Tirupathi Rao
Details Of Click Here Trend In Twitter: ప్రస్తుతం ఎక్స్.కామ్ లో ఒక ట్రెండ్ నడుస్తోంది. అందరూ క్లిక్ హియర్ అని ఇమేజెస్ పెడుతున్నారు. అది ఎదుకు అలా పెడుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. మరి.. ఆ పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోండి.
Details Of Click Here Trend In Twitter: ప్రస్తుతం ఎక్స్.కామ్ లో ఒక ట్రెండ్ నడుస్తోంది. అందరూ క్లిక్ హియర్ అని ఇమేజెస్ పెడుతున్నారు. అది ఎదుకు అలా పెడుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. మరి.. ఆ పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోండి.
Tirupathi Rao
ప్రస్తుతం సోషల్ మీడియా ఏ రేంజ్ లో ఉందో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్టింట ఏం జరిగినా అది ఇట్టే ట్రెండ్ అయిపోతుంది. ఒకరు ఒక విషయాన్ని స్టార్ట్ చేస్తే దానిని అందరూ కంటిన్యూ చేస్తూ ఉంటారు. దానిని ట్రెండ్ అంటారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఎక్స్.కామ్ లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక ఇండియాలోనే కాకుండా.. వరల్డ్ వైడ్ గా ఈ ట్రెండ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం మాత్రమే కాకుండా.. అసలు ఏంటి ఇది బుర్ర బద్దలు కొట్టుకనేలా చేస్తోంది. నెట్టింట హుషారుగా ఉండే వారికి ఈ “Click Here” ట్రెండ్ గురించి తెలిసే ఉంటుంది. కాకపోతే ఎవరికైతే ఈ ట్రెండ్ ఏంటో తెలియదో వాళ్లు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి. మీరు కూడా ఈ ట్రెండ్ ఏంటో తెలుసుకోవడం మాత్రమే కాదు.. ఆ ట్రెండ్ ని మీరు కూడా ఫాల అవ్వచ్చు.
ప్రస్తుతం ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే అందరి వాల్ మీద ఒకటే మ్యూజిక్కు. ఎవరి వాల్ చూసినా.. క్లిక్ హియర్ అంటూ ఇమేజెస్ కనిపిస్తూ ఉంటున్నాయి. ఇండివిడ్యూవల్స్ నుంచి బడా బడా స్టార్లు, సంస్థలు, ఎంటర్ టైన్మెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఇదే వరల్డ్ వైడ్ ట్రెండింగ్ టాపిక్. ఇదేం పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. ఇది జస్ట్ Alt ఇమేజ్ టెక్స్ట్ అనమాట. ఆ క్లిక్ హియర్ ఇమేజ్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్ లో Alt అనే అని కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఒక మెసేజ్ కనిపిస్తుంది. దానిని Alt Text లేదా ఇమేజ్ డిస్క్రిప్షన్ అంటారు.
మీరు ఇమేజ్ యాడ్ చేసే సమయంలో ఆ ఇమేజ్ కి సంబంధించి ఇచ్చే వివరణ, స్పెషల్ ఇన్ఫో అనమాట. ఇప్పుడు ఇది ఎక్స్.కామ్ లో తెగ ట్రెండింగ్ లో ఉంది. అందరూ క్లిక్ హియర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. తాము అడగాలి అనుకున్న ప్రశ్నలు అడుగుతున్నారు. దానితో మీరు ఏకీభవిస్తే రీట్వీట్ చేయండి అంటున్నారు. ఈ ఇమేజ్ డిస్క్రిప్షన్ ముఖ్య ఉద్దేశం చూపు తక్కువగా ఉన్న వారికి కూడా ఆ ఇమేజ్ ఎందుకోసం అనేది చెప్పడం కోసం. దీనిని ఇప్పుడు ఇలా ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి చాలామందికి ఈ ఆల్ట్ టెక్ట్స్ ముఖ్య ఉద్దేశం తెలియకపోవచ్చు.
ఈ క్లిక్ హియర్ ట్రెండ్ ని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఇలా చేయండి. మీ ఎక్స్.కామ్ ఖాతా ఓపెన్ చేయండి. టాప్ లో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఉంటుంది. దానిలో ఫస్ట్ మీకు ఇమేజ్ యాడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మీరు ఈ క్లిక్ హియర్ ఇమేజ్ ని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇమేజ్ కింద ట్యాగ్, డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ సెలక్ట్ చేసుకోండి. పైన మీకు Alt అని చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వండి. రైట్ కార్నర్ లో సేవ్ అని ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత మీరు పోస్ట్ చేయాలి. మీరు పోస్ట్ చేసిన తర్వాత ఇమేజ్ కి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో Alt అని కనిపిస్తూ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు పెట్టిన డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. మరి.. ఈ ట్రెండ్ ని మీరు కూడా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.