iDreamPost
android-app
ios-app

కేటుగాళ్లకు ఝలక్ ఇస్తూ గూగుల్ నిర్ణయం.. ఇకపై మీ డబ్బులు సేఫ్!

గూగుల్ ప్లే స్టోర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేక్ యాప్స్ సమస్య తీరనుంది. యూజర్లు మోసపోకుండా ఉండేందుకు గూగుల్ గవర్నమెంట్ యాప్స్ కు లేబుల్స్ తీసుకురానుంది.

గూగుల్ ప్లే స్టోర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేక్ యాప్స్ సమస్య తీరనుంది. యూజర్లు మోసపోకుండా ఉండేందుకు గూగుల్ గవర్నమెంట్ యాప్స్ కు లేబుల్స్ తీసుకురానుంది.

కేటుగాళ్లకు ఝలక్ ఇస్తూ గూగుల్ నిర్ణయం.. ఇకపై మీ డబ్బులు సేఫ్!

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక మానవ జీవన శైలి మారిపోయింది. నేటి రోజుల్లో ఏ పని జరగాలన్నా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. కాలక్షేపం కోసమైనా జ్ఞానం పెంపొందించుకోవడానికైనా స్మార్ట్ ఫోన్ కీలకంగా మారింది. ఇక యాప్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే చాలు లక్షలాది యాప్స్ దర్శనమిస్తాయి. అయితే ఇటీవల నకిలీ యాప్స్ తో సైబర్ నేరగాళ్లు బురిడీకొట్టిస్తున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ యాప్ ఏదో ఫేక్ యాప్ ఏదో గుర్తించలేని పరిస్థితి దాపరించింది. అయితే ఇటీవల ప్రభుత్వాలు కూడా పలు సేవలను పౌరులకు సులభంగా అందించేందుకు యప్స్ ను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే.

కాగా ఈ యాప్స్ పోలిన ఫేక్ యాప్స్ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుక గూగుల్ రెడీ అవుతోంది. అందులోభాగంగా ప్రభుత్వ యాప్స్‌కు లేబుల్స్‌ను తీసుకురానుంది. నకిలీ యాప్స్ తో మోసాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్ కు చెక్ పెట్టనున్నది గూగుల్. టెక్నాలజీ పెరగడంతో ఫేక్ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వానికి చెందిన యాప్స్ కు గూగుల్ ప్లే స్టోర్‌ లేబుల్‌ను తీసుకొచ్చింది. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లకు లేబుల్‌ కనిపించనున్నది. ఆ లేబుల్‌పై క్లిక్‌ చేస్తే ఒక పాప్‌-అప్‌ ఓపెన్‌ అయి ‘వెరిఫైడ్‌’ అని చూపుతుంది.

Google

ఇలా అసలైన యాప్‌ను నిర్ధారించుకోవచ్చు. సర్టిఫైడ్ యాప్‌ల కోసం బ్యాడ్జిలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం, డెవలపర్‌లతో కలసి పనిచేసినట్లు గూగుల్ తెలిపింది. భారత్‌తో పాటు, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, జపాన్, దక్షిణకొరియా, అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికోతో సహా 14 కంటే ఎక్కువ దేశాల్లో ఈ లేబుల్స్‌ను విడుదల చేశామని తెలిపింది. త్వరలోనే అవి ఆయా దేశాల్లో అందుబాటులోకి వస్తాయని గూగుల్ వెల్లడించింది. ఈ వెసులుబాటు అందుబాటులోకి వస్తే.. యూజర్లు డబ్బులు సేఫ్ అయినట్టే. ఎందుకంటే ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నప్పుడు వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో అకౌంట్ లోని డబ్బులు కాజేసే అవకాశం ఉంటుంది. కానీ గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయంతో యూజర్లకు లాభం కలుగనున్నది.