్ వైపర్. ఇది అన్ని రకాల హెల్మెట్స్ కి సెట్ అవుతుంది. ఐపీ5 వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. యూఎస్బీ ద్వారా దీన్ని ఛార్జింగ్ చేసుకోవాలి.

దీని అసలు ధర రూ. 5,287 ఉండగా.. ఆన్ లైన్ లో రూ. 3,916కే లభిస్తుంది. మరో వైపర్ ఉంది. ష్కాలకార్ మోటార్ సైకిల్ హెల్మెట్ వైపర్. ఇది 2వాట్ సామర్థ్యంతో వస్తుంది. దీని అసలు ధర రూ. 9,911 కాగా రూ. 6,194కే విక్రయిస్తున్నారు. దీన్ని హెల్మెట్ కి సెట్ చేసుకుంటే ఈజీగా రోడ్లను చూడవచ్చు. ఇది కూడా యూఎస్బీ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ హెల్మెట్ వైపర్ పైన ఒక బటన్ ఉంటుంది. అది నొక్కగానే వైపర్ ఆన్ అయ్యి హెల్మెట్ మీద ఉన్న నీటిని తుడిచేస్తుంది. మరి ఇంత ప్రయోజనం  ఉన్న ఈ హెల్మెట్ వైపర్ ఇప్పుడే కొనేయండి. అలానే దీన్ని మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి