iDreamPost
android-app
ios-app

ప్యూర్‌ ఈవీ నుంచి ఎకోడ్రిఫ్ట్‌ ఈవీ బైక్‌.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 171 కి.మీ!

ఈవీ బైక్ లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు బైక్ లు కూడా మార్కెట్ లోకి లాంచ్ అవుతున్నాయి. ఇటీవల ప్యూర్ ఈవీ ఎకోడ్రిఫ్ట్‌ 350 పేరిట ఎలక్ట్రిక్‌ బైక్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం..

ఈవీ బైక్ లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు బైక్ లు కూడా మార్కెట్ లోకి లాంచ్ అవుతున్నాయి. ఇటీవల ప్యూర్ ఈవీ ఎకోడ్రిఫ్ట్‌ 350 పేరిట ఎలక్ట్రిక్‌ బైక్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం..

ప్యూర్‌ ఈవీ నుంచి ఎకోడ్రిఫ్ట్‌ ఈవీ బైక్‌.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 171 కి.మీ!

విద్యుత్ వాహనాల హవా కొనసాగుతోంది. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రయాణ ఖర్చు తగ్గుతుండడంతో ఈవీ లను కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈవీ వాహనాల తయారీ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో బైక్ లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఓలా ఈవీ రంగంలో అదరగొడుతోంది. కాగా ఇప్పుడు దేశీయ కంపెనీ ప్యూర్ ఈవీ సరికొత్త బైక్ ను లాంచ్ చేసింది. ఎకోడ్రిఫ్ట్‌ 350 పేరిట ఎలక్ట్రిక్‌ బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జీంగ్ పెడితే 171 కి. మీలు ప్రయాణించొచ్చని కంపెనీ వెల్లడించింది.

ఇండియన్ మార్కెట్ లో టూ వీలర్స్ హవా కొనసాగుతోంది. వినియోగాదారుల అభిరుచులకు తగ్గట్లు, వినూత్నమైన మోడల్స్, అద్బుతమైన ఫీచర్లతో ఈవీ కంపెనీలు బైక్ లను రూపొందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు బైక్ లకు కూడా కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే ప్యూర్ ఈవీ ఎకోడ్రిఫ్ట్‌ 350 ని లాంచ్ చేసింది. దీని ధర రూ.1.30 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఇందులో 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుపర్చారు. ఎకోడ్రిఫ్ట్‌ బైక్‌ గరిష్ఠ వేగం 75 kmph అని కంపెనీ వెల్లడించింది.

ఆరు ఎంసీయూలు ఉన్న 3 kW ఎలక్ట్రిక్‌ మోటార్‌తో ఎకోడ్రిఫ్ట్‌ బైక్ వస్తోంది. ఈ మోటార్‌ 40 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. రైడర్ అవసరానికి అనుగుణంగా మొత్తం మూడు రైడింగ్‌ మోడ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ ఎకోడ్రిఫ్ట్‌ 350 లో రివర్స్‌ మోడ్‌, కోస్టింగ్‌ రీజెన్, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, డౌన్‌ హిల్‌ అసిస్ట్‌, పార్కింగ్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ లైఫ్‌ పెరిగేలా స్మార్ట్‌ ఏఐ ఫీచర్‌ను కూడా పొందుపరిచినట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో ప్యూర్‌ ఈవీ నుంచి సరికొత్త ఫీచర్లతో మరిన్ని దీర్ఘ- శ్రేణి వాహనాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సీఈవో రోహిత్‌ తెలిపారు. కాగా ప్యూర్‌ ఈవీ నుంచి ఇప్పటికే ఈ ప్లూటో 7G, ఈ ప్లూటో 7G Max, ఈ ప్లూటో 7G Pro, బైక్‌లు విడుదలయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి